S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/17/2016 - 05:49

హాంకాంగ్, ఏప్రిల్ 16: భారత వర్థమాన టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఆచంట శరత్ కమల్‌తో పాటు వౌమా దాస్ రియో ఒలింపిక్స్‌కు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. హాంకాంగ్‌లో శనివారం వీరు స్టేజ్-2 ఆసియా ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్ ఫైనల్ రౌండ్లలో తమతమ ప్రత్యర్థులపై విజయం సాధించడంతో ఒలింపిక్ బెర్తులు ఖరారయ్యాయి.

04/17/2016 - 05:48

రియో డీ జెనిరో, ఏప్రిల్ 16: బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో ప్రారంభమైన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్) వరల్డ్ కప్ టోర్నీలో భారత ట్రాప్ షూటర్లు మానవ్‌జీత్ సింగ్ సంధూ, కినాన్ చెనాయ్ తొలి రోజు శుభారంభాన్ని సాధించారు.

04/16/2016 - 07:11

ఇపో (మలేసియా), ఏప్రిల్ 15: ప్రతిష్టాత్మకమైన సుల్తాన్ అజ్లన్ షా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు టైటిల్ పోరుకు సిద్ధమైంది. తప్పక గెలవాల్సిన చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో భారత్ శుక్రవారం ఇక్కడ ఆతిథ్య మలేసియా జట్టును 6-1 గోల్స్ తేడాతో మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో భారత జట్టు ఫైనల్‌కు చేరడం ఇది ఏడోసారి.

04/16/2016 - 06:53

మాంటే కార్లో, ఏప్రిల్ 15: మాంటే-కార్లో మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే, ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్, ఫ్రాన్స్‌కు చెందిన జో-విల్‌ఫ్రెడ్ సోంగా, గేల్ మోన్‌ఫిల్స్ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. అయితే స్విట్జర్లాండ్‌కు చెందిన దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్‌కు క్వార్టర్ ఫైనల్స్‌లోనే చుక్కెదురైంది.

04/16/2016 - 06:52

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు బోణీ చేసింది. ఇంతకుముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు శుక్రవారం న్యూఢిల్లీలోని సొంత మైదానం ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించి తొలి విజయాన్ని అందుకుంది.

04/16/2016 - 06:52

కరాచీ, ఏప్రిల్ 15: పాకిస్తాన్ క్రికెట్ చీఫ్ సెలెక్టర్‌ను ఎంపిక చేసేందుకు పిసిబి (పాక్ క్రికెట్ బోర్డు) తన అనే్వషణను ముమ్మరం చేసింది. ఈ పదవిని చేపట్టేందుకు పాక్ జాతీయ జట్టు మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్‌హక్ ఆసక్తిని వ్యక్తం చేశాడు. దీంతో ఈ పదవి కోసం రేసులో ఉన్న ఆశావహుల జాబితాలో ఇంజమామ్ పేరును కూడా చేర్చి ఆ జాబితాను పిసిబి మరింత పొడిగించింది.

04/16/2016 - 06:51

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: కరవుతో అల్లాడుతున్న మహారాష్టన్రుంచి 13 ఐపిఎల్ మ్యాచ్‌లను వేరే చోటికి మార్చాలన్న ముంబయి హైకోర్టు ఆదేశం తర్వాత తన షెడ్యూల్ అంతా ఒక్కసారిగా కకావికలు కావడంతో ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్‌కి వేదికగా ముంబయికి బదులు బెంగళూరును ఎంపిక చేసుకోవడంతో పాటు హైకోర్టు తీర్పు కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి చెందిన ప్రాంచైజీలకు నాలుగు ప్రత్యామ్నాయ హోమ్ ఆప్షన్లను ఇచ్చింది.

04/15/2016 - 04:30

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: మహారాష్టల్రో ఐపిఎల్ మ్యాచ్‌లు జరుగుతాయా లేదా అన్న విషయంలో తుది నిర్ణయం శుక్రవారం వెలువడే అవకాశం కనిపిస్తున్నది. చైర్మన్ రాజీవ్ శుక్లా నేతృత్వంలో ఐపిఎల్ నిర్వాహణ కమిటీ ఇక్కడ సమావేశమై, బాంబే హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై చర్చిస్తుంది.

04/15/2016 - 04:28

ఇపో (మలేసియా), ఏప్రిల్ 14: ప్రతిష్ఠాత్మక అజ్లన్ షా హాకీ టోర్నమెంట్ ఫైనల్ చేరేందుకు చివరి అవకాశానిన సద్వినియోగం చేసుకోవడానికి, శుక్రవారం నాటి చివరి లీగ్ మ్యాచ్‌లో మలేసియాతో భారత్ చావోరేవో తేల్చుకోవడానికి సిద్ధమైంది. సర్దార్ సింగ్ నాయకత్వంలోని ఈ జట్టు 5-1 గోల్స్ తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తుచేసి అభిమానుల ఆశలు పెంచింది.

04/15/2016 - 04:26

రాజ్‌కోట్, ఏప్రిల్ 14: గత సీజన్ వరకూ ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో ఆడిన సురేష్ రైనా ఈ సీజన్‌లో గుజరాత్ లయన్స్ కెప్టెన్‌గా అతనికే షాకిచ్చాడు. రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌తో గురువారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ మరో 12 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది.

Pages