S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/24/2016 - 00:41

పారిస్, మే 23: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రిన్కా ముందంజ వేశాడు. పలు మ్యాచ్‌లకు వర్షం కారణంగా ఆటంకం ఏర్పడగా, వాయిదా పడిన కొన్ని మ్యాచ్‌లు సోమవారం పూర్తయ్యాయి. మరికొన్ని మ్యాచ్‌లు ఆలస్యంగా జరగనున్నాయి. కాగా, తొలి రౌండ్‌లో వావ్రిన్కా 4-6, 6-1, 3-6, 6-3, 6-4 తేడాతో లుకాస్ రసోల్‌ను ఓడించాడు.

05/24/2016 - 00:38

సెవిల్లాను 2-0 తేడాతో ఓడించి కోపా డెల్ రే కప్‌ను కైవసం చేసుకున్న బార్సిలోనా ఆటగాళ్లు. ఈ టైటిల్‌ను బార్సిలోనా గెల్చుకోవడం ఇది 28వ సారి

05/24/2016 - 00:36

మాంచెస్టర్, మే 23: చీఫ్ కోచ్ లూయిస్ వాన్ గాల్‌కు మాంచెస్టర్ యునైటెడ్ యాజమాన్యం ఉద్వాసన పలికింది. ప్రీమియర్ లీగ్ సాకర్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన యునైటెడ్ ఐదో స్థానానికి పడిపోవడంతో అతనిపై వేటు పడింది. సాకర్‌లో తిరుగులేని శక్తిగా ఎదిగిన అతనికి ఎక్కడా నిలకడగా ఉండే అలవాటు లేదు. అయితే, ఇప్పటి వరకూ తాను మార్పును కోవరుకుంటే, ఈసారి క్లబ్ యాజమాన్యమే అతని తప్పించడం గమనార్హం.

05/24/2016 - 00:36

న్యూఢిల్లీ, మే 23: భారత హాకీ జట్టు కెప్టెన్‌గా డిఫెండర్ సుశీల చానును నియమించినట్టు హాకీ ఇండియా (హెచ్‌ఐ) సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. డార్విన్ (ఆస్ట్రేలియా)లో జరిగే నాలుగు దేశాల హాకీ టోర్నమెంట్‌ల పాల్గొనే భారత జట్టుకు ఆమె నాయకత్వం వహిస్తుందని పేర్కొంది.

05/24/2016 - 00:35

అబూదబీ, మే 23: భారత క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ ఇక్కడ జరిగిన ఆసియా 6-రెడ్ స్నూకర్ టైటిల్‌ను గెల్చుకొని కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌తోపాటు కాంటినెంటల్ స్థాయిలో జరిగిన పోటీలోనూ టైటిల్‌ను అందుకున్న తొలి బిలియర్డ్స్, స్నూకర్ క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పాడు.

05/24/2016 - 00:33

ముంబయి, మే 23: పరిమిత ఓవర్ల విభాగంలో టీమిండియాకు నాయకత్వ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీని తప్పించి, అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తున్న టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆ విభాగాన్ని కూడా అప్ప చెప్తారన్న ఊహాగానాలకు జాతీయ సెలక్టర్లు తెరదించారు. జింబాబ్వేలో వచ్చేనెల 11 నుంచి 20వ తేదీ వరకు జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు జాతీయ సెలక్టర్లు ధోనీనే కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

05/23/2016 - 07:56

కోల్‌కతా, మే 22: కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపిఎల్ ప్లే ఆఫ్‌కు దూసుకెళ్లింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన కీలక మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో విజయభేరి మోగించిన నైట్‌రైడర్స్ మొత్తం 16 పాయింట్లతో మూడో స్థానాన్ని ఆక్రమించింది.

05/23/2016 - 07:54

ముంబయి, మే 22: టీమిండియాకు కోచ్ నియామకం ఇప్పుడే జరగదని, కనీసం రెండుమూడు నెలల సమయం పడుతుందని భారత మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం (సిఎబి) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. బిసిసిఐ ప్రత్యేక వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన అతను విలేఖరులతో మాట్లాడుతూ జింబాబ్వే టూర్‌కు టీమిండియా వెళ్లేలోగా కోచ్ నియామకం జరుగుతుందా లేదా అన్నది తాను ఇప్పుడే చెప్పలేనని అన్నాడు.

05/23/2016 - 08:38

ముంబయి, మే 22: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఇప్పటి వరకూ ఈ పదవికి ఎన్నికైన వారిలో అత్యంత పిన్న వయస్కుడిగా 41 ఏళ్ల ఠాకూర్ గుర్తింపు సంపాదించాడు. బోర్డు కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఠాకూర్ ఒక్కడే నామినేషన్ వేయడంతో, అతని ఏకగ్రీవ ఎన్నిక శనివారం నాడే ఖరారైంది. ఆదివారం జరిగిన ప్రత్యేక వార్షిక సమావేశం అతని ఎన్నిక లాంఛనమైంది.

05/23/2016 - 07:52

కన్హాన్ (చైనా), మే 22: బాడ్మింటన్ పురుషుల టీం ఈవెంట్ థామస్ కప్ చాంపియన్‌షిప్‌ను డెన్మార్క్ మొట్టమొదటి సారి కైవసం చేసుకుంది. ఆదివారం నాటి ఫైనల్‌లో ఈ జట్టు ఇండోనేషియాను 3-2 తేడాతో ఓడించింది. విక్టర్ అక్సెల్సెన్ 21-17, 21-18 తేడాతో టామీ సుగియార్తోను ఓడించి డెన్మార్క్‌కు శుభారంభాన్ని అందించాడు.

Pages