S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/22/2016 - 02:22

విశాఖపట్నం (స్పోర్ట్స్), మే 21: ఇది వరకే ఐపిఎల్ రేసు నుంచి వైదొలగిన రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్ల మధ్య శనివారం జరిగిన గ్రూప్ మ్యాచ్ వల్ల ఇరు జట్లకు ప్రయోజనం లేకపోయినా, చివరి క్షణం వరకూ ఉత్కంఠను రేపింది. పంజాబ్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించడం మాత్రం పరిమిత ఓవర్లలో భారత్‌కు నాయకత్వం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీకి వ్యక్తిగతంగా కొంతలో కొంత ఊరటనిచ్చింది.

05/21/2016 - 18:26

కజికిస్థాన్: భారత్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత మహిళా బాక్సర్ మేరీ కోమ్ ఈ ఏడాది రియోలో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది. కజికిస్థాన్‌లో జరుగుతున్న ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్ షిప్ రెండో రౌండ్‌లో ఆమె ఓటమిని చవిచూసింది. శనివారం జరిగిన రెండో రౌండ్‌లో జర్మనీ బాక్సర్ నియానీ చేతిలో ఆమె పరాజయం చవిచూసింది. ఈ టోర్నమెంట్‌లో సెమీస్‌కు చేరిన వారికి ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అవకాశం దక్కుతుంది.

05/21/2016 - 06:17

రాయ్‌పూర్, మే 20: ఐపిఎల్-9లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు ప్లే-ఆఫ్ దశకు చేరుకునే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. రాయ్‌పూర్‌లో శుక్రవారం టేబుల్ టాపర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

05/21/2016 - 06:14

కరాచి, మే 20: స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషి అయిన పాకిస్తాన్ పేస్ బౌలర్ మహమ్మద్ అమీర్‌కు బ్రిటీష్ వీసా కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పిసిబి) శుక్రవారం దరఖాస్తు సమర్పించింది. బ్రిటన్ గనుక అమీర్‌కు వీసా మంజూరు చేసిన పక్షంలో అతను వచ్చే జూన్‌లో ఇంగ్లండ్‌లో పర్యటించే పాక్ క్రికెట్ జట్టు వెంట వెళ్లడానికి వీలవుతుంది.

05/21/2016 - 06:14

కున్హాన్ (చైనా), మే 20: ఉబెర్ కప్ మహిళల బాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు మరోసారి కాంస్య పతకంతో సరిపుచ్చుకుంది. చైనాలోని కున్హాన్‌లో శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో భారత జట్టు 0-3 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ చైనా చేతిలో ఓటమిపాలవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. తొలుత సింగిల్స్‌లో జరిగిన రెండు మ్యాచ్‌లలో టాప్ షట్లర్లు సైనా నెహ్వాల్, పివి.సింధు భారత్‌కు శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు.

05/21/2016 - 06:13

తావోయువాన్ సిటీ (తైవాన్), మే 20: ఇక్కడ జరుగుతున్న తైవాన్ ఓపెన్ అథ్లెటిక్ మీట్‌లో శుక్రవారం మన దేశానికి చెందిన యువ స్ప్రింటర్ దుతీ చాంద్ మహిళల 200 మీటర్ల రేస్‌లో బంగారు పతకాన్ని సాధించింది. ఈ రేస్‌లో మూడు పతకాలు కూడా మన దేశానికే లభించడం గమనార్హం.

05/21/2016 - 06:13

కాన్పూర్, మే 20: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ జట్టు గుజరాత్ లయన్స్‌తో చావో-రేవో తేల్చుకోనుంది. ప్రస్తుత ఐపిఎల్ సీజన్‌లో ఈ రెండు జట్లకు చివరిదైన ఈ లీగ్ మ్యాచ్ శనివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.

05/21/2016 - 06:12

మ్యూనిచ్, మే 20: జర్మనీలోని మ్యూనిచ్‌లో గురువారం నుంచి ప్రారంభమైన ఐఎస్‌ఎస్‌ఎఫ్ (ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్) థర్డ్ లెగ్ ప్రపంచ కప్ (రైఫిల్/పిస్తోల్) పోటీల్లో పాల్గొంటున్న 25 మంది సభ్యుల భారత బృందానికి ఒలింపిక్ మాజీ చాంపియన్ అభినవ్ బింద్రా సారథ్యం వహిస్తున్నాడు. ఈ పోటీల్లో పాల్గొంటున్న భారత బృందంలో 17 మంది షూటర్లు, ఎనిమిది మంది అధికారులు ఉన్నారు.

05/20/2016 - 01:23

రాయ్‌పూర్, మే 19: ఐపిఎల్ నాకౌట్ దశకు చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీకొనేందుకు ఢిల్లీ డేర్‌డెవిల్స్ సిద్ధమవుతున్నది. డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ ఇప్పటి వరకూ 12 మ్యాచ్‌లు ఆడి ఎనిమిది విజయాలు సాధించింది. మొత్తం 16 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించింది.

05/20/2016 - 01:22

బెంగళూరు, మే 19: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడి పేరే మారుమోగుతోంది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో అతను 50 బంతుల్లోనే, 12 ఫోర్లు, 8 సిక్సర్లతో 113 పరుగులు చేసి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ ఐపిఎల్ సీజన్‌లో అతనికి ఇది నాలుగో శతకం.

Pages