S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/20/2016 - 01:21

కున్హాన్ (చైనా), మే 19: మహిళల టీం చాంపియన్‌షిప్ ఉబేర్ కప్‌లో భారత్ కనీసం కాంస్యాన్ని ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్‌లో థాయిలాండ్‌ను 3-1 తేడాతో ఓడించిన భారత్ సెమీస్ చేరింది. నిబంధనలను అనుసరించి సెమీస్‌లో ఓడిన జట్లకు కాంస్య పతకం లభిస్తుంది. భారత జట్టు ముందంజ వేస్తే, టైటిల్ సాధిస్తుంది లేదా రన్నర్ ట్రోఫీని అందుకుంటుంది. ఒకవేళ ఓడితే, కాంస్య పతకాన్ని అందుకుంటుంది.

05/20/2016 - 01:19

మాంచెస్టర్, మే 19: ఏ క్రీడలోనైనా సహజంగా ఆటగాళ్లు పేరుప్రఖ్యాతులు ఆర్జిస్తారే తప్ప వారిని అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దే కోచ్‌ల గురించి పట్టించుకోరు. ప్రత్యేకించి సాకర్ వంటి క్రీడలో కోచ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నా, వారు ఎప్పటికీ తెరవెనుకే ఉండిపోతారు. కానీ, మాంచెస్టర్ యునైటెడ్ కోచ్ లూయిస్ వాన్ గాల్ మాత్రం ఇందుకు విరుద్ధం. ఆటగాళ్లను మించిన క్రేజీని సంపాదించుకున్నాడు.

05/20/2016 - 01:18

న్యూఢిల్లీ, మే 19: ఐపిఎల్‌లో గాయపడి టోర్నీకి దూరమవుతున్న ఆటగాళ్ల జాబితాలో తాజాగా వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా కూడా చేరాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న అతను కాలి కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో మ్యాచ్ జరిగినప్పుడు సమస్య మరింత తీవ్రం కావడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు.

05/20/2016 - 01:16

అస్టానా (కజకస్థాన్), మే 19: ఇక్కడ జరుగుతున్న ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ మేరీ కోమ్ రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. 51 కిలోల విభాగంలో బరిలోకి దిగిన ఆమె 3-0 తేడాతో స్వీడన్‌కు చెందిన జూలియానా సొడెర్‌స్ట్రామ్‌పై గెలిచింది. తర్వాతి రౌండ్‌లో ఆమె జర్మనీ బాక్సర్ అజీజె నిమానీతో తలపడుతుంది.

05/20/2016 - 01:15

కాన్పూర్, మే 19: కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ లయన్స్ జట్ల మధ్య గురువారం ఇక్కడి గ్రీన్ పార్క్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో స్కోరింగ్ కారణంగా అభిమానులను నిరాశకు గురి చేసింది. గుజరాత్ ఎలాంటి సమస్య లేకుండా, మరో 39 బంతులు మిగిలి ఉండగానే, ఆరు వికెట్ల తేడాతో విజయభేరి మోగించి, అభిమానులకు ఊరటనిచ్చింది.

05/19/2016 - 08:27

విశాఖపట్నం (స్పోర్ట్స్), మే 18: ఢిల్లీ డేర్‌డెవిల్స్ పేసర్ నాథన్ కౌల్టర్ నైల్ వేసిన బంతి ధాటికి హెల్మెట్ ఎగిరి పడినప్పటికీ గాయం కాకుండా తప్పించుకోవడం తన అదృష్టమని రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ బ్యాట్స్‌మన్ జార్జి బెయిలీ వ్యాఖ్యానించాడు. అది భయానకమైన బౌన్సరనీ, ఒక ట్రక్కు వేగంగా వచ్చి గుద్దుకున్నట్టు అనిపించిందని ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ చెప్పాడు.

05/19/2016 - 08:25

లండన్, మే 18: రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవాను నాలుగు సంవత్సరాలు నిషేధిస్తున్నట్టు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ప్రకటించింది. ఆమె నిషిద్ధ ద్రవ్యమైన మెల్డోనియంను వాడినట్టు డోపింగ్ పరీక్షలో వెల్లడైన విషయం తెలిసిందే. ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) కంటే ముందే ఉత్ప్రేరకం వాడిన విషయాన్ని షరపోవా విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ ప్రకటించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

05/19/2016 - 08:24

కున్హాన్ (చైనా), మే 18: ఉబెర్ కప్ మహిళల టీం చాంపియన్‌షిప్ బాడ్మింటన్ టోర్నీలో భారత జట్టు క్వార్టర్ ఫైనల్స్ చేరగా, పురుషుల విభాగంలో థామస్ కప్ కోసం జరుగుతున్న పోరులో భారత్ వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసి నిష్క్రమించింది. బుధవారం నాటి పోటీల్లో భారత మహిళల జట్టు కూడా ఓటమిపాలైంది. అయితే, అంతకు ముందు వరుసగా రెండు విజయాలను సాధించడంతో క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది.

05/19/2016 - 08:23

లండన్, మే 18: డోప్ దోషులకు రియో ఒలింపిక్స్‌లో స్థానం లేదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) అధ్యక్షుడు థామస్ బాచ్ స్పష్టం చేశాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న 31 మంది డోపింగ్ పరీక్షలో పట్టుబడినట్టు ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) చేసిన ప్రకటనపై అతను స్పందిస్తూ నిషిద్ధ మాదక ద్రవ్యాలను వాడడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని అన్నాడు.

05/19/2016 - 08:22

శ్రీకాకుళం, మే 18: రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా జాతీయ క్రీడల నిర్వాహణకు శాప్ పాలకమండలి కసరత్తు ప్రారంభించింది. రాష్టమ్రంతటా జిల్లాలవారీగా నిర్వహిస్తున్న పర్యటనలో భాగంగా బుధవారం ఇక్కడ కోడిరామ్మూర్తి స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికారిత సంస్థ (శాప్) అధ్యక్షుడు పిఆర్ మోహన్ అధ్యక్షతన 7వ పాలకమండలి సమావేశం జరిగింది.

Pages