S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/30/2016 - 08:13

ఉహాన్ (చైనా), ఏప్రిల్ 29: ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో స్థిరంగా ముందుకు సాగుతున్న ఒలింపిక్ కాంస్య పతక విజేత, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ చైనాలోని ఉహాన్‌లో జరుగుతున్న ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో ఆమె చైనాకు చెందిన మాజీ ప్రపంచ చాంపియన్ షిగ్జియాన్ వాంగ్‌పై వరుస గేముల తేడాతో విజయం సాధించింది.

04/29/2016 - 07:37

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ఆల్‌రౌండర్ సయ్యద్ షాబుద్దీన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్‌గా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా అతను 80 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 2,567 పరుగులు సాధించాడు. 248 వికెట్లు పడగొట్టాడు. 2013 తర్వాత అతనికి దేశవాళీ పోటీల్లో ఆడే అవకాశం రాలేదు.

04/29/2016 - 07:37

బాండిపురా (జమ్మూ కశ్మీర్), ఏప్రిల్ 28: ఇటలీలో జరిగే ప్రపంచ కిక్‌బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు చెందిన ఏడేళ్ల బాలిక తాజముల్ ఇస్లాం పోటీపడనుంది. గత ఏడాది జాతీయ కిక్‌బాక్సింగ్ చాంపియన్‌షిప్ సబ్ జూనియర్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించి సంచలనం సృష్టించిన తాజముల్ జాతీయ చాంపియన్ హోదాలో ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు అర్హత సంపాదించిది.

04/29/2016 - 07:36

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: తన టి-20 కెరీర్‌లో గుజరాత్ లయన్స్‌తో బుధవారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో ఆడిన ఇన్నింగ్స్ అత్యుత్తమమైనదని ఢిల్లీ డేర్‌డెవిల్స్ సూపర్ హీరో క్రిస్ మోరీ అన్నాడు. 10.4 ఓవర్లలో 57 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన డేర్‌డెవిల్స్‌కు అండగా నిలిచిన మోరిస్ 32 బంతుల్లో అజేయంగా 82 పరుగులు సాధించాడు.

04/29/2016 - 07:36

వెల్లింగ్టన్, ఏప్రిల్ 28: స్టార్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్‌సన్‌కు టెస్టు, వనే్డ, టి-20 ఫార్మెట్స్‌లో న్యూజిలాండ్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం దక్కింది.

04/29/2016 - 07:35

పుణె, ఏప్రిల్ 28: ఐపిఎల్‌లో గత ఏడాది వరకూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కలిసి ఆడి, ఇప్పుడు రెండు వేర్వేరు జట్లకు నాయకత్వం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా మధ్య పోరు మరోసారి తెరపైకి రానుంది. ఐపిఎల్‌లో కొత్తగా అడుగుపెట్టిన రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, గుజరాత్ లయన్స్ జట్లు శుక్రవారం తలపడనుండడంతో ఇద్దరిలో గెలుపు ఎవరిదన్నది ఉత్కంఠ రేపుతోంది.

04/29/2016 - 07:33

ఉహాన్ (చైనా), ఏప్రిల్ 28: ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ చేరగా, పివి సింధు ఓటమిపాలై నిష్క్రమించింది. రెండో రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ ఐదో ర్యాంక్ క్రీడాకారిణి, హైదరాబాదీ సైనా 21-14, 21-18 తేడాతో నిచావొన్ జిందాపొల్‌ను ఓడించింది. సైనా ఇప్పటి వరకూ జిందాపొల్‌తో 13 పర్యాయాలు ఢీకొని, ఆరో విజయాన్ని నమోదు చేసింది.

04/28/2016 - 04:50

షాంఘై, ఏప్రిల్ 27: భారత స్టార్ ఆర్చర్, ప్రపంచ మాజీ నంబర్ వన్ దీపికా కుమారి ఇక్కడ జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ మిక్స్‌డ్ టీం ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. ఈ క్రమంలోనే ఆమె మహిళల రికర్వ్ విభాగంలో ప్రపంచ రికార్డును సమం చేసింది. లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కి బో బయే (దక్షిణ కొరియా) 686 పాయింట్లతో నెలకొల్పిన రికార్డును దీపిక సమం చేసింది.

04/28/2016 - 04:48

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా మహారాష్టక్రు కేటాయించిన మ్యాచ్‌ల్లో ఈనెల 30 తర్వాత జరగాల్సిన మ్యాచ్‌లను మరో కేంద్రానికి తరలించాలన్న బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు బలపరచింది. అయితే, వివిధ కారణాలను దృష్టిలో ఉంచుకొని మే ఒకటిన రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌కి బాంబే హైకోర్టు ఇచ్చిన అనుమతిని కొట్టేసింది.

04/27/2016 - 06:01

హైదరాబాద్, ఏప్రిల్ 26: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టు ఎట్టకేలకు రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఉప్పల్ (హైదరాబాద్)లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మంగళవారం ఆ జట్టు 34 తేడాతో ఆతిథ్య సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది.

Pages