S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/26/2015 - 06:35

కోల్‌కతా, నవంబర్ 25: లెజెండరీ టెన్నిస్ స్టార్ మార్టినా నవ్రతిలోవా, లియాండర్ పేస్ జోడీపై సానియా మీర్జా, మహేష్ భూపతి జోడీ 7-5, 7-5 తేడాతో విజయం సాధించింది. ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపిటిఎల్)ను ప్రమోట్ చేసేందుకు ఇక్కడ జరిగిన ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మ్యాచ్ ఆరంభించేందుకు వచ్చి, కొద్దిసేపు సరదాగా టెన్నిస్ ఆడింది.

11/26/2015 - 06:34

పారిస్, నవంబర్ 25: యూరోపియన్ ఫుట్‌బాల్ సమాఖ్య (యూఫా) ఆధ్వర్యంలో జరుగుతున్న చాంపియన్స్ లీగ్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ బార్సిలోనా ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. పాయింట్ల పట్టికలో గ్రూప్ టాపర్‌గా ఉన్న బార్సిలోనా 6-1 తేడాతో రోమాను చిత్తుచేసి, ఎలాంటి ఇబ్బంది లేకుండా లాస్ట్-16లో చోటు దక్కించుకుంది.

11/26/2015 - 06:33

కొచ్చి, నవంబర్ 25: బాలురు, బాలికలకు వేరువేరు కేంద్రాల్లో విడివిడిగా పోటీలను నిర్వహించాలని భారత పాఠశాల క్రీడల సమాఖ్య (ఎస్‌జిఎఫ్‌ఐ) తీసుకున్న నిర్ణయంపై మాజీ అథ్లెట్ పిటి ఉష ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వివక్ష ఎందుకని అధికారులను నిలదీసింది. వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది.

11/25/2015 - 06:13

టీమిండియా కెప్టెన్ కోహ్లీ వ్యాఖ్య

11/25/2015 - 06:12

న్యూఢిల్లీ, నవంబర్ 24: భారత్‌తో స్వదేశంలోగానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోగానీ ద్వైపాక్షిక సిరీస్ జరిగే అవకాశం లేకపోయినప్పటికీ, తటస్థ వేదికగా శ్రీలంకను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఎంపిక చేసే అవకాశం ఉందన్న వార్త పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)కి ఊరటనిస్తోంది. సహజంగా వేదిక మారినప్పుడు ప్రసార హక్కులకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.

11/25/2015 - 06:11

ఢిల్లీపై చెనె్నయిన్ గెలుపు

11/25/2015 - 06:11

కోల్‌కతా, నవంబర్ 24: సుందర్ వాషింగ్టన్ ఆల్‌రౌండ్ ప్రతిభను కనబరచడంతో, అండర్-19 ముక్కోణపు వనే్డ సిరీస్‌లో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ని నాలుగు వికెట్ల తేడాతో గెల్చుకున్న భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఓపెనర్లు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ మొదటి వికెట్‌కు కేవలం 33 బంతుల్లోనే 67 పరుగులు జోడించి భారత్ ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు.

11/25/2015 - 06:11

నాగపూర్, నవంబర్ 24: గత తొమ్మిదేళ్లలో విదేశాల్లో 14 సిరీస్‌లు ఆడి, పది విజయాలను నమోదు చేసిన దక్షిణాఫ్రికా టెస్టు రికార్డు ప్రమాదంలో పడింది. భారత్‌తో బుధవారం నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టులో గెలిస్తేనే ఆ జట్టు టెస్టు సిరీస్‌లో నిలబడుతుంది. 2006లో శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు ఎదురైన పరాజయం తర్వాత, ఇప్పటి వరకూ విదేశాల్లో దక్షిణాఫ్రికా ఒక్క ఓటమిని కూడా చవిచూడలేదు.

11/25/2015 - 06:10

దక్షిణాఫ్రికా కెప్టెన్ ఆమ్లా వెల్లడి

11/25/2015 - 06:32

నేటి నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టెస్టు

Pages