S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/05/2016 - 04:12

న్యూఢిల్లీ: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) వెంటనే స్పందించి, ఆటగాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని భారత మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ సూచించాడు. సమస్యల వల్ల క్రికెటర్లు ఆటపై దృష్టి కేంద్రీకరించలేకపోతారని ట్వీట్ చేశాడు. ఎంతో సంయమనంతో వ్యవహరించి, పట్టుదలతో పోరాడి టి-20 వరల్డ్ కప్‌ను అందించిన ఆటగాళ్ల సమస్యలపై వెంటనే చర్చించాలని డబ్ల్యుఐసిబి అధికారులను సచిన్ కోరాడు.

04/05/2016 - 04:11

కోల్‌కతా, ఏప్రిల్ 4: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించిన టి-20 జట్టుకు భారత బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆదివారం ముగిసిన టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో తమీమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్) 295 పరుగులు సాధించగా, కోహ్లీ 273 పరుగులతో టాప్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానాన్ని ఆక్రమించాడు. భారత్ నుంచి వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రాకు కూడా ఈ జట్టులో స్థానం దక్కింది.

04/04/2016 - 06:50

కోల్‌కతా, ఏప్రిల్ 3: టి-20 ప్రపంచ కప్ ఫైనల్ లో ఇంగ్లాండ్‌కు వెస్టిండీస్ షాకిచ్చింది. చివరి వర కూ గెలిచే అవకాశం ఉన్న ఇంగ్లాండ్ నాలుగు వికె ట్ల తేడాతో ఓటమిపాలుకాగా, వెస్టిండీస్ రెండోసారి టి-20 ఫార్మెట్‌లో విశ్వవిజేతగా అవతరించింది. ఇంగ్లాండ్‌ను ఓడించేందుకు 156 పరుగులు చేయా ల్సిన విండీస్ రెండు బంతులు మిగిలి ఉండగానే ల క్ష్యాన్ని చేరింది.

04/04/2016 - 06:47

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: న్యూఢిల్లీలోని సిరి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఇండియన్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను థాయిలాండ్ క్రీడాకారిణి రచానొక్ ఇంతనాన్ గెల్చుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఆమె లీ జురుయ్‌ని 21-17, 21-18 తేడాతో ఓడించింది.

04/04/2016 - 06:45

కోల్‌కతా, ఏప్రిల్ 3: మహిళల టి-20 ప్రపంచ కప్ టైటిల్‌ను వెస్టిండీస్ కైవసం చేసుకుంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్‌లో ‘హ్యాట్రిక్’ విజేత ఆస్ట్రేలియాను ఎనిమిది పరుగుల తేడాతో చిత్తుచేసి, మొదటిసారి టి-20 విశ్వవిజేతగా నిలిచింది.

04/04/2016 - 06:43

మియామీ, ఏప్రిల్ 3: మియామీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌ను విక్టోరియా అజరెన్కా గెల్చుకుంది. ఫైనల్‌లో ఆమె స్వెత్లానా కుజ్నెత్సొవాను 6-3, 6-2 తేడాతో ఓడించింది. తీవ్ర స్థాయిలో పోటీ ఉంటుందని అంతా ఊహించినప్పటికీ ఫైనల్ పోరు ఏకపక్షంగా కొనసాగింది. అజరెన్కా విజృంభణను కుజ్నెత్సొవా సమర్థంగా అడ్డుకోలేకపోయింది.

04/04/2016 - 06:43

కరాచీ, ఏప్రిల్ 3: ఆసియా కప్, టి-20 వరల్డ్ కప్‌లో ఎదురైన పరాజయాలకు పాకిస్తాన్ కెప్టెన్ షహీద్ అఫ్రిదీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్టు అతను ప్రకటించాడు. అయితే, టి-20 ఫార్మెట్‌లో కెరీర్‌ను కొనసాగిస్తానని స్పష్టం చేశాడు.

04/03/2016 - 12:27

వెస్టిండీస్ జట్టు అంటే క్రిస్ గేల్ ఒక్కడే కాదని ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వ్యాఖ్యానించాడు. శనివారం అతను విలేఖరులతో మాట్లాడుతూ విండీస్‌లో గొప్ప ఆటగాళ్లు చాలా మందే ఉన్నారని చెప్పాడు. ఈ టోర్నమెంట్‌కు రాక ముందే తనకు విండీస్ సత్తా ఏమిటో తెలుసునని వ్యాఖ్యానించాడు. భారత్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో విండీస్ విజయం సాధించిన తీరే ఆ జట్టు బలాన్ని తెలియ చేస్తున్నదని చెప్పాడు.

04/03/2016 - 12:25

కోల్‌కతా, ఏప్రిల్ 2: గత మూడు టి-20 వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకొని హ్యాట్రిక్ నమోదు చేసిన ఆస్ట్రేలియా మరోసారి విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది. అయితే, ఆ జట్టుకు వెస్టిండీస్ నుంచి సవాళ్లు ఎదురుకానున్నాయి. 2009లో మొదలైన మహిళల టి-20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. అయితే, ఆతర్వాత ఆస్ట్రేలియా ఆధిపత్యం మొదలైంది.

04/03/2016 - 12:23

మియామీ, ఏప్రిల్ 2: ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకొవిచ్, ‘జెయింట్ కిల్లర్’ కెయ్ నిషికొరి మధ్య జరిగే టైటిల్ పోరులో ఎవరు గెలుస్తాన్నది ఆసక్తికరంగా మారింది. గణాంకాలనుగానీ, ఫామ్‌నుగానీ పరిగణలోకి తీసుకుంటే జొకొవిచ్ టైటిల్ సాధించడం ఖాయంగా కనిపిస్తున్నది. అయితే, నిషికొరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా చెలరేగడం, నిషికొరి అలవాటు.

Pages