S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/25/2016 - 03:21

చండీగఢ్, మార్చి 24: ఆస్ట్రేలియా సూపర్ స్టార్ బ్యాట్స్‌మన్ గ్లేన్ మాక్స్‌వెల్ గురువారం హోలీ సంబరంలో మునిగి తేలాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడుతున్న మాక్స్‌వెల్‌కు పంజాబ్‌లో చాలా మంది అభిమానులు ఉన్నారు. టి-20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో శుక్రవా రం మొహాలీలో ఆస్ట్రేలియా అత్యంత కీలక మ్యాచ్ ఆడనుంది.

03/25/2016 - 03:20

కెరీర్‌లో 59 టెస్టులు ఆడిన వాట్సన్ 3,731 పరుగులు చేశాడు. 75 వికెట్లు పడగొట్టాడు. 190 వనే్డ ఇంటర్నేషనల్స్‌లో 5,757 పరుగులు సాధించాడు. 168 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. టి-20 ఇంటర్నేషనల్స్‌లో ఇప్పటి వరకూ 1,400 పరుగులు చేసి, 46 వికెట్లు కూల్చాడు. 2007, 2015 సంవత్సరాల్లో ప్రపంచ కప్‌ను సాధించిన ఆస్ట్రేలియా జట్టులో వాట్సన్ సభ్యుడు.

03/25/2016 - 03:19

మొహాలీ, మార్చి 24: టి-20 వరల్డ్ కప్ క్రికెట్ గ్రూప్-2లో అత్యంత కీలకమైన మ్యాచ్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే సెమీ ఫైనల్‌లో స్థానానికి రేసులో ఉండే అవకాశం దక్కుతుంది. ఓడిన జట్టు క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. పాకిస్తాన్ మూడు మ్యాచ్‌లు ఆడి రెండు పరాజయాలను చవిచూసింది.

03/25/2016 - 03:19

బెంగళూరు, మార్చి 24: బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో అతి కష్టం మీద ఒక పరుగు తేడాతో విజయం సాధించి రేస్‌లోనే ఉన్నప్పటికీ టీమిండియా సెమీ ఫైనల్ చేరడం అనుకున్నంత సులభమేమీ కాదు. గ్రూప్-2 నుంచి పోటీపడుతున్న భారత్ మూడు మ్యాచ్‌లు ఆడి, రెండు విజయాలను నమోదు చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను ఓడించగా, అంతకు ముందు న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది.

03/25/2016 - 03:18

న్యూఢిల్లీ, మార్చి 24: మహిళల టి-20 వరల్డ్ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో గురువారం జరిగిన మొదటి గ్రూప్ మ్యాచ్‌లో శ్రీలంకను ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుచేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్, ఎలిస్ విలానీ అర్ధ శతకాలతో కదంతొక్కి, ఆస్ట్రేలియాకు తిరుగులేని విజయాన్ని అందించారు. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చమరి జయంగనీ బ్యాటింగ్ ఎంచుకుంది.

03/25/2016 - 03:17

ధర్మశాల/ న్యూఢిల్లీ, మార్చి 24: మహిళల టి-20 వరల్డ్ కప్ క్రికెట్‌లో భాగంగా గురువారం జరిగిన మొదటి గ్రూప్ మ్యాచ్‌లో శ్రీలంకపై ఆస్ట్రేలియా వి జయభేరి మోగించగా, మరో రెండు మ్యాచ్‌ల్లో వె స్టిండీస్‌పై అతి కష్టం మీద ఇంగ్లాండ్, బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ విజయాలను నమోదు చేశాయ.

03/25/2016 - 03:17

బెంగళూరు, మార్చి 24: ప్రతికూల సమయాల్లోనూ ఒత్తిడికి గురికాకుండా సంయమనం పాటించే ‘మిస్టర్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీకి కోపమొచ్చింది. భారత కెప్టెన్ ఓ విలేఖరిపై ఆగ్రహం వ్యక్తం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో భారత్ చివరి వరకూ ఓటమి ప్రమాదం అంచున నిలబడి, అతి కష్టం మీద ఒక పరుగు తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

03/24/2016 - 17:56

మొహాలీ: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 34 ఏళ్ల వాట్సన్‌ గత ఏడాదే యాషెస్‌ సిరీస్‌ తర్వాత టెస్టులకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తాను వైదొలగనున్నట్లు తెలిపారు. 2002లో తొలి మ్యాచ్‌ ఆడిన వాట్సన్‌ తన 14 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌కు టీ20 ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలు పలకనున్నట్లు తెలిపాడు.

03/24/2016 - 07:42

బెంగళూరు: సులభంగా గెలవాల్సిన మ్యాచ్‌ని పసలేని బౌలింగ్, పట్టులేని ఫీల్డింగ్ కారణంగా సంక్లిష్టం చేసుకున్న టీమిండియా హార్దిక్ పాండ్య వేసిన చివరి ఓవర్‌లో బంగ్లాదేశ్ చివరి మూడు బంతుల్లో మూడు వికెట్లు కోల్పోవడంతో గెలిచి, సెమీస్ అవకాశాలను మెరుగుపరచుకుంది. 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు చివరి వరకూ పోరాడిన బంగ్లాదేశ్, ఒకానొక దశలో విజయభేరి మోగించడం ఖాయంగా కనిపించింది.

03/24/2016 - 07:41

న్యూఢిల్లీ: టి-20 వరల్డ్ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో సెమీస్ చేరే అవకాశాలను ఇంగ్లాండ్ సజీవంగా నిలబెట్టుకుంది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ని ఈ జట్టు 15 పరుగుల తేడాతో గెల్చుకొని, రేస్‌లో కొనసాగుతున్నది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన అఫ్గాన్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేయగలిగింది.

Pages