S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/24/2016 - 07:39

మొహాలీ: వివాదాల్లో చిక్కుకున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ షహీద్ అఫ్రిదీ కెరీర్‌కు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్న టి-20 వరల్డ్ కప్ టోర్నీ తర్వాత తాను రిటైర్ అవుతానని అతను పరోక్షంగా ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగే మ్యాచ్ కెరీర్‌లో తనకు చివరిది కావచ్చని ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.

03/24/2016 - 07:39

మియామీ: మహిళా టెన్నిస్ పట్ల తనకు ఏమాత్రం చిన్నచూపు లేదని, తాను ఎప్పుడూ మహిళలను తక్కువ చేసి మాట్లాడలేదని ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకొవిచ్ స్పష్టం చేశాడు. ఇటీవల ఇండియన్ వెల్స్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో మిలోస్ రవోనిక్‌ను ఓడించి టైటిల్ సాధించిన తర్వాత జొకొవిచ్ మాట్లాడుతూ మహిళల కంటే పురుషుల విభాగంలో ప్రైజ్‌మనీ ఎక్కువ ఉండాలని వ్యాఖ్యానించాడు.

03/24/2016 - 07:38

బెంగళూరు: అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా తాత్కాలికంగా అంతర్జాతీయ పోటీలకు దూరమైన బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ తస్కిన్ అహ్మద్‌కు చుక్కెదురైంది. అతనిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయడానికి జ్యుడిషియల్ కమిషనర్ నిరాకరించాడు. టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ధర్మశాలలో నెదర్లాండ్స్‌తో బంగ్లాదేశ్ మ్యాచ్ ఆడినప్పుడు తస్కిన్ బౌలింగ్ అనుమానాస్పదంగా ఉందని అంపైర్లు ఫిర్యాదు చేశారు.

03/23/2016 - 07:50

కింగ్‌స్టన్: జమైకా ‘చిరుత’గా పేరు పొందిన పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ త్వరలో తన ఒలింపిక్ కెరీర్‌కు స్వస్థి పలకనున్నాడు. ఈ ఏడాది బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో జరుగనున్న ఒలింపిక్ క్రీడలే తన కెరీర్‌లో చివరి ఒలింపిక్ క్రీడలని అతను స్పష్టం చేశాడు. తద్వారా 2020లో జపాన్ రాజధాని టోక్యోలో జరిగే ఒలింపిక్ క్రీడల వరకు తన కెరీర్‌ను పొడిగించే అవకాశం లేదని అతను తేల్చిచెప్పాడు.

03/23/2016 - 07:48

ధర్మశాల: మహిళల ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు సెమీఫైనల్స్‌కు చేరే అవకాశాలు అడుగంటి పోయాయి. గ్రూప్-బిలో మంగళవారం ధర్మశాలలో జరిగిన కీలక లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 2 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలవడంతో ఈ పరిస్థితి దాపురించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది.

03/23/2016 - 07:47

బెంగళూరు: చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్‌పై ఘనవిజయంతో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్న ధోనీ సేన బుధవారం ఐసిసి ట్వంటీ-20 టోర్నమెంట్‌లో భాగంగా ఇక్కడ బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో సైతం ఘనివిజయం సాధించి సెమీఫైనల్లో స్థానానికి మరో చేరువ కావాలని ఉవ్విళ్లూరుతోంది.

03/23/2016 - 07:46

మొహాలీ: ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో అప్రతిహతంగా దూసుకెళ్తున్న న్యూజిలాండ్ జట్టు హ్యాట్రిక్‌తో మరోమారు సత్తా చాటుకుంది. ఈ టోర్నీలో ఇప్పటికే రెండు విజయాలు సాధించిన ఆ జట్టు మొహాలీలో మంగళవారం పాకిస్తాన్ జట్టును 22 పరుగుల తేడాతో ఓడించి వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాటు సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది.

03/23/2016 - 07:46

ఆక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత జోడీ మను అత్రి, అశ్వనీ పొన్నప్ప మెయిన్ డ్రాకు అర్హత సాధించారు. క్వాలిఫయర్స్ తొలి రౌండ్ మ్యాచ్ నుంచి ప్రత్యర్థులు క్రిస్ట్ఫోర్ స్టీగ్స్, ఎరెనా కాల్డర్-హాకిన్స్ జోడీ తప్పుకోవడతో బై సాధించిన మను, అశ్వనీ రెండో రౌండ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన నికోల్ టాగ్లే, దెబోరా ఇన్ జోడీని మట్టి కరిపించారు.

03/23/2016 - 07:45

బెంగళూరు: భారత్‌కు విరాట్ కోహ్లీ కీలక ఆటగాడే కానీ మిగతా బ్యాట్స్‌మెన్‌ను తమ జట్టు తేలిగ్గా తీసుకోబోదని బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ మంగళవారం ఇక్కడ చెప్పారు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేశ్ రైనాలు ఇప్పటివరకు టోర్నమెంట్‌లో పెద్దగా పరుగులు చేయకపోయినప్పటికీ తాము మాత్రం భారత జట్టులోని ఏ ఆటగాడినీ తేలిగ్గా తీసుకోమని షకీబ్ చెప్పాడు.

03/22/2016 - 06:39

నాగపూర్: మహిళల టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ మరో 22 బంతులు మిగిలి ఉండగానే, ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్పిన్నర్ లీ కాస్పెరెక్ అద్భుత బౌలింగ్ నైపుణ్యం న్యూజిలాండ్‌ను గెలిపించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది.

Pages