S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/25/2015 - 05:26

పాక్‌తో క్రికెట్ సిరీస్‌పై బిసిసిఐ దొంగాట!

12/25/2015 - 05:31

మాజీ కీపర్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ కింద బిసిసిఐ పురస్కారం

12/25/2015 - 05:23

బెంగళూరు, డిసెంబర్ 24: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై విమర్శలు గుప్పించి, బిజెపి నుంచి సస్పెన్షన్‌కు గురైన పార్లమెంటు సభ్యుడు, మాజీ క్రికెటర్ కీర్తీ ఆజాద్‌కు సంపూర్ణ మద్దతును ఇవ్వాలని క్లీన్ స్పోర్ట్స్ ఇండియా (సిఎస్‌ఐ) నిర్ణయించింది. అవినీతి, కుంభకోణాల రహిత క్రీడల కోసం కృషి చేస్తున్న ఈ సంస్థ ఆజాద్ లేవనెత్తిన అంశాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నది.

12/24/2015 - 05:48

సోబర్స్ ట్రోఫీ విజేతలు

రాహుల్ ద్రవిడ్ (2004), ఆండ్రీ ఫ్లింటాఫ్, జాక్వెస్ కాలిస్ (2005లో సంయుక్త విజేతలు), రికీ పాంటింగ్ (2006, 2007), శివనారైన్ చందర్‌పాల్ (2008), మిచెల్ జాన్సన్ (2009, 2014), సచిన్ తెండూల్కర్ (2010), జొనథాన్ ట్రాట్ (2011), కుమార సంగక్కర (2012), మైఖేల్ క్లార్క్ (2013), స్టీవెన్ స్మిత్ (2015).

12/24/2015 - 05:44

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ సంఘం (డిడిసిఎ) అధ్యక్షుడిగా పలు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మరో వివాదంలో చిక్కుకున్నారు. డిడిసిఎలో అవినీతి, కుంభకోణాలకు ఆయనే బాధ్యత వహించాలంటూ మాజీ టెస్టు క్రికెటర్, బిజెపి పార్లమెంటు సభ్యుడు కీర్తీ ఆజాద్ ధ్వజమెత్తగా, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ నేతలు కూడా అలాంటి ఆరోపణలే చేశారు.

12/24/2015 - 05:44

దుబాయ్, డిసెంబర్ 23: దక్షిణాఫ్రికా టి-20 కెప్టెన్ ఫఫ్ డు ప్లెసిస్ ఆ విభాగంలో ఉత్తమంగా రాణించిన ఆటగాడిగా అవార్డు ఎంపికయ్యాడు. ఈ ఏడాది జనవరి 11న వెస్టిండీస్‌తో జొహానె్నస్‌బర్గ్‌లో జరిగిన టి-20లో అతు కేవలం 56 బంతుల్లోనే 116 పరుగులు సాధించాడు. ఈస్కోరులో 11 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఈ సుడిగాలి బ్యాటింగ్ అతనికి అవార్డును సంపాదించిపెట్టింది.

12/24/2015 - 05:43

బెంగళూరు, డిసెంబర్ 23: భారత పరిమిత ఓవర్ల ఫార్మెట్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విజయ్ హజారే క్రికెట్ టోర్నమెంట్ రెండో క్వార్టర్ ఫైనల్‌లో చక్కటి ప్రదర్శనతో రాణించినప్పటికీ, అతని శ్రమ శృథా అయింది. ఢిల్లీతో జరిగిన ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ 99 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 50 ఓవర్లలో 225 పరుగులు చేసి ఆలౌటైంది.

12/24/2015 - 05:43

కోల్‌కతా, డిసెంబర్ 23: వచ్చే ఏడాది రియోలో జరిగే ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నానని భారత వెటరన్ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ అన్నాడు. ఇప్పటి వరకూ ఆరు ఒలింపిక్స్‌లో పాల్గొన్న అనుభవం ఉందని, కాబట్టి ఫిట్నెస్‌ను ఏ విధంగా నిలబెట్టుకోవాలో అనే విషయంపై తనకు స్పష్టత ఉందని ఐడిబిఎ ఫెడరల్ కోల్‌కతా మారథాన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా బుధవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పాడు.

12/24/2015 - 05:42

ముంబయి, డిసెంబర్ 23: జాతీయ క్రికెట్ అకాడెమీ (ఎన్‌సిఎ)లో కోచ్‌గా మాజీ టెస్టు క్రికెటర్లు డబ్ల్యువి రామన్, నరేంద్ర హీర్వాణీ, టిఎ శేఖర్‌లను నియమించినట్టు బిసిసిఐ ప్రకటించింది. రామన్ బ్యాటింగ్ కోచ్‌గా ఉంటాడని, శేఖర్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా, హీర్వాణీ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా సేవలు అందిస్తారని బిసిసిఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి తెలిపాడు.

12/24/2015 - 05:42

కరాచీ, డిసెంబర్ 23: డెడ్‌లన్‌ను ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ వెళ్లిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చివరికి భారత్‌తో సిరీస్ జరిగే అవకాశం లేదన్న నిర్ధారణకు వచ్చింది. చాలా కాలంగా తాము భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) సమాధానం కోసం ఎదురుచూశామని పిసిబి అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు.

Pages