S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/18/2016 - 18:22

ధర్మశాల:టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ అనూహ్య విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 142 పరుగులు మాత్రమే చేయడంతో ఆసీస్ గెలుపుతప్పదని అంతా భావించారు. ఆస్ట్రేలియాకూడా ధాటీగానే బ్యాటింగ్ ప్రారంభించింది. కానీ 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది.

03/18/2016 - 16:51

ధర్మశాల:హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల స్టేడియంలో శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ పేలవ ప్రదర్శన చేసింది. టి-20 ప్రపంచకప్ పోటీల్లో భాగంగా గ్రూప్-2 విభాగంలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మొదట్లో ధాటీగానే ఆడినా ఆ తరువాత డీలాపడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి కేవలం 142 పరుగులు మాత్రమే చేసింది.

03/18/2016 - 06:54

ఇండియన్ వెల్స్ (అమెరికా), మార్చి 17: ఇండియన్ వెల్స్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకొవిచ్ దూకుడును కొనసాగిస్తున్నాడు. నాలుగో రౌండ్ మ్యాచ్‌లో అతను ఫెలిసియానో లొపెజ్‌ను 6-3, 6-3 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరారు. మంచి ఫామ్‌లో ఉన్న అతను ఈసారి కూడా టైటిల్ గెల్చుకునే అవకాశాలున్నాయి.

03/18/2016 - 06:53

నేటి విచారణలో ఏం జరుగుతుందోనని ఆందోళన

03/18/2016 - 06:52

నేడు దక్షిణాఫ్రికాతో ఇంగ్లాండ్ పోరు

03/18/2016 - 06:52

కోల్‌కతా, మార్చి 17: టి-20 వరల్డ్ కప్‌లో గురువారం అఫ్గానిస్థాన్‌ను ఢీకొన్న శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో సునా యాసంగా గెలిచింది. తిలకరత్నే దిల్షాన్ అజేయంగా 83 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపాడు. 154 పరుగుల లక్ష్యాన్ని లంక మరో 11 బంతులు మిగిలి ఉండగానే అందుకుంది.

03/18/2016 - 06:51

బంగ్లాదేశ్‌పై ఇంగ్లాండ్ గెలుపు

03/18/2016 - 06:51

ధర్మశాల, మార్చి 17: ఆస్ట్రేలియాను న్యూజిలాండ్ భయపెడుతున్నది. టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ని హాట్ ఫేవరిట్ భారత్‌తో ఆడి, అనూహ్య విజయాన్ని సాధించిన ‘అండర్ డాగ్’ కివీస్‌ను తక్కువ అంచనా వేస్తే శుక్రవారం నాటి మ్యాచ్‌లో భారీ మూల్యానే్న చెల్లించుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్, ఇతర క్రీడాకారులు గురువారం ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ చేశారు.

03/18/2016 - 06:49

పాకిస్తాన్ సీనియర్ ఆటగాడు, మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్, భారత బ్యాట్స్‌మన్ సురేష్ రైనా గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నెట్ ప్రాక్టీస్‌కు హాజరైనప్పుడు ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఆలింగనం చేసుకొని క్రీడాస్ఫూర్తిని చాటుకున్నారు. టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇరు జట్లు ఇదే మైదానంలో 19వ తేదీన జరిగే హై ఓల్టేజీ మ్యాచ్‌లో ఢీ కొంటాయ.

03/17/2016 - 07:37

కోల్‌కతా: టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ షహీద్ అఫ్రిదీ ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టును గెలిపించాడు. అహ్మద్ షెజాద్, మహమ్మద్ హఫీజ్ అర్ధ శతకాలు కూడా జట్టు విజయానికి బాటలు వేశాయి.

Pages