S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/20/2015 - 05:14

హామిల్టన్, డిసెంబర్ 19: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక ఎదురుదాడికి దిగింది. దుష్మంత చమీర మెరుపు దెబ్బ తీయడంతో, ఒక దశలో కేవలం వికెట్ నష్టం లేకుండా 81 పరుగులు చేసిన న్యూజిలాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొమ్మిది వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది.

12/20/2015 - 05:13

* సెలక్షన్ కమిటీ చైర్మన్ పాటిల్

12/20/2015 - 07:27

* భారత టి-20 జట్టులో పాతకాపులు
* వనే్డల్లో అశ్విన్ రైనాకు దక్కనిచోటు
* ధోనీకే కెప్టెన్సీ

12/19/2015 - 05:20

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ఆస్ట్రేలియాలో టూర్ జరుగుతున్న నేపథ్యంలో సెలక్టర్లు ఫాస్ట్ బౌలర్లకే పెద్దపీట వేసే అవకాశాలున్నాయి. ఇశాంత్ శర్మ, మహమ్మద్ షమీలకు ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ తదితరుల నుంచి గట్టిపోటీ ఎదురుకాక తప్పదు. పేసర్‌గా సేవలు అందించగల ఆల్‌రౌండర్ అవరం ఉందని సెలక్టర్లు గట్టిగా అనుకుంటే స్టువర్ట్ బిన్నీ జట్టులోకి వస్తాడు.

12/19/2015 - 05:18

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ఆస్ట్రేలియాకు వెళ్లే భారత జట్టులో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు స్థానం దాదాపుగా ఖాయమైందని సమాచారం. గాయాల కారణంగా కొంతకాలం క్రికెట్‌కు దూరమైన మహమ్మద్ షమీ, ఇశాంత్ శర్మ కూడా రేసులో ఉన్నారు. సందీప్ పాటిల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న జాతీయ సెలక్షన్ కమిటీ శనివారం ఇక్కడ సమావేశమై, ఆసీస్ టూర్‌కు టీమిండియాను ఎంపిక చేస్తుంది.

12/19/2015 - 05:17

జ్యూరిచ్, డిసెంబర్ 18: అవినీతి, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురైన అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) అధ్యక్షుడు సెప్ బ్లాటర్ తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశాడు. ఫిఫా ప్రధాన కార్యాలయంలోని ఎథిక్స్ కోర్టు ముందు బ్లాటర్ హాజరుకాగా, అతనితోపాటు సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్న మైఖేల్ ప్లాటినీ గైర్హాజరయ్యాడు. కాగా, బ్లాటర్‌ను న్యాయమూర్తులు పలు అంశాలపై ప్రశ్నించారు.

12/19/2015 - 05:17

లిస్బన్, డిసెంబర్ 18: రియల్ మాడ్రిడ్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన పేరుమీద హోటళ్లను ప్రారంభించేందుకు భారీ పెట్టుబడులతో సిద్ధమవుతున్నాడు. తన జన్మస్థలమైన పోర్చుగల్‌తోపాటు మాడ్రిడ్, న్యూయార్క్ నగరాల్లోనూ సిఆర్-7 పేరుతో హోటళ్లను తెరిచేందుకు అతను పెస్టానా హోటల్ గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్నాడు. 40 మిలియన్ డాలర్లను వెచ్చించి, హోటల్ వ్యాపారంలోకి రావాలన్నది అతని ఆలోచన.

12/19/2015 - 05:16

హామిల్టన్, డిసెంబర్ 18: శ్రీలంక, న్యూజిలాండ్ రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట వర్షం కారణంగా ముందుగానే నిలిచిపోయింది. వాతావరణం అనువుగా లేకపోవడంతో ఆటను ఆపేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించే సమయానికి శ్రీలంక ఏడు వికెట్లకు 264 పరుగులు చేసింది. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (63 నాటౌట్), మిలింద సిరివర్ధన (62) అర్ధ శతకాలతో రాణించగా, మిగతా బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు.

12/19/2015 - 05:16

హైదరాబాద్, డిసెంబర్ 18: విజయ్ హజారే వ నే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ కర్నాటక ఇంటిదారిపట్టింది. జమ్మూ కశ్మీర్‌తో శుక్ర వారం జరిగిన మ్యాచ్‌ని 207 పరుగుల భారత తే డాతో కైవసం చేసుకున్నప్పటికీ, పాయంట్ల పట్టిక లో గ్రూప్-బి నుంచి మొత్తం 16 పాయంట్లతో మూడోస్థానంలో నిలిచిన కారణంగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

12/19/2015 - 05:15

బెంగళూరు, డిసెంబర్ 18: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ బెంగళూరులో వచ్చే వారం ప్రాక్టీస్ మొదలు పెడుతుందని ఆమె తండ్రి హర్వీర్ సింగ్ తెలిపాడు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో గాయానికి చికిత్స పొందుతున్నదని పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. వేగంగా కోలుకుంటున్నదని, వచ్చే వారం బెంగళూరు వెళ్లి, ప్రాక్టీస్‌ను ఆరంభిస్తుందని చెప్పాడు.

Pages