S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/14/2016 - 07:49

ఇండియన్ వెల్స్ టెన్నిస్

03/14/2016 - 07:48

బార్సిలోనా చేతిలో గటాఫే చిత్తు

03/14/2016 - 08:23

నాగపూర్, మార్చి 13: కోల్‌కతాలో శనివారం దక్షిణాఫ్రికాతో వామప్ మ్యాచ్ ఆడిన భారత క్రికెట్ జట్టు ఆదివారం నాగపూర్ చేరుకుంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఇతర సభ్యులకు ఇక్కడి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తమ కోసం ఎదురుచూస్తున్న విలేఖరులతో మాట్లాడకుండా టీమిండియా సభ్యులు హోటల్‌కు వెళ్లిపోయారు. ఆదివారం సాయంత్రం వామప్‌లో పాల్గొన్నారు. సోమవారం నెట్స్‌కు హాజరవుతారు.

03/14/2016 - 07:47

హెచ్చరికలు, బెదిరింపులు కావన్న పాక్ కెప్టెన్ అఫ్రిదీ

03/13/2016 - 06:42

కోల్‌కతా, మార్చి 12: ఆల్‌రౌండర్, సీనియర్ ఆటగాడు షహీద్ అఫ్రిదీ నాయకత్వంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌ను ఆడేందుకు భారత్‌లో అడుగుపెట్టింది. ఈ జట్టులో 15 మంది క్రీడాకారులు, 12 మంది అధికారులు ఉన్నారు. తీవ్ర ఉత్కంఠ, అనిశ్చితి నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అభిమానులు ఆందోళన చెందారు.

03/13/2016 - 06:41

ముంబయ, మార్చి 12: టి-20 వరల్డ్ కప్‌లో రెండో వామప్ మ్యాచ్ ఆడిన భారత జట్టు పరుగుల వేటలో తడబడి, చివరికి మూడు పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. దక్షిణాఫ్రికాను ఓడించేందుకు 197 పరుగుల భారీ స్కోరు సాధించాల్సి ఉండగా, భారత బ్యాటింగ్ చాలా పేలవంగా మొదలైంది. కేల్ అబోట్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ (10) ఎల్‌బి గా వెనుదిరిగాడు. అయతే, శిఖర్ ధావన్ 73, సురేష్ రైనా 41 పరుగులు చేసి జట్టును ఆదు కున్నారు.

03/13/2016 - 06:40

పనాజీ, మార్చి 12: ఈసారి గోవా మారథాన్ ఆదివారం జరగనుండగా, ఐదు వేల మందికిపైగా రన్నర్లు, ఔత్సాహికులు పాల్గొననున్నారు. గత నాలుగు ఈవెంట్స్ మాదిరిగానే ఈసారి కూడా 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్ల పరుగు, 5 కిలోమీటర్ల డ్రీమ్ రన్ విభాగాల్లో పోటీలు ఉంటాయి. హాఫ్ మారథాన్‌కు దేశవిదేశాల నుంచి పేరొందిన రన్నర్లు హాజరవుతారు. 10 కిలోమీటర్ల పరుగులో భారతీయులే ఎక్కువ మంది ఉంటారు.

03/13/2016 - 06:40

ముంబయి, మార్చి 12: టి-20 వరల్డ్ కప్ పోటీలకు సిద్ధమయ్యేందుకు వీలుగా శనివారం జరిగిన వామప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఇంగ్లాండ్ ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 169 పరుగులు చేసింది. కేన్ విలియమ్‌సన్ 63 పరుగులతో రాణించగా, మాజీ కెప్టెన్ రాస్ టేలర్ అజేయంగా 19 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్ బౌలర్ అదిల్ రషీద్ 15 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు.

03/13/2016 - 06:40

ఇండియన్ వెల్స్ (అమెరికా), మార్చి 12: ‘సాన్‌టినా’గా అభిమానులు పిలుచుకునే మార్టినా హింగిస్, సానియా మీర్జా జోడీ ఇక్కడ ఆరంభమైన ఇండియన్ వెల్స్ పిఎన్‌బి పరిబాస్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్ మహిళల డబుల్స్‌లో శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో వీరు కాసీ డెలాక్వా, సమంతా స్టొసుర్ జోడీని 6-3, 7-5 తేడాతో చిత్తుచేశారు.

03/13/2016 - 06:39

కాంట్రాక్టు వివాదానికి తెరపడిందన్న వెస్టిండీస్ కెప్టెన్ సమీ

Pages