S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/11/2016 - 08:05

లాస్ ఏంజిలిస్‌లో ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జొకొవిచ్‌తో చాలా సన్నిహితంగా ఉన్న బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. లాస్ ఏంజిల్స్ లేకర్స్, ఆర్నాండో మాజిక్ జట్ల మధ్య జరిగిన బాస్కెట్ బాల్ మ్యాచ్‌ని తిలకించడానికి వచ్చిన జొకొవిచ్‌ను దీపిక కలిసింది. అనంతరం వీరిద్దరూ నైస్ గై బార్ వద్ద కనిపించారని స్థానిక మీడియా తెలిపింది.

03/11/2016 - 08:03

ఉగ్రవాద వ్యతిరేక సంస్థ హెచ్చరిక

03/11/2016 - 08:03

క్షణానికో వార్త.. స్పష్టతలేని ప్రకటనలు

03/11/2016 - 08:00

కోల్‌కతా, మార్చి 10: టి-20 వరల్డ్ కప్ పోటీల కు సన్నాహంగా గురువారం వెస్టిండీస్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ 45 పరుగుల తేడాతో గె లిచింది. 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ రిలోకి దిగిన విండీస్ 19.2 ఓవర్లలో 140 పరులకు ఆలౌటైంది. క్రిస్ గేల్ 20 పరుగులతో టాప్ స్కోర ర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో మహమ్మద్ ష మీ, పవన్ నేజీ, జడేజా, హార్దిక పాండ్య తలా రెం డు వికెట్లు పడగొట్టారు.

03/11/2016 - 08:00

నాగపూర్, మార్చి 10: టి-20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ గ్రూప్ ‘బి’ మొదటి రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో హాంకాంగ్‌ను అఫ్గానిస్థాన్ ఆరు వికెట్ల తేడాతో చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 116 పరుగులు సాధించింది. లక్ష్యాన్ని అఫ్గాన్ మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే, నాలుగు వికెట్లు కోల్పోయ ఛే దించింది. మహమ్మద్ షెజాద్ 41 పరుగులతో టా ప్ స్కోరర్‌గా నిలిచాడు.

03/11/2016 - 08:00

చివరి మ్యాచ్‌లో ఓడిన సౌతాఫ్రికా

03/11/2016 - 07:59

నాగపూర్, మార్చి 10: టి-20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ గ్రూప్ ‘బి’ మొదటి రౌండ్‌లో స్కాట్‌లాండ్‌ను ఢీకొన్న జింబాబ్వే 11 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. సీన్ వియల్స్ 36 బంతుల్లో, ఆరు ఫోర్లతో 53 పరుగులు సాధించాడు. స్కాట్‌లాండ్ బౌలర్లలో అలిస్టర్ ఇవాన్స్, మార్క్ వాట్, సఫియాన్ షరీఫ్ తలా రెండేసి వికెట్లు కూల్చారు.

03/11/2016 - 07:59

న్యూఢిల్లీ, మార్చి 10: టి-20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లందరికీ టోకుగా డోప్ పరీక్షలను నిర్వహించనున్నారు. అయితే, నిషిద్ధ మెల్డోనియం ఔషధాన్ని వినియోగించి డోప్ పరీక్షలో దొరికిపోయానంటూ టెన్నిస్ స్టార్ మరియా షరపోవా చేసిన సంచలన ప్రకటనతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిర్వహించే డోప్ పరీక్షకు ఎలాంటి సంబంధం లేదని టోర్నమెంట్ డైరెక్టర్ ఎంవి శ్రీ్ధర్ స్పష్టం చేశాడు.

03/11/2016 - 07:59

ముంబయిని ఓడించి ఇరానీ కప్ కైవసం

03/11/2016 - 07:58

బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ప్రపంచ మాజీ నంబర్ వన్, మలేసియా స్టార్ ఆటగాడు. లీ చాంగ్ వెయ్‌కి భారత యువ షట్లర్ సాయి ప్రణీత్ షాకిచ్చాడు. పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో అతను 24-22, 22-20 తేడాతో చాంగ్ వెయ్‌పై సంచలన విజయాన్ని నమోదు చేశాడు. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. అతను రాజీవ్ ఊసెఫ్‌పై 21-17, 21-12 స్కోరుతో గెలుపొందాడు.

Pages