S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/26/2016 - 03:08

మెల్బోర్న్, జనవరి 25: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ గ్లామ్‌లో బ్రిటన్ సోమవారం డబుల్ ధమాకా మోగించింది. మహిళల సింగిల్స్‌లో జొహన్నా కొన్టా క్వార్టర్ ఫైనల్స్ చేరగా, పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ ఆండీ ముర్రే కూడా క్వార్టర్స్‌లో స్థానం సంపాదించాడు. నాలుగో రౌండ్‌లో అతను బెనార్డ్ టోమిక్‌ను 6-4, 6-4, 7-6 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు.

01/26/2016 - 03:06

జొహానె్నస్‌బర్గ్, జనవరి 25: భారత్‌లో జన్మించి, దక్షిణాఫ్రికాలో స్థిరపడిన క్రికెట్ బొదీపై 20 సంవత్సరాల సస్పెన్షన్ వేటు పడింది. గత ఏడాది జరిగిన ప్రతిష్ఠాత్మక రామ్ శ్లామ్ క్రికెట్ టోర్నమెంట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు అతనిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. స్వతంత్ర ప్రతిపత్తిగల కమిటీతో విచారణ జరిపించిన క్రికెట్ సౌతాఫ్రికా (సిఎస్‌ఎ) బొదీని 20 ఏళ్ల పాటు క్రికెట్ నుంచి నిషేధించింది.

01/26/2016 - 03:04

వెల్లింగ్టన్, జనవరి 25: పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను న్యూజిలాండ్ శుభారంభం చేసింది. 70 పరుగుల తేడాతో విజయం సాధించి, 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 280 పరుగులు చేసింది. హెన్రీ నికోలస్ (82), మిచెల్ సాంట్నర్ (48), మాట్ హెన్రీ (48) బ్యాటింగ్‌లో రాణించారు. పాక్ బౌలర్లలో మహమ్మద్ అమీర్ 28 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు.

01/26/2016 - 03:03

మెల్బోర్న్, జనవరి 25: పెద్దగా అరుస్తూ, బంతిని కాలితో తంతూ, ర్యాకెట్‌ను నేలకు విసురుతూ చిన్నపిల్లలా ప్రవర్తించినందుకు తాను సిగ్గుపడుతున్నానని ఆస్ట్రేలియా సంచలన క్రీడాకారిణి డరియా గవ్రిలోవా తెలిపింది. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌లో మహిళల నాలుగో రౌండ్ మ్యాచ్‌లో స్పెయిన్‌కు చెందిన కార్లా సౌరెజ్‌ను గవ్రిలోవా ఢీ కొంది.

01/26/2016 - 03:02

నేడు ఆస్ట్రేలియాతో తొలి టి-20

01/25/2016 - 04:55

మెల్బోర్న్, జనవరి 24: ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో మార్టినా హింగిస్‌తో కలిసి బరిలోకి దిగిన భారత ఆటగాడు లియాండర్ పేస్ ముందంజ వేశాడు. మొదటి రౌండ్‌లో పేస్, హింగిస్ జోడీ 6-3, 7-5 తేడాతో అనస్తాసియా పవ్లిచెన్కొవా, డొమినిక్ ఇన్‌గ్లాట్ జోడీపై విజయం సాధించింది.

01/25/2016 - 03:36

మెల్బోర్న్, జనవరి 24: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్ వన్, రష్యా బ్యూటీ మరియా షరపోవా మధ్య పోరు ఖాయమైంది. ప్రీ క్వార్టర్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా 6-2, 6-1 ఆధిక్యంతో రష్యాకు చెందిన అన్‌సీడెడ్ మార్గరితా గాస్పర్యాన్‌ను చిత్తుచేసింది.

01/25/2016 - 03:34

మెల్బోర్న్, జనవరి 24: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ చెమటోడ్చి క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. 14వ సీడ్ గిలెస్ సిమోన్‌తో తలపడిన ఈ ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు 6-3, 7-6, 6-4, 4-6, 6-3 ఆధిక్యంతో విజయం సాధించాడు. మొదటి మూడు రౌండ్లలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలుస్తూ వచ్చిన జొకోవిచ్ నాలుగో రౌండ్‌లో ఎవరూ ఊహించని విధంగా తడబడ్డాడు.

01/25/2016 - 03:33

సిడ్నీ, జనవరి 24: భారత వనే్డ, టి-20 జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన పదవిని పట్టుకొని వేళ్లాడుతున్నాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ వ్యాఖ్యానించాడు. ఇప్పటికే చాలాకాలం అదనంగా అతను పదవిలో కొనసాగాడని ఒక వెబ్‌సైట్‌కు రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు. ధోనీ స్థానంలో టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకే వనే్డ, టి-20 బాధ్యతలు కూడా అప్పచెప్పాలని సూచించాడు.

01/25/2016 - 03:32

న్యూఢిల్లీ, జనవరి 24: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో వేలానికి వచ్చే ఆటగాళ్ల జాబితాలో నిర్వహణ కమిటీ సోమవారం ప్రకటించనుంది. వివిధ ఫ్రాంచైజీలు వేలం కోసం విడుదల చేసిన 714 మంది ఆటగాళ్లకు బేస్ ప్రైస్‌ను నిర్ధారిస్తారు. వీరిలో 12 మంది క్రికెటర్లను ఇప్పటికే గుర్తించినట్టు సమాచారం. వారిలో యువరాజ్ సింగ్‌కు భారీగా రెండు కోట్ల రూపాయల బేస్ ప్రైస్ ఉంటుందని అంటున్నారు.

Pages