S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/23/2015 - 05:16

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఏ స్థాయి టోర్నీల్లోనైనా అస్తశ్రస్త్రాలను పారవేసి వెనుదిరిగే ప్రసక్తే లేదని, కడవరకూ పోరాటాన్ని కొనసాగిస్తానని భారత స్టార్ షట్లర్ పివి సింధు వ్యాఖ్యానించింది.

12/23/2015 - 05:14

లాసనే్న, డిసెంబర్ 22: ఎనిమిది పర్యాయాలు చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు వచ్చే ఏడాది రియో డి జెనీరియోలో జరిగే ఒలింపిక్స్‌లో క్లిష్టమైన డ్రా ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్ జర్మనీసహా మేటి జట్లు ఉన్న గ్రూప్ నుంచి తలపడాల్సి వస్తుంది. జర్మనీ, ప్రపంచ రెండో ర్యాంక్ జట్టు నెదర్లాండ్స్‌తోపాటు గ్రూప్ ‘బి’ నుంచి సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు పోరాడనుంది.

12/23/2015 - 05:11

టోక్యో, డిసెంబర్ 22: వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే బార్సిలోనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీకి కోపమొచ్చింది. రివర్ ప్లేట్ వీరాభిమానికి అతను ‘పంచ్’లిచ్చాడు. సంఘటన వివరాల్లోకి వెళితే, యొకహోమాలో జరిగిన వరల్డ్ క్లబ్ కప్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో రివర్ ప్లేట్ జట్టును 3-0 తేడాతో ఓడించిన బార్సిలోనా టైటిల్ కైవసం చేసుకుంది. మెస్సీ తొలి గోల్ చేసి, ఈ విజయానికి బాట వేశాడు.

12/23/2015 - 05:10

క్రైస్ట్‌చర్చి, డిసెంబర్ 22: ఆస్ట్రేలియాతో స్వదేశంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే రెండు మ్యాచ్ సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్టు న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ ప్రకటించాడు. ఆసీస్‌తో జరిగే తొలి టెస్టు కెరీర్‌లో అతనికి 100వ టెస్టు కావడం విశేషం.

12/23/2015 - 05:09

మెక్సికో సిటీ, డిసెంబర్ 22: భారత బాడ్మింటన్ డబుల్స్ ఆటగాళ్లు మనూ అత్రి, సుమీత్ రెడ్డి తమ కెరీర్‌లో తొలి గ్రాండ్ ప్రీ టైటిల్‌ను అందుకున్నారు. మెక్సికో ఓపెన్ గ్రాండ్ ప్రీ పురుషుల డబుల్స్ ఫైనల్‌లో వీరు 22-20, 21-18 తేడాతో బొడిన్ ఇసారా, నిపిఫొన్ పువాంగ్‌పెచ్ (్థయిలాండ్) జోడీని ఓడించి విజేతగా నిలిచారు. వీరిద్దరూ యుఎస్ ఓపెన్, డచ్ ఓపెన్ టోర్నీల్లోనూ ఫైనల్ చేరినప్పటికీ టైటిల్ సాధించలేకపోయారు.

12/23/2015 - 07:55

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: అమెరికాకు చెందిన షానన్ మెరీని తాను వివాహం చేసుకున్నట్టు వచ్చిన వార్తలను భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ అజరుద్దీన్ ఖండించాడు. తాను మూడో పెళ్లి చేసుకోలేదని స్పష్టం చేశాడు. హైదరాబాద్‌కు చెందిన అజరుద్దీన్ తన మొదటి భార్యకు విడాకులిచ్చి బాలీవుడ్ నటి సంగీత బిజలానీని పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం క్రితం ఆమె నుంచి కూడా అతను విడిపోయాడు.

12/23/2015 - 05:06

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ నేరాలను ఎదుర్కొన్న అజిత్ చండీలా, హికేన్ షాలకు విధించాల్సిన శిక్షణను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఈనెల 24న ఖరారు చేయనుంది.

12/23/2015 - 05:05

పెర్త్, డిసెంబర్ 22: వెస్టిండీస్‌తో ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న బాక్సింగ్ డే టెస్టులో ఆడే ఆస్ట్రేలియాకు స్కాట్ బోలండ్ రానున్నాడు. ఫాస్ట్ బౌలర్ నాథన్ కౌల్టర్ నైల్ గాయపడడంతో జట్టుతో చేరాల్సిందిగా బోలాండ్‌ను ఆసీస్ సెలక్టర్లు ఆదేశించారు. 36 ఏళ్ల బోలాండ్ 2011-12 సీజన్‌లో విక్టోరియా జట్టులోకి అడుగుపెట్టాడు.

12/22/2015 - 07:28

దుబాయ్, డిసెంబర్ 21: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ ఆల్‌రౌండర్స్ విభాగంలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 31 వికెట్లు పడగొట్టిన అతను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. టెస్టు బ్యాటింగ్‌లో అతను సగటున 31.68 పరుగులు సాధించాడు.

12/22/2015 - 07:27

పనాజీ, డిసెంబర్ 21: ఇండియన్ సూపర్ లీగ్ (ఐపిఎల్) ఫైనల్‌లో గోవా ఫుట్‌బాల్ క్లబ్‌ను ఓడించి టైటిల్ సాధించిన చెనె్నయిన్ జట్టులో మార్క్యూ ప్లేయర్ ఎలానో బ్లమెర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రెజిల్‌కు చెందిన ఎలానో తనపై దాడి చేశాడని గోవా క్లబ్ సహభాగస్వామి దత్తరాజ్ సాల్గొంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ అరెస్టు జరిగినట్టు పోలీసులు తెలిపారు.

Pages