S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/23/2018 - 00:49

ముస్తాబాద్, సెప్టెంబర్ 22: కాంగ్రెస్ శుష్క హామీలు, ప్రతిపక్ష పార్టీల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని తెలంగాణ ప్రజలకు ఐటీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. గత 60ఏళ్లలో జరగని అభివృద్ధి తెలంగాణ వచ్చాక జరిగిందని, టీఆర్‌ఎస్‌ను మరొకసారి గెలిపిస్తే ఇప్పటికన్నా మూడింతలు అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేసీఆర్ ఉద్యమం లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు.

09/23/2018 - 00:46

చిత్రం..పాదయాత్రలో మహిళ నుంచి
వినతిపత్రం అందుకుంటున్న జగన్

09/23/2018 - 00:35

విజయవాడ: వైకాపా 2019లో అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటున్న నవరత్న పథకాలలో ఏ మాత్రం నవ్యత లేదని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్. తులసీరెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఆంధ్రరత్నభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు భరోసా, ఆసరా, పింఛన్లు, పేదలకు ఇళ్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, దశలవారీగా మద్య నిషేధం ఇది వైకాపా డబ్బాకొట్టుకుంటున్న నవరత్న పథకాలన్నారు.

09/23/2018 - 00:32

నెల్లూరు: నెల్లూరు జిల్లా కేంద్రంలోని బారాషహీద్ దర్గా ప్రాంగణం రొట్టెల పండుగతో భక్తజనంతో పోటెత్తుతోంది. లక్షల సంఖ్యలో వస్తున్న భక్తులతో దర్గా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

09/23/2018 - 00:30

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 22: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని లాలాచెరువు ప్రాంతం శుక్రవారం అర్ధరాత్రి భారీ పేలుళ్లతో ఉలిక్కిపడింది. జనావాసాల మధ్య అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్న ఒక తాటాకు ఇంట్లో ఒక్క సారిగా పేలుడు సంభవించడంతో స్థానికులు ఇళ్ళల్లోంచి పరుగులు తీసారు. ఏమి జరిగిందో గ్రహించేలోపే, విస్పోటనంలో ముగ్గురు మాడిపోయారు. మృతి చెందిన ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారు.

09/23/2018 - 00:20

హైదరాబాద్, సెప్టెంబర్ 22: చంద్రుడిపై కాలుమోపి తీరుతామని ఇస్రో సంస్థ చైర్మన్ డాక్టర్ కే శివన్ ప్రకటించారు.

09/23/2018 - 00:17

అవుకు: కర్నూలు జిల్లా అవుకు జలాశయం నుంచి గండికోటకు శనివారం నీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ముఖ్యమంత్రి అవుకు మండలం రామాపురం హెడ్‌రెగ్యులేటర్ వద్ద స్విచ్ నొక్కి జీఎన్‌ఎస్‌ఎస్ గేట్లు ఎత్తారు. రోజుకు ఒక టీఎంసీ చొప్పున మొత్తం పది టీఎంసీల నీరు గండికోటకు విడుదల చేస్తారు. అదేవిధంగా గోరుకల్లు జలాశయం, పులికనుమ ఎత్తిపోతలను ప్రారంభించారు.

09/23/2018 - 00:14

కర్నూలు, సెప్టెంబర్ 22: రాష్ట్రంలో సహజ ఎరువులతో పంటలు పండించే ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఇది రాష్ట్రానికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. కర్నూలు జిల్లా అవుకు జలాశయం సమీపంలో నిర్మించిన టనె్నల్‌ను శనివారం ప్రారంభించి సీఎం కడప జిల్లా గండికోట జలాశయానికి నీటిని విడుదల చేశారు. అనంతరం అవుకు జలాశయంలో జలసిరి హారతి నిర్వహించారు.

09/22/2018 - 12:55

హైదరాబాద్: బెంగళూరు నుంచి కాచిగూడ వస్తున్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడి జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి రైల్వేస్టేషన్‌లో ఆగివున్న సమయంలో కిటికీల నుంచి ఐదుగురు ప్రయాణీకుల నగలు, నగదు దోపిడి చేశారు. మొత్తం 25 తులాల నగలు, రూ.10 వేల నగదు దోచుకువెళ్లారు. సిగ్నిల్స్‌ను కోసి రైలు ఆగిన తరువాత ఈ దోపిడికి పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.

09/22/2018 - 05:48

కట్టంగూర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీలన్నీ ఏకమై మహాకూటమిగా ముందుకు వస్తున్నాయని, వారి కూటమిని ప్రజలంతా మాయకూటమిగా భావిస్తున్నారని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.

Pages