S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/15/2019 - 02:19

హైదరాబాద్, ఏప్రిల్ 14: తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికై టీఆర్‌ఎస్‌లో చేరి న ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సీఎల్‌పీ డిమాండ్ చేసింది. సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదివారం ఇక్కడ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించారు.

04/15/2019 - 01:27

హైదరాబాద్: తెలంగాణలో ‘పరిషత్’ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) పక్కా ప్రణాళిక రూపొందించింది. ఎస్‌ఈసీ కమిషనర్ వి. నాగిరెడ్డి ఇప్పటికే ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్‌లతో జరిపిన చర్చల అనంతరం ఎన్నికల నిర్వహణకోసం సమగ్ర ప్రణాళికను రూపొందించారు.

04/15/2019 - 01:25

హైదరాబాద్: తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో సోమవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని చోట్ల మోస్తరుగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన జారీ చేస్తూ కొన్ని చోట్ల సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

04/15/2019 - 01:25

హైదరాబాద్, ఏప్రిల్ 14: పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి, పోలింగ్ ముగిసే వరకు గవర్నర్ నరసింహన్‌ను కలువని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చాలా రోజుల తర్వాత ఆదివారం రాజ్‌భవన్‌కు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.

04/15/2019 - 01:47

హైదరాబాద్, ఏప్రిల్ 14: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటమి భయంతోనే పెడబొబ్బలు పెడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. చంద్రబాబు ప్రవర్తనలో, ఆయన ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందన్నారు. ‘బాబు ఖేల్ ఖతం’ అని వ్యాఖ్యానించారు. గతంలో 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు గెలిచింది ఇదే ఈవీఎంలతో కాదా?

04/15/2019 - 01:08

మడకశిర: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్రంలోని రాజకీయ పార్టీల నాయకులు కలసి రావాలని కోరుతూ వివిధ పార్టీల అధ్యక్షులకు లేఖలు రాసినట్టు పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా మడకశిర మండల పరిధిలోని స్వగ్రామం నీలకంఠాపురంలో ఆదివారం రఘువీరా విలేఖరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అవసరం చాలా ఉందన్నారు.

04/15/2019 - 01:06

గుంటూరు, ఏప్రిల్ 14: సమాజ హితం కోసం తన మేధోసంపత్తిని ధారపోసి, నవ సమాజ నిర్మాణానికి నాంది పలికిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలు నిరుపమానమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 128వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఇక్కడ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రాష్టస్థ్రాయి వేడుకలు సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు కోలా భాస్కర్ అధ్యక్షతన జరిగాయి.

04/15/2019 - 01:02

రాజమహేంద్రవరం: గోదావరి జిల్లాల ఓటర్ల తీర్పు ఎటువైపుందోనని రాజకీయ పార్టీల నేతలు ఉత్కంఠకు గురవుతున్నారు. ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నామో నామమాత్రంగానైనా తమ తీరును వెల్లడించకుండా జరిపిన నిశ్శబ్ద ఓటింగ్ వారిలో ఒకింత భయాన్ని సైతం కలిగిస్తోంది.

04/15/2019 - 05:02

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

04/15/2019 - 04:41

రాజంపేట, ఏప్రిల్ 14 : కడప జిల్లాలో వెలసిన ఒంటిమిట్ట శ్రీకోదండరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి లక్ష్మణ సమేత శ్రీసీతారామచంద్రులు హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించి అనంతరం స్వామివారు హంస వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఆ తర్వాత స్వామివారికి ఏకాంతసేవ నిర్వహించారు.

Pages