S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/20/2017 - 01:01

హైదరాబాద్, డిసెంబర్ 19: తెలంగాణ చరిత్ర వెయ్యేళ్లకు పూర్వం నుండే ప్రారంభం అయిందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. మంగళవారం నాడు రవీంద్రభారతి గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ ప్రాంగణం ఇరివెంటి కృష్ణమూర్తి వేదికపై జరిగిన తెలంగాణ చరిత్ర గోష్టికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

12/20/2017 - 00:49

హైదరాబాద్, డిసెంబర్ 19: జాతీయ స్థాయి మెడికల్ అడ్మిషన్లకు ఆమోదం తెలుపుతూ రెండు తెలుగు రాష్ట్రాలూ నేషనల్ పూల్‌లో చేరడంతో 2018 నుండి మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లు జాతీయ స్థాయిలో జరగనున్నాయి. నీట్ జాతీయ పూల్‌లోకి చేరడం వల్ల 15 శాతం సీట్లు కోల్పోయినా, దాదాపు మరో 15 రెట్లు అధికంగా సీట్లకు పోటీ పడే వీలుకలుగుతుంది.

12/20/2017 - 02:17

విజయవాడ, డిసెంబర్ 19: గ్రూపు-1 మెయిన్స్ (2011) ఫలితాలను ఎపీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. 152 పోస్టులకు 294 మందిని ఎంపిక చేసింది. వీరికి విజయవాడలోని ఆ సంస్థ కార్యాలయంలో జనవరి 22 నుంచి ఫిబ్రవరి 20 వరకూ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభం అవుతాయి. ఇతర వివరాలను ఆ సంస్థ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

12/19/2017 - 04:00

ఖమ్మం, డిసెంబర్ 18: జిల్లాల్లో ఐటి విస్తరణతో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని ఐటి హబ్‌ను పరిశీలించిన ఆమె నిర్మాణం, కంపెనీలతో పాటు ఐటి హబ్ బ్లూ ప్రింట్‌ను పరిశీలించి అడిగి తెలుసుకున్నారు.

12/19/2017 - 03:37

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014 ఏప్రిల్ నుంచి 2017 జూలై వరకూ మొత్తం రూ.6598.25 కోట్లు ఖర్చు చేసిందని కేంద్రం వెల్లడించింది. అందులో కేంద్ర ప్రభుత్వం రూ. 4343.52 కోట్లు విడుదల చేసినట్టు జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ వెల్లడించారు.

12/19/2017 - 03:22

హైదరాబాద్, డిసెంబర్ 18: తెలంగాణలో న్యాయపరిపాలనలో తెలుగు భాష పూర్తిగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని న్యాయశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రవీంద్రభారతి మినీ హాలులో (లక్ష్మీనరసింహ శర్మ ప్రాంగణంలోని డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి వేదిక) సోమవారం ‘న్యాయ పరిపాలన రంగాల్లో తెలుగు’ అమలుపై జరిగిన చర్చలో మంత్రి పాల్గొన్నారు.

12/19/2017 - 02:39

హైదరాబాద్, డిసెంబర్ 18: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ తన వందవ నోటిఫికేషన్‌ను సోమవారం నాడు విడుదల చేసింది. కమిషన్ చైర్మన్ డాక్టర్ గంటా చక్రపాణి, కార్యదర్శి ఎ వాణి ప్రసాద్‌లు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఆవిర్భవించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా చైర్మన్ సోమవారం సాయంత్రం పాత్రికేయులతో మాట్లాడారు.

12/19/2017 - 02:34

హైదరాబాద్, డిసెంబర్ 18: కాళేశ్వరం ప్రాజెక్టుకు మొదటి, రెండవ దశకు ఇప్పటికే అటవీశాఖ అనుమతి లభించగా అతి కీలకమైన పర్యావరణ అనుమతి కూడా సోమవారం లభించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లడం లేదని ప్రాజెక్టుల ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ (ఇఎసి) సోమవారం స్పష్టం చేస్తూ పర్యావరణ అనుమతిని జారీ చేసింది.

12/19/2017 - 02:28

రాజమహేంద్రవరం, డిసెంబర్ 18: గోదావరి నది శుష్కిస్తోంది.. చిక్కి శల్యమవుతోంది.. నిత్యం జల కళతో తొణికిసలాడే నదిలో ఇపుడు ఇసుక దిబ్బలు, లంకలు తేలిపోతున్నాయి. సహజ నీటి లభ్యత రోజు రోజుకీ క్షీణిస్తోంది. డిసెంబర్ ఒకటి నుంచి ఏప్రిల్ 15 వరకు గోదావరి డెల్టాలో రబీ నీటి అవసరాలకు గోదావరి ధవళేశ్వరం బ్యారేజి నుంచి జలాలను విడుదల చేస్తారు.

12/19/2017 - 02:26

హైదరాబాద్, డిసెంబర్ 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుల పల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నక్సల్స్ శవపరీక్షల నివేదికలు, వాటి వీడియో రికార్డింగులను సమర్పించాలని పోలీసు శాఖను ఉమ్మడి హైకోర్టు సోమవారం నాడు ఆదేశించింది. ఎన్ కౌంటర్ ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని కోరుతూ పౌర హక్కుల సంఘం దాఖలు చేసిన ప్రజాప్రయోజనా వాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది.

Pages