S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/05/2017 - 01:48

న్యూఢిల్లీ, నవంబర్ 4: తెలంగాణ రాష్ట్రాన్ని దేశ ఆహారోత్పత్తుల రవాణా హబ్‌గా మారుస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు ప్రకటించారు. రాష్ట్రానికి భౌగోళికంగా ఉన్న అనుకూలతల వలన ఈ లక్ష్యాన్ని సునాయసంగా సాధించగలుగుతామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగా

11/05/2017 - 02:30

హైదరాబాద్, నవంబర్ 4: తెలంగాణలో ముస్లింలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచి తీరుతామని, ఈ అంశంపై అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రం ఆమోదం నిమిత్తం పంపామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి నివేదించామన్నారు. శనివారం ఆయన శంషాబాద్‌లో జరిగిన అఖిల భారత ముస్లిం విద్యాసొసైటీ సమావేశానికి పంపిన సందేశంలో పై విధంగా అన్నారు.

11/05/2017 - 01:50

అమరావతి, నవంబర్ 4: వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో రేపటి నుంచి పాదయాత్ర చేపట్టనున్న వైసీపీ అధినేత జగన్ సంకల్పానికి తొలి ఎదురుదెబ్బ తగిలింది. జగన్ తిరుమలకు వెళ్లి సంకల్పయాత్ర విజయవంతం చేయాలని మొక్కుకున్న రోజునే, ఆ పార్టీ నాయకత్వానికి సెంటిమెంటుపరమైన శరాఘాతం తగిలింది. ఆ పార్టీకి చెందిన

11/05/2017 - 01:37

హైదరాబాద్, నవంబర్ 4: రోజురోజుకూ గ్రామాల నుండి పట్టణాలకు వలస పెరగడంతో పట్టణాల్లో సౌకర్యాలు మృగ్యమైపోతున్నాయని, కాలుష్యం, తాగునీటి సమస్య, రవాణా ఇబ్బందులు ఎదురవుతున్నాయని శనివారం నాడిక్కడ మొదలైన అర్బన్ మొబిలిటీ అంతర్జాతీయ సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ సదస్సును ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు ప్రారంభించారు.

11/05/2017 - 01:52

గుంటూరు, నవంబర్ 4: ‘సంపూర్ణ ఆరోగ్యానికి సైకిల్ తొక్కితే మంచిది. ఆ గుర్తుకు ఓటేస్తేనే అభివృద్ధి. నమ్ముకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. శనివారం గుంటూరుకు సమీపంలోని పేరేచర్లలో 520 ఎకరాల్లో నిర్మించిన నగరవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్తీక వనసమారాధనలో భాగంగా సహపంక్తి భోజనం చేశారు. మహిళలతో కోలాటమాడారు.

11/05/2017 - 01:25

హైదరాబాద్, నవంబర్ 4: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె శనివారం నాడు 6ఇ 608 ఇండిగో విమానంలో ముంబైకి వెళ్తుండగా విమాన సిబ్బందిలోని అజితేష్ అనే వ్యక్తి అమర్యాదగా ప్రవర్తించాడని సింధు ట్విట్టర్‌లో పేర్కొంది. గ్రౌండ్ స్ట్ఫా అజితేశ్ నాతో చాలా అనాగరికంగా ప్రవర్తించాడు.

11/05/2017 - 04:47

హైదరాబాద్, నవంబర్ 4: నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల్లో 2017-18 సంవత్సరానికి అందుబాటులో ఉన్న 330 టిఎంసిల నీటిలో తెలంగాణకు 34 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 66 శాతం నీళ్లు కేటాయిస్తూ కృష్ణా నది యాజమాన్య బోర్డ్ (కెఆర్‌ఎంబి) నిర్ణయించింది. కెఆర్‌ఎంబి చైర్మన్ ఎకె శ్రీవాత్సవ అధ్యక్షతన బోర్డు సమావేశం శనివారం ఇక్కడి జలసౌదాలో జరిగింది.

11/04/2017 - 04:37

హైదరాబాద్, నవంబర్ 3: నగరాల్లోనూ, పట్టణాల్లోనూ, మొబిలిటీకి సంబంధించిన అంశాలు, సవా ళ్లు, వాటికి పరిష్కారాల గురించి చర్చించడానికి శనివారం నుండి హైదరాబాద్‌లో జాతీయ సదస్సు ప్రారంభం కానుంది. దీనిని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారు. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి హాజరవుతారు.

11/04/2017 - 02:22

హైదరాబాద్, నవంబర్ 3: ఆంధ్ర రాష్ట్రంలో 2012 నుంచి 2014 అక్టోబర్ వరకు జైళ్లలో 19 మంది ఖైదీలు అసహజంగా మరణించారని ఆ రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో జైళ్లలో మృతి చెందిన ఖైదీల వివరాలను సమర్పించేందుకు మరి కొంత గడువును కోర్టును కోరింది.

11/04/2017 - 02:20

హైదరాబాద్, నవంబర్ 3: వైకాపా అధ్యక్షుడు, ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఇక్కడ సిబిఐ కోర్టులో కేసు విచారణకు హాజరయ్యారు. జగన్ ఈ నెల 6వ తేదీ నుంచి ఇడుపులపాయలో పాదయాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే. విచారణ అనంతరం ఆయన సాయంత్రం తిరుమలకు బయలుదేరి వెళ్లారు. శనివారం ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంటారు.

Pages