S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/25/2017 - 22:45

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: గద్వాల్- మాచెర్ల కొత్త రైల్వే లైను నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు చేపట్టాలని తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు నంది ఎల్లయ్య రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్‌ను కోరారు. నంది ఎల్లయ్య బుధవారం గోయల్‌ను కలిసి ఈ మేరకు ఒక లేఖను అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం, రైల్వే శాఖ సయుక్తంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం ఖర్చును భరిస్తోందన్నారు.

10/25/2017 - 04:06

హైదరాబాద్, అక్టోబర్ 24: కొత్త హంగులు సంతరించుకున్న జనసేన పరిపాలన కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. భరతమాతకు శాస్త్రోక్తంగా పూజలు చేసిన అనంతరం సర్వమత ప్రార్ధనలు జరిగాయి. అనంతరం కార్యాలయంలో పరిపాలనా కార్యక్రమాలు ఆరంభించారు.

10/25/2017 - 03:53

కంఠేశ్వర్ (నిజామాబాద్), అక్టోబర్ 24: నిజామాబాద్ నుండి తిరుపతి మధ్య నవంబర్ 2వ తేదీ నుండి రాయలసీమ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు పెట్టనుంది. ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రాగానే నిజామాబాద్ నుండి తిరుపతి వెళ్లేందుకు కేవలం 16 గంటల 10 నిమిషాల వ్యవధి మాత్రమే పడుతుంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుండి అనునిత్యం సుమారు 200 మంది వరకు భక్తులు తిరుపతి వెళ్తుంటారు.

10/25/2017 - 03:42

హైదరాబాద్, అక్టోబర్ 24: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి కాలరీస్‌కు చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఓ రోడ్డు పనుల ఫైనల్ బిల్లులకు సంబంధించి రికార్డుల కోసం లంచం తీసుకుంటూ ఏసిబికి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ముక్రా రాజేశేఖర్ మణుగూరు సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

10/25/2017 - 03:54

హైదరాబాద్, అక్టోబర్ 24: మిత్రపక్షమైన బిజెపితో బంధాలు తెగిపోలేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు. బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్‌రెడ్డి తనతో మాట్లాడుతూనే ఉన్నారని, రాబోయే శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై కలిసే ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. మంగళవారం రమణ పార్టీ కార్యాలయం (ఎన్టీఆర్ భవన్)లో మీడియాతో కొంతసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

10/25/2017 - 02:33

హైదరాబాద్, అక్టోబర్ 24: గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో పారిశుధ్యలోపం వల్ల అనారోగ్య పరిస్ధితులు నెలకొన్నాయని, ఈ విషయమై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. గుంటూ రు, విశాఖపట్నం కలెక్టర్లు మూడువారాల్లోగా అఫిడవిట్‌లను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

10/25/2017 - 02:35

హైదరాబాద్, అక్టోబర్ 24: రైల్వే స్టేషన్లలోని రిజర్వేషన్ కేంద్రాల వద్ద దక్షిణ మధ్య రైల్వే తనిఖీలు నిర్వహించింది.

10/25/2017 - 02:23

హైదరాబాద్, అక్టోబర్ 24: ఖమ్మం రీజియన్ కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, టిఎస్‌ఆర్టీసీ స్ట్ఫా అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు అనుబంధం) రాష్ట్ర కమిటీ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు సమ్మె నోటీసు ఇచ్చింది. ఎస్‌డబ్ల్యుఎఫ్ కార్యదర్శి గంగాధర్, ప్రచార కార్యదర్శి పి రవీందర్‌రెడ్డి, కోశాధికారి ఎవి రావు నేతృత్వంలోని బృందం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌ను కలిసింది.

10/25/2017 - 02:05

హైదరాబాద్, అక్టోబర్ 24: గోదావరి పరీవాహకంలోని శ్రీరామ్‌సాగర్, నిజాంసాగర్, సింగూరు, ఘనపూర్ అనికట్, గుత్ప, అలీ సాగర్, లక్ష్మికెనాల్ ఆయకట్టు పరిధిలో రెండో పంటకు నీరు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల్లో మిషన్ భగీరథ అవసరాలకు మినహాయించి మిగతా నీటిని పంట పొలాలలకు మళ్లించడానికి సిఎం కెసిఆర్ అంగీకరించారు.

10/25/2017 - 01:47

అమరావతి, అక్టోబర్ 24: రాజధాని అమరావతిలో అత్యుత్తమ రవాణా వ్యవస్థ నెలకొల్పేందుకు సిఎం చంద్రబాబు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందు కోసం లండన్ నగరంలో పర్యటించి, అక్కడి విశిష్టతలను అధ్యయనం చేశారు. లండన్ రవాణా విభాగం సెంట్రల్ కమాండ్ సెంటర్‌ను సిఎం బృందం మంగళవారం సాయంత్రం సందర్శించింది.

Pages