S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/18/2018 - 02:23

హుజూర్‌నగర్, సెప్టెంబర్ 17: ప్రధాని నరేంద్రమోదీని ఢీకొనలేక అన్ని ప్రతిపక్ష పార్టీలు డీలా పడ్డాయని.. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా భయంతోనే ఎనిమిది నెలలు ముందుగా శాసనసభ రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికలు అంటున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ అన్నారు.

09/18/2018 - 01:44

తిరుపతి, సెప్టెంబర్ 17: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు... ఆదిమద్యాంత రహితుడు... ఆపద మొక్కుల వాడు... శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంటేనే భక్తులకు ఆనందోత్సవాలు. ఆ వాహనసేవలో పాల్గొని తరలించాలని తపిస్తారు. అందులోనూ శ్రీవారికి అత్యంత ఇష్టుడైన గరుడ వాహన సేవలో పాల్గొనాలంటే ఎనలేని ఆసక్తి కనపరుస్తారు.

09/18/2018 - 01:42

ఐరాల, సెప్టెంబర్ 17: చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శేషవాహనంపై వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఈకార్యక్రమానికి కాణిపాకం, వడ్రాంపల్లి, మిట్ట ఇండ్లు, కొత్తపల్లి, బొమ్మసముద్రం, అడపగుండ్లపల్లి, తిమ్మోజపల్లి, తివరువణంపల్లి, చిగర్లపల్లి, నగరంపల్లి గ్రామాలకు చెందిన కమ్మ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు.

09/18/2018 - 01:40

తిరుపతి, సెప్టెంబర్ 17: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన సోమవారం ఉదయం శ్రీహరి మోహనీ అవతారంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకారార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చారు. పక్కనే శ్రీకృష్ణుడు అలంకృతుడై మరో తిరుచ్చిపై భక్తులకు అభయమిచ్చాడు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు కదులుతుంటే భక్తుల కోలాటాలు, డ్రమ్స్ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ ఊరేగింపు అత్యంత రమణీయంగా జరిగింది.

09/18/2018 - 01:38

అయినవిల్లి, సెప్టెంబర్ 17: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆఫ్రికాలోని ఐవరీకోస్టు దేశం విఘ్నేశ్వరుని రూపంతో ప్రత్యేక వెండి నాణేన్ని విడుదలచేసింది. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం స్టేట్ బ్యాంకు ఉద్యోగి ఇవటూరి రవి సుబ్రహ్మణ్యం సేకరించిన ఆ నాణేన్ని సోమవారం అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయ ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

09/18/2018 - 02:58

హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ భాషకు తెలంగాణ ప్రభుత్వం ప్రాణ ప్రతిష్ఠ పెట్టిందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ విద్యా, సామాజిక సాంస్కృతిక సాహిత్య వేదిక భాషా సాహిత్య రంగాలపై నిర్వహించిన చర్చాగోష్టిలో సిధారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ భాషలో లక్ష కవులను తయారుచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

09/18/2018 - 03:49

హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు జరగబోయే ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని, ఏ స్థాయిలోనూ, ఎక్కడ కూడా లోపాలు లేకుండా చూస్తామని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) రజత్ కుమార్ ప్రకటించారు. జిల్లా ఎన్నికల అధికారులైన జిల్లా కలెక్టర్లకు సోమవారం ఇక్కడ ఐటీ తదితర అంశాల్లో ఒకరోజు శిక్షణ ఇచ్చారు.

09/18/2018 - 00:51

ఆదిలాబాద్, సెప్టెంబర్ 17: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని మూడు ఎస్టీ నియోజకవర్గాల్లో లంబాడా తెగ అభ్యర్థులను ఓడించి ఆదివాసీ అభ్యర్థులను గెలిపించుకుంటామని, లంబాడా అభ్యర్థులను ఇకనుండి తమ గూడేల్లోకి రానిచ్చేది లేదని ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక అల్టిమేటం జారీ చేసింది.

09/18/2018 - 00:49

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను బొంద పెడతామని పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్న పోలీసు అధికారుల సంగతి అప్పుడు చూస్తామని ఆయన హెచ్చరించారు.

09/18/2018 - 03:48

అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్న పొడమల గ్రామంలో నెలకొన్ని వివాదం సద్దుమణిగింది. రెండు రోజుల క్రితం వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రబోధానంద స్వామి ఆశ్రమ నిర్కాహకులు చిన్నపొలమడ, పెద్దపొలమడ గ్రామస్తుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ నేపథ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు తెరపడింది. రెండు గ్రామాల ప్రజలు, ఆశ్రమ నిర్వాహకుల మధ్య తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.

Pages