S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/15/2017 - 01:51

హైదరాబాద్, సెప్టెంబర్ 14: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా తిరువనంతపురం-హౌరా, యశ్వంత్‌పూర్-వైష్ణోదేవి ఖత్ర మధ్య ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం ఉమాశంకర్ కుమార్ తెలిపారు. ట్రైన్ నెం.06515 తిరువనంతపురం-హౌరా ప్రత్యేక రైలు తిరువనంతపురం నుంచి ఈనెల 17న మ.గం. 12:40లకు బయలుదేరి మరుసటి రోజు రా.గం. 10:55లకు హౌరా చేరుకుంటుంది.

09/15/2017 - 02:09

హైదరాబాద్, సెప్టెంబర్ 14: ఎమ్మార్ ప్రాపర్టీస్ స్కాం కేసులో కోనేరు మధు పాత్ర ఉందని చేసిన అభియోగాలకు ఎటువంటి సాక్ష్యం లేదని పూర్వ అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి హైకోర్టుకు తెలిపారు. ఈ కేసును జస్టిస్ బి శివశంకర్ రావు విచారించారు. ఈ కేసులో నిందితుడు కోనేరు మధు తరఫున ముకుల్ వాదనలు వినిపిస్తూ ఈ విల్లాల కొనుగోలు, అమ్మకాల్లో తన క్లైంట్‌కు ఎటువంటి పాత్ర లేదన్నారు.

09/15/2017 - 01:48

హైదరాబాద్, సెప్టెంబర్ 14: అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీలను స్వాధీనం చేసుకునేందుకు ముందుకు వచ్చిన సుభాష్ చంద్ర ఫౌండేషన్ (ఎస్సెల్ గ్రూప్-జీటివి)ను రూ. 10 కోట్లు డిపాజిట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

09/15/2017 - 01:47

కొత్తగూడెం, సెప్టెంబర్ 14: తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాలు, 11 ఏరియాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు ఐక్యతారాగాన్ని ప్రదర్శిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ కార్మిక సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఓడించాలనే లక్ష్యంతో ఎఐటియుసికి మద్ద తు ప్రకటించాయి.

09/15/2017 - 01:54

హైదరాబాద్, సెప్టెంబర్ 14: జనసేన పార్టీ యువ విభాగాలకు వివిధ కార్యక్రమాలకు యువతను రిక్రూట్‌చేసుకునేందుకు ఈ నెల 18వ తేదీన గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా ల్లో సమావేశాలను నిర్వహించనుంది. దసరా అనంతరం కృష్ణా జిల్లాలో మరో సమావేశాన్ని నిర్వహించడంతో దాదాపు జనసేన ఔత్సాహిక వేదికలు చివరి అంకానికి చేరుకుంటాయి.

09/15/2017 - 01:19

హైదరాబాద్, సెప్టెంబర్ 14: తెలంగాణ నిజంగా బంగారమే. దేశంలో యువ రాష్ట్రం గా పేరున్న తెలంగాణలో పెట్టుబడుల వరద ప్రారంభమైంది. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక, ఐటి విధానాల వల్ల ఆర్ధికాభివృద్ధిరేటును పెంచుకుంది. పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రగామిగా నిలిచింది.

09/15/2017 - 01:13

హైదరాబాద్, సెప్టెంబర్ 14: తెలంగాణలోని దేవాలయాలకు ‘స్వర్ణయుగం’ రాబోతోంది. దశాబ్దాల నుండి పరిష్కారం కాని సమస్యలకు శుక్రవారం పరిష్కారం లభించబోతోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నేతృత్వంలో ప్రగతిభవన్‌లో శుక్రవారం ప్రధానమైన సమావేశం నిర్వహిస్తున్నారు.

09/15/2017 - 01:39

హైదరాబాద్, సెప్టెంబర్ 14: ‘దేశంలో ఇతర రాష్ట్రాలు విడిపోయి కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఏ నిబంధనలు పాటించారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కూడా అలాగే పాటించాలి’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ‘ఏమైనా సమస్యలు తలెత్తితే రెండు రాష్ట్రాలు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలి.అలా సాధ్యం కానీ పక్షంలో కేంద్రం జోక్యం చేసుకుంటుంది.

09/15/2017 - 00:59

అమరావతి, సెప్టెంబర్ 14: తమ రాష్ట్రం ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్యంలో దేశంలోనే అగ్రగామిగా ఉందని, ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదగాలన్నది తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఇంధన సామర్థ్యంలో ప్రపంచంలో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, మేలిమి పద్ధతులను రాష్ట్రానికి తీసుకురావాలని కోరారు.

09/15/2017 - 00:54

విశాఖపట్నం, సెప్టెంబర్ 14: విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ నెట్‌వర్క్ కుప్పకూలింది. ఈ ఘటన జరిగి 20 రోజులైనా యాజమాన్యం గోప్యంగా ఉంచింది. సుమారు 20 రోజుల కిందట పోర్టు నెట్‌వర్క్ స్తంభించింది. ఇప్పటికే దేశంలోని మేజర్ పోర్టుల్లో భద్రతను పెంచుతున్న నేపథ్యంలో విశాఖ మేజర్ పోర్టులో నెట్‌వర్క్ కుప్పకూలడం పట్ల అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Pages