S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/15/2017 - 00:51

హైదరాబాద్, సెప్టెంబర్ 14: గ్రూప్-2 నియామక ప్రక్రియకు హైకోర్టు గురువారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిం ది. అభ్యర్ధుల సర్ట్ఫికేట్లు పరిశీలించకోవచ్చని తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు సూచించింది. అభ్యర్ధుల వినతి మేరకు 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు పిలిచినందున ఇంకా ఏమైనా అభ్యంతరాలుంటే వారు కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. జూన్ 12న హైకోర్టు ఈ అంశంపై స్టే ఉత్తర్వులు ఇచ్చింది.

09/15/2017 - 00:50

అమరావతి, సెప్టెంబర్ 14: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లు అమరావతిలో పాలనాభవనాలకు శంకుస్థాపనపై సందిగ్ధత ఏర్పడింది. నార్మన్ ఫోస్టర్ బృందం సమర్పించిన డిజైన్లపై బాబు సంతృప్తి వ్యక్తం చేయకపోవడంతోపాటు మరికొంత సమయం తీసుకోవాలని చెప్పడంతో ముందు ప్రకటించినట్లు విజయదశమి రోజున పరిపాలనా భవనం , అసెంబ్లీ భవనాల శంకుస్థాపనపై సందేహాలు నెలకొన్నాయి.

09/14/2017 - 01:37

హైదరాబాద్, సెప్టెంబర్ 13: హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థిని చాందిని హత్య సంచలనం సృష్టించింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ (17) హత్య కేసును పోలీసులు మూడు రోజుల్లోనే ఛేదించారు. ఆమె స్కూల్‌మేట్, ప్రియుడిగా భావిస్తున్న సాయికిరణ్‌రెడ్డి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.

09/14/2017 - 01:36

హైదరాబాద్, సెప్టెంబర్ 13: రైతులకు ఉచిత పెట్టుబడి సమకూర్చడానికి భూ ప్రక్షాళన కార్యక్రమానికి శ్రీకారం చుడితే విపక్షాలు రైతుల నోట్లో మట్టికొట్టడానికి ప్రయత్నిస్తున్నాయని తెరాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతును రాజుగా మార్చాలన్న కెసిఆర్ సంకల్పాన్ని విపక్షాలు అడ్డుకోలేవన్నారు.

09/14/2017 - 01:59

హైదరాబాద్, సెప్టెంబర్ 13: తెలంగాణలో పత్తిపంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. బుధవారం జరిగిన మంత్రివర్గ బృందం సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను మార్కెటింగ్ మంత్రి టి. హరీష్‌రావు ప్రకటించారు. 2017-18 సంవత్సరానికి పత్తి (లాంగ్‌స్టెపుల్) ఎంఎస్‌పి క్వింటాల్‌కు 4,320 రూపాయలుగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది.

09/14/2017 - 01:35

హైదరాబాద్, సెప్టెంబర్ 13: భద్రాచలం ఆలయాన్ని దేశంలోనే అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు సిఎం కె చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ప్రస్తుత దేవాలయానికి ఉత్తరం, పడమర వైపునున్న స్థలాలతో కలిపి దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయాన్ని అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు.

09/14/2017 - 01:34

హైదరాబాద్, సెప్టెంబర్ 13: వర్షాకాలం తుది దశకు చేరింది. వర్షాలతో కృష్ణా బేసిన్ జలాశయాలు నిండుతాయనుకున్న భ్రమలు పటాపంచలయ్యాయి. అరకొరగా వచ్చిన 30 టిఎంసి నీటి కోసం తెలుగు రాష్ట్రాలు మంచినీటి అవసరాల కోసం పంచుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. ఇదీ తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా బేసిన్ పరిస్థితి. ఇక ఆశంతా అక్టోబర్, నవంబర్ నెలల్లో వచ్చే తుపాన్లపైనే.

09/14/2017 - 01:34

గుంటూరు, సెప్టెంబర్ 13: అమరావతి నిర్మాణానికి రుణ మంజూరు నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం బుధవారం గ్రామాల్లో పర్యటించి రైతుల అభిప్రాయాలు సేకరించింది. మాట్సన్ జాన్ ఆర్నే నేతృత్వంలో కుదా బిర్గిత్, డాక్టర్ కాస్ట్రో గొంజాలో, మాక్సన్ తదితరులు తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక, తుళ్లూరు మండలం నేలపాడులో రైతులతో సమావేశమయ్యారు.

09/14/2017 - 01:55

విజయవాడ, సెప్టెంబర్ 13: తిరుపతిలో నిర్మించతలపెట్టిన సైన్సు సిటీలో ఏడు మ్యూజియాలను ఏర్పాటు చేయాలని అధికారులను సిఎం చంద్రబాబు ఆదేశించారు. అవి మరో సప్తగిరులుగా ప్రఖ్యాతి గాంచేలా డిజైన్లు రూపొందించాలని సిఎం ఆకాంక్షించారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో పోర్టులు, విమానాశ్రయాలు, పవర్ ప్రాజెక్టులు, గ్యాస్ పైపులైను ఏర్పాటు, ఫైబర్ నెట్ వంటి వౌలిక సదుపాయాల కల్పనపై బుధవారం సమీక్ష నిర్వహించారు.

09/14/2017 - 01:33

విజయవాడ, సెప్టెంబర్ 13: నదులను కాపాడుకుంటేనే మానవజాతికి మనుగడ ఉంటుందని సిఎం చంద్రబాబు అన్నారు. బుధవారం విజయవాడలోని పిబి సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ ఫర్ రివర్స్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాట్లాడారు. నదులను కాపాడుకుంటూ, భవిష్యత్తు తరాలకు నీటిని అందించే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఈషా ఫౌండేషన్ జగ్గీ వాసుదేవ్‌ను అభినందించారు.

Pages