S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/13/2017 - 02:43

హైదరాబాద్, సెప్టెంబర్ 12: ఆర్టీసి బస్టాండ్లలో తల్లులు తమ పిల్లలకు పాలిచ్చేందుకు వీలుగా ప్రత్యేక రూంలను ఏర్పాటు చేసే విషయమై తీసుకుంటున్న చర్యలను వివరించాలని కోరుతూ ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు, కేంద్రం, ఏపిఎస్ ఆర్టీసి, టిఎస్ ఆర్టీసికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మహిళల ఆత్మగౌరవం వారి వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించేందుకు తీసుకుంటున్న చర్యలనువివరించాలని హైకోర్టు ఆదేశించింది.

09/13/2017 - 02:30

హైదరాబాద్, సెప్టెంబర్ 12: సికింద్రాబాద్‌లో బైసన్‌పోలో, జింఖానా మైదానాన్ని తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణానికి కేటాయించడంపై స్టేటస్ రిపోర్టు సమర్పించాలంటూ హైకోర్టు మంగళవారం కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నివేదికను సెప్టెంబర్ 19వ తేదీలోగా సమర్పించాలని కోరింది.

09/13/2017 - 02:19

హైదరాబాద్, సెప్టెంబర్ 12: బతుకమ్మ, దసరాతోపాటు అక్టోబర్ 1న మొహ్రరం పండుగలు ఉండటంతో ఈనెల 25నే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని ఆర్థిక శాఖ అధికారులను సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.

09/13/2017 - 02:18

హైదరాబాద్, సెప్టెంబర్ 12: మద్యం షాపులకు నెలాఖరుతో గడువు ముగియనుండటంతో అక్టోబర్ 1నుంచి కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. కొత్త పాలసీ ప్రకారం మద్యం షాపుల లైసెన్స్‌ల జారీకి నేటి (బుధవారం) నుంచి ఈనెల 19 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. కొత్త పాలసీకి 2017 అక్టోబర్ నుంచి 2019 సెప్టెంబర్ 30 వరకు రెండేళ్ల కాలపరిమితి విధించింది. అలాగే కొత్త పాలసీలో అమ్మకాల సమయాన్నీ పెంచారు.

09/13/2017 - 02:13

హైదరాబాద్, సెప్టెంబర్ 12: వచ్చే విద్యాసంవత్సరం నుండి తెలంగాణలో ని అన్ని పాఠశాలల్లో మొదటి తరగతి నుండి 12వ తరగతి వరకూ కచ్చితంగా తెలుగు భాషను సబ్జెక్టుగా బోధించాలని సిఎం చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ఈమేరకు త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని, అనంతరం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు సూచించారు.

09/13/2017 - 02:23

హైదరాబాద్, సెప్టెంబర్ 12: ప్రపంచ తెలుగు మహాసభలను డిసెంబర్ 15నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించనున్నట్టు సిఎం చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. మహాసభల ప్రారంభోత్సవం, ముగింపు కార్యక్రమాలకు ప్రధాన మంత్రి, రాష్టప్రతిని ఆహ్వానించాలని నిర్ణయించారు. మహాసభల నిర్వహణకు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.

09/13/2017 - 01:58

పోలవరం ప్రాజెక్టు పనులు వేగం అందుకునే రోజులు వస్తున్నాయ. త్వరలోనే రూ. 1000 కోట్లు నాబార్డు నిధులు విడుదల కానున్నాయని ఏపీ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. మంగళవారాం ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజన్సీ వార్షిక సమావేశానికి హాజరైన మంత్రి మీడియాతో మాట్లాడారు.

09/13/2017 - 01:54

విశాఖపట్నం, సెప్టెంబర్ 12: కార్గో హ్యాండ్లింగ్‌లో దేశంలోనే టాప్ త్రీ అనిపించుకున్న విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ క్రమంగా పట్టుకోల్పోతోంది. గతంలో మాన్యువల్‌గా కార్గో హ్యాండ్లింగ్ చేసిన విశాఖపట్నం పోర్టు, ఇప్పుడు పూర్తి యాంత్రీకరణకు మారింది. దీంతోపాటు విశాఖపట్నం పోర్టుకు భారీ నౌకలు వచ్చేందుకు వీలుగా డ్రాఫ్ట్‌నూ పెంచారు. కోల్ ఎగుమతి, దిగుమతుల్లో విశాఖ పోర్టు ట్రస్ట్ అగ్రగామిగా ఉండేది.

09/13/2017 - 01:51

అమరావతి, సెప్టెంబర్ 12: ‘ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా 80 శాతం ప్రజా సంతృప్తే లక్ష్యం. ప్రస్తుతం 59శాతం సంతృప్తికి చేరుకున్నాం. ఇంకా 41 శాతం అసంతృప్తి ఉంది. దీన్ని 20 శాతానికి తగ్గించాలి. నంద్యాల, కాకినాడలో పెరిగిన 16 శాతం ఆధిక్యతను బెంచ్ మార్క్‌గా తీసుకోవాలి. ప్రభుత్వ సర్వేలో గతం కన్నా 20 శాతం పెరిగిందని వచ్చింది. సంతృప్తస్థాయి 60 నుంచి 80 శాతానికి పెంచడంలోనే మన సమర్థత కనిపిస్తుంది.

09/12/2017 - 03:22

హైదరాబాద్/ఖైరతాబాద్, సెప్టెంబర్ 11: దేశంలో అవినీతి అంతం మొందించేందుకు మరోసారి ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్టు సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే పేర్కొన్నారు. సోమవారం సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సర్పంచుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రధానికి రాసిన లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా అన్నాహజారే వీడియోకాల్‌లో మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు.

Pages