S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/12/2017 - 03:38

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ఆర్య వైశ్యులపై కంచ ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు.. కోమటోళ్లు’ పుస్తకం వివాదస్పదమైంది. ఈ పుస్తకాన్ని రాయడంపై ఆర్య వైశ్య సంఘాలు తీవ్ర నిరశన తెలిపాయి. ఈ పుస్తకం ఆర్యవైశ్యులను కించపరిచే విధంగా ఉందని, కనుక తక్షణమే ఈ ఆ పుస్తకాన్ని నిషేధించడంతో పాటు రచయతపై చర్యలు తీసుకోవాలని ఆ సామాజికవర్గ నేతలు చేస్తున్నారు. పలుచోట్ల ఐలయ్య దిష్టిబొమ్మలను, పుస్తకం ప్రతులను దగ్ధం చేశారు.

09/12/2017 - 02:11

హైదరాబాద్, సెప్టెంబర్ 11: అధిక రద్దీని నివారించేందుకు గాను గౌహతి-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 14న ప్రత్యేక రైలు ఉదయం 6.20కి గౌహతి నుంచి బయలు దేరి 16వ తేదీ శనివారం తెల్లవారు జామున నాలుగు గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని రైల్వే తెలిపింది. ఈ సౌకర్యాన్ని రైల్వే ప్రయాణీకులు వినియోగించుకోవాలని స్పష్టం చేసింది.

09/12/2017 - 01:43

శ్రీశైలం, సెప్టెంబర్ 11: శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. సోమవారం ఎగువ నుంచి 44వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 826.30 అడుగులకు చేరుకుంది. పూర్తిస్తాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు. ప్రస్తుతం 45.90 టిఎంసిల నీరు నిల్వ ఉంది.

09/12/2017 - 01:33

ఖమ్మం, సెప్టెంబర్ 11: గోదావరి, కృష్ణా నదులు తెలంగాణ గడ్డపై ప్రవహిస్తున్నప్పటికీ గత పాలకులంతా ఇక్కడి భూములను ఎడారిలా మార్చారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, రహదారుల భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.

09/12/2017 - 03:45

హైదరాబాద్, సెప్టెంబర్ 11: దసరా సందర్భంగా మహిళలకు పంపిణీ చేసేందుకు 16 నాటికి బతుకమ్మ చీరలన్నీ జిల్లా కేంద్రాలకు చేరుతాయని పరిశ్రమలు, చేనేత మంత్రి కె తారక రామారావు తెలిపారు. 18, 19, 20 తేదీల్లో చీరల పంపిణీ పూర్తవుతుందన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ ద్వారా ఒకవైపు నేతన్నలకు ఉపాధితోపాటు, పండగ సందర్భంగా ఆడపడుచులకు సంతోషం పంచినట్టు అవుతుందన్నారు.

09/12/2017 - 01:17

హైదరాబాద్, సెప్టెంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 39ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సోమవారం రాష్టవ్య్రాప్తంగా ధర్నాలు నిర్వహించింది. నియోజకవర్గాల కేంద్రాల్లో, ఆర్డీవో, ఎమ్మార్వో ఆఫీసుల ఎదుట కాంగ్రెస్ ధర్నాలు నిర్వహించింది. పలుచోట్ల సిఎం దిష్టిబొమ్మలు దగ్దం చేసి రాస్తారోకో నిర్వహించింది. హుజురునగర్‌లో టి.పిసిసి అధ్యక్షుడు ఎన్.

09/12/2017 - 01:14

హైదరాబాద్, సెప్టెంబర్ 11: తెలంగాణలో టీచర్ల నియామకం చేపట్టకుం డా వాయిదా కోరడంపై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలలో వౌలిక సదుపాయల కల్పన, ఉపాధ్యాయ నియామకాలపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖాన్విల్కార్, జస్టిస్ చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది.

09/12/2017 - 01:13

హైదరాబాద్, సెప్టెంబర్ 11: మిషన్ భగీరథ పథకం ద్వారా ఏడాది పొడవున ప్రతీ రోజు మంచి నీటి సరఫరా చేసేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ పథకం ద్వారా నీటి సరఫరా ప్రారంభమయ్యాక ఏ ఒక్కరోజు సరఫరా ఆగకుండా ప్రాజెక్టులలో కనీస వినియోగ మట్టాలను పాటించాలన్నారు. నిరంతర నీటి సరఫరా కోసం నదులలో 30 పాయింట్లను గుర్తించినట్టు చెప్పారు.

09/12/2017 - 00:55

కాకినాడ, సెప్టెంబర్ 11: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తీరంలో భారీ పరిశ్రమలకు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంమేరకు తీరంలో భారీ పరిశ్రమల స్థాపన వ్యవహారం కొలిక్కి వచ్చింది. మూడేళ్లుగా ఊరిస్తున్న పలు ప్రాజెకులు కొలువు తీరడానికి దారులు ఏర్పడ్డాయ. కొత్త పోర్టు సహా రూ.1169 కోట్ల పెట్టుబడితో ఏడు భారీ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు కానున్నాయి.

09/12/2017 - 00:49

అమరావతి, సెప్టెంబర్ 11: మరో 100 రోజుల్లో 28 ప్రాజెక్టులు పూర్తిచేయడం రాష్ట్ర చరిత్రలోనే కాదు, జాతీయస్థాయిలో మైలురాయి వంటిదని సిఎం చంద్రబాబు అన్నారు. సోమవారం నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గోదావరిలో ఇన్ ఫ్లో తగ్గిందని, అదే సమయంలో కృష్ణా, తుంగభద్రలో ఇన్ ఫ్లో పెరగడం సంతోషంగా ఉందన్నారు.

Pages