S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/11/2017 - 01:35

విశాఖపట్నం, సెప్టెంబర్ 10: నూతన ఆలోచనలతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యపడుతుందని ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్ 2017లో భాగంగా ‘సపోర్టింగ్ ఇన్నోవేటివ్ ఎంటర్ ప్రెన్యూర్స్ అండ్ రోల్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్’ అంశంపై ఆదివారం ఇక్కడ జరిగిన సదస్సును ఆయన ప్రారంభించారు.

09/11/2017 - 01:31

విజయవాడ, సెప్టెంబర్ 10: కృష్ణాడెల్టాలో కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో విస్తరించిన 13 లక్షల ఎకరాల ఆయకట్టును డెల్టా చరిత్రలోనే తొలిసారిగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో గోదావరి తల్లి ఆదుకుంది. కృష్ణానదిపై ఎగువన అక్రమంగా నిర్మితమవుతున్న ప్రాజెక్టుల కారణంగా గత దశాబ్దకాలంగా కృష్ణాడెల్టాలో ఏనాడూ ఖరీఫ్‌కు వరినాట్ల సమయానికి అంటే జూన్‌లో సాగు నీరందని స్థితి కొనసాగుతూ వస్తోంది.

09/11/2017 - 01:29

సత్యవేడు, సెప్టెంబర్ 10: ఆరుబయట ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు పిడుగుపాటుకు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా సత్యవేడు మండల పరిధిలోని చిన్న ఈటిపాకం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. చిన్న ఈటిపాకం గ్రామ శివార్లలోని పంట పొలాల్లో చిన్నారులు సరదాగా ఆడుకుంటున్న సమయంలో వర్షం రావడంతో ఓ చెట్టు కిందకు వెళ్లారు.

09/11/2017 - 01:28

అనంతపురం, సెప్టెంబర్ 10 : రాష్ట్రంలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని, అందుకోసం పరిశ్రమల ఏర్పాటుకు 50 శాతం సబ్సిడీ అందజేసి మహిళా ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు.

09/11/2017 - 01:20

విజయవాడ, సెప్టెంబర్ 10: రాజధాని అమరావతిలో నిర్మించనున్న అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు తుది డిజైన్లు ఖరారయ్యాయి. ఈ నెల 13న వీటికి ఆమోద ముద్ర పడనుంది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నార్మన్ అండ్ ఫోస్టర్స్ సంస్థ ప్రతినిధులు సోమవారం సమావేశం కానున్నారు. ఈ భవనాలకు సంబంధించి డిజన్లను ఈసందర్భంగా ఖరారు చేసే అవకాశం ఉందంటున్నారు.

09/11/2017 - 03:54

హైదరాబాద్, సెప్టెంబర్ 10: జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాల నివారణకు అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం అధ్వర్యంలో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఐటిఎంఎస్)ను ఆవిష్కరించనున్నారు.

09/10/2017 - 03:37

తిరుపతి, సెప్టెంబర్ 9 : ఎక్కువమంది వయోవృద్ధులు, దివ్యాంగులు, ఐదేళ్లలోపు పిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం కల్పించాలన్న ఉన్నతాశయంతో టిటిడి ప్రతినెలా రెండు సాధారణ రోజుల్లో ప్రత్యేక దర్శనం కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 13, 20 తేదీల్లో 65 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులకు, దివ్యాంగుల కోసం టిటిడి 4వేల టోకెన్లను జారీచేయనుంది.

09/10/2017 - 01:52

హైదరాబాద్, సెప్టెంబర్ 9: అధిక రద్దీని నివారించేందుకు గాను రెండు ప్రత్యేక రైళ్లను తిరువనంతపురం సెంట్రల్-హౌరా-తిరువనంతపురం సెంట్రల్ మధ్య నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 10న తిరువనంతపురం నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుందని, తిరుగు ప్రయాణంలో హౌరా నుంచి సెప్టెంబర్ 14న బయలుదేరుతుందని తెలిపింది.

09/10/2017 - 01:35

శ్రీశైలం, సెప్టెంబర్ 9: శ్రీశైలం జలాశయానికి ఎగువ నంచి వరద రాక మళ్లీ మొదలైంది. నాలుగు రోజుల నుంచి ఎగువ నుంచి వరద నీరు వస్తోంది. అయితే శుక్రవారం ఇన్‌ఫ్లో నమోదుకాలేదు. శనివారానికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏకంగా 71 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తు తం 816.60 అడుగులుగా నమోదైంది.

09/10/2017 - 01:34

పరకాల, సెప్టెంబర్ 9: మిసెస్ ఇండియా బ్యూటీక్వీన్ కిరీటం తెలంగాణలోని జయశంకర్ జిల్లా చిట్యాల మండలం జడలపేటకు చెందిన కొట్టె స్నేహ సాధించింది. రాజస్థాన్‌లోని జైపూర్ క్రోనేప్లాజాలో నిర్వహించిన పోటీలో మిసెస్ క్వీన్ ఇండియాగా తెలంగాణ నుంచి స్నేహ ఒక్కరే పాల్గొన్నారు. అన్ని రౌండ్లలో సత్తా చాటి మిసెస్ ఇండి యా బ్యూటీక్వీన్ 2017 కిరీటాన్ని సొంతం చేసుకుంది.

Pages