S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/08/2017 - 01:22

హైదరాబాద్, సెప్టెంబర్ 7: వెనుకబడిన వర్గాలు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రధాని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సామాజిక, న్యాయ, సాధికారత సహాయ మంత్రి రాందాస్ అథావాలే పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడిన ఆయన కులరహిత సమాజం ఏర్పడే దిశగా, కులాంతర వివాహాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

09/08/2017 - 01:18

హైదరాబాద్, సెప్టెంబర్ 7: కొత్త సచివాలయ నిర్మాణం రాజకీయ దుమారం రేపుతోంది. ప్రస్తుత సచివాలయాన్ని అన్ని వసతులతో బైసన్ గ్రౌండ్స్‌కు తరలించేందుకు ప్రభుత్వం దాదాపుగా నిర్ణయానికి వచ్చేసిన నేపథ్యంలో రగులుకున్న ఈ వివాదం రోజురోజుకూ తీవ్రమవుతోంది. మంత్రులకు వసతులు, పాలనా పరమైన అవసరాలు తీర్చడంతో పాటు కొత్త సచివాలయం ఆర్థిక భారం కూడా మరింత తగ్గుతుందన్న వాదన ప్రభుత్వానిదైతే..

09/08/2017 - 01:38

అమరావతి, సెప్టెంబర్ 7: నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుకు టిటిడి బోర్డు చైర్మన్ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. యాదవ సామాజికవర్గానికి చెందిన మస్తాన్ రావు పార్టీ అధినేతకు విధేయుడు.

09/08/2017 - 01:07

విశాఖపట్నం, సెప్టెంబర్ 7: గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి), విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు శుభవార్త! ఇప్పటి వరకూ ఆయా మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయం నుంచే ఉద్యోగులు జీతాలు తీసుకునేవారు. కానీ త్వరలోనే వీరికి ట్రెజరీ నుంచి జీతాలు అందే అవకాశం ఉందని జివిఎంసి వర్గాలు తెలియచేస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల ఉద్యోగులకు జీతాలు ట్రెజరీ నుంచి చెల్లిస్తున్నారు.

09/08/2017 - 01:06

నూజివీడు/రెడ్డిగూడెం, సెప్టెంబర్ 7: జలమే జీవనాధారమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గోదావరి నదిలో వృథాగా పోతున్న జలాలను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించి రాష్ట్భ్రావృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ గ్రామం వద్ద చింతలపూడి ఎత్తిపోతల విస్తరణ పథకం పైలాన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఆవిష్కరించారు.

09/08/2017 - 00:12

విజయవాడ (రైల్వేస్టేషన్), సెప్టెంబర్ 7: రానున్న దసరా, దీపావళి పండుగల దృష్ట్యా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కాచిగూడ - టాటానగర్ - కాచిగూడ మధ్య 18 ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసరు యు.ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

09/08/2017 - 02:06

రేణిగుంట, సెప్టెంబర్ 7: రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునీకరణకు కేంద్ర విమానయాన శాఖ ఎఎఐ రూ.177.10 కోట్ల నిధుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేణిగుంట విమానాశ్రయానికి 2008లో అంతర్జాతీయ విమానాశ్రయ హోదా కల్పించి ఉండగా రన్‌వే చిన్నదిగా ఉండటం వలన పెద్ద విమానాల సర్వీసులు ఇంతవరకు ప్రారంభం కాలేదు.

09/07/2017 - 22:57

హైదరాబాద్, సెప్టెంబర్ 7: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్, సికిందరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్లలోని రైళ్లలో నీళ్లు కరువయ్యాయి. రైల్వే స్టేషన్లలో ఉన్న కుళాయిలు పనిచేయడం లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులెదుర్కొనవలసి వస్తోంది.

09/07/2017 - 22:54

హైదరాబాద్, సెప్టెంబర్ 7: సంచలనం సృష్టించిన ఫార్మశీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసును పున:విచారణ చేసేందుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఎపి ప్రభుత్వం గురువారం హైకోర్టును అభ్యర్థించింది. ఈ మేరకు ఎపి హోంశాఖ ముఖ్య కార్యదర్శి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.

09/07/2017 - 22:51

హైదరాబాద్, సెప్టెంబర్ 7: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను ఎపి శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ గురువారం కలిశారు. నరసింహన్ కాలుకు చిన్న శస్త్ర చికిత్స జరగడంతో మర్యాద పూర్వకంగా కోడెల కలిశారని అధికార వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఎపి ప్రజలంతా కోరుతున్నారని ఈ సందర్భంగా కోడెల పేర్కొన్నారు.

Pages