S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/13/2018 - 03:07

ఖమ్మం, నవంబర్ 12: మహాకూటమికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి టీఆర్‌ఎస్ నేతల్లో గుబులు మొదలైందని, దానిని తట్టుకోలేక కూటమిపై విమర్శలు గుప్పిస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ విజయశాంతి పేర్కొన్నారు.

11/13/2018 - 01:47

నల్లగొండ, నవంబర్ 12: ఒకసారి రద్ద.. తిరిగి పునరుద్ధరించబడిన హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రత్యేకతను సంతరించుకుంది. 1952 నుండి 72 వరకు కొనసాగిన నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియలో భాగంగా రద్దయ్యంది. 1978నుండి కోదాడ నియోజకవర్గంలో భాగమైన హుజూర్‌నగర్ తిరిగి 2009 నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా పునరుద్ధరించబడింది.

11/13/2018 - 01:46

నిజామాబాద్, నవంబర్ 12: ఎన్నికల బరిలోకి దిగి తమ అదృష్ఠాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ ఆశావహులు ఎలాగైనా టిక్కెట్ దక్కించుకుకోవాలనే ఆరాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే తొలి జాబితా సిద్ధమైనట్టు అధిష్ఠానం ప్రకటించిన నేపథ్యంలో, ఆ జాబితాలోనే తమ పేరును చేర్చాల్సిందిగా ముఖ్య నేతలపై ఒత్తిడి పెంచుతున్నారు.

11/13/2018 - 01:41

సార్.. ఇది ఒక్కోరోజుకు ఫిక్స్ చేయమంటున్నారు అభ్యర్థులు

11/13/2018 - 01:32

రాజమహేంద్రవరం, నవంబర్ 12: కార్తీక మాసం తొలి సోమవారం ఉభయ గోదావరి జిల్లాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసం, అందులోనూ శివుని ప్రీతిపాత్రమైన సోమవారం కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలను సందర్శించారు. సోమవారం వేకువజాము నుండే రెండు జిల్లాలోని గోదావరి తీరాలు పుణ్యస్నానాలు చేసి, దీపాలు వదిలే భక్తులతో సందడి సందడిగా మారాయి.

11/13/2018 - 01:27

విజయవాడ, నవంబర్ 12: రాష్ట్రంలో తొలిసారిగా 12 కులాలకు ఫెడరేషన్లను ఏర్పాటు చేసి వాటికి పాలకవర్గాలను నియమించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందంటూ స్థానిక మున్సిపల్ స్టేడియంలో సోమవారం జరిగిన ‘పేదరికంపై గెలుపు’ సభలో వివిధ ఫెడరేషన్ల చైర్మన్‌లు ప్రశంసలతో ముంచెత్తారు.

11/13/2018 - 01:26

అమరావతి, నవంబర్ 12: రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారుల అభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళిక రూపొందించి అమలుచేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి (సీఎస్) అనిల్‌చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో జాతీయ, రాష్ట్ర రహదార్ల విస్తరణ, మరమ్మతులు తదితర అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నెలాఖరులోగా రహదార్లపై ఉన్న గోతులను పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

11/13/2018 - 01:25

భద్రాచలం టౌన్, నవంబర్ 12: కాంగ్రెస్ పాలనలో తెలంగాణ భ్రష్టు పట్టిందని, అటువంటి పార్టీతో సీపీఐ జత కట్టడం దురదృష్టకరమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. భద్రాచలంలో బీఎల్‌ఎఫ్ బలపర్చిన సీపీఎం అభ్యర్థి మిడియం బాబూరావు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కార్యకర్తలతో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

11/13/2018 - 01:25

సంగారెడ్డి, నవంబర్ 12: గెలుపు ధీమాతో ప్రచారపర్వం కొనసాగిస్తున్న అధికార టీఆర్‌ఎస్‌ను రైతుల నేస్తంగా వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న తుమ్మలపల్లి ఫృథ్వీరాజ్ వణుకు పుట్టించే విధంగా రైతుల సమీకరణలో నిమగ్నమయ్యాడు. సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలోని కొండాపూర్, సదాశివపేట, కంది, సంగారెడ్డి మండలాల్లోని వివిధ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ నామినేషన్ దాఖలకు సిద్ధమవుతున్నాడు.

11/13/2018 - 01:16

హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణ శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే తొమ్మిది మంది బీజేపీ అభ్యర్ధులు తమ నామినేషన్లను దాఖలు చేశారు.

Pages