S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/19/2017 - 02:14

విజయవాడ, జూన్ 18: విద్యుత్ చార్జీలు తగ్గించి చరిత్ర సృష్టిద్దామని సిఎం చంద్రబాబు సూచించారు. ఆదివారం ఉదయం విద్యుత్ మంత్రి కళావెంకట్రావు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అత్యాధునిక సాంకేతిక విధానాలతో కూడిన పాలనా సంస్కరణలు అవసరమని, అవి ప్రజలందరికీ అందాలన్నారు.

06/19/2017 - 02:14

విజయవాడ (క్రైం), జూన్ 18: రాష్టవ్య్రాప్తంగా సంచలనం కలిగిస్తున్న విశాఖ భూవివాదంపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. డిఐజి స్థాయి అధికారి నేతృత్వంలో నలుగురు అధికారులతో కూడిన బృందం రంగంలోకి దిగినట్లు డిజిపి నండూరి సాంబశివరావు వెల్లడించారు. ఈ వ్యవహారంలో సుమారు 270 ఎకరాల భూమికి సంబంధించి 25 రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని తెలిపారు.

06/19/2017 - 02:11

విశాఖపట్నం, జూన్ 18: రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన విశాఖ భూ కుంభకోణాన్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

06/19/2017 - 02:15

హైదరాబాద్, జూన్ 18: హైకోర్టు విభజన అంశం కేంద్రం పరిథి నుంచి కోర్టులోకి వెళ్లిందని కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి పిపి చౌదరి అన్నారు. హైకోర్టుకు త్వరలో ఆరుగురు న్యాయమూర్తులను నియమించనున్నట్టు చెప్పారు. తెలంగాణ బిజెపి న్యాయవాదుల విభాగం ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి కేంద్ర మంత్రి పిపి చౌదరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

06/19/2017 - 01:36

విజయవాడ (క్రైం), జూన్ 18: రాష్ట్రంలో దాదాపు 38మంది డిఎస్పీలు విఆర్‌లో మగ్గుతున్నారు. ఏడాదికి పైగా పోస్టింగ్ లేక కాలం వెల్లదీస్తూ వీరిలో చాలామంది దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారు. కొందరైతే అసలు తాము ప్రభుత్వ ఉద్యోగులమనే విషయమే మరిచిపోయారు. శాపమో, వీరు చేసుకున్న పాపమో తెలీదుగాని, గతంలో ఏ ప్రభుత్వ హాయాంలోనూ ఇంతమంది పోలీసు అధికారులు విఆర్‌లో ఉన్న దాఖలాలు వు.

06/19/2017 - 02:39

హైదరాబాద్, జూన్ 18: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఈ నెల 24, 25 తేదీ ల్లో ‘అంతర్జాతీయ హిందూ ధార్మిక సమ్మేళనం’ జరగనున్నది.

06/19/2017 - 02:40

హైదరాబాద్, జూన్ 18:ఆంధ్రప్రదేశ్ వైఖరి వల్లనే హైకోర్టు విభజన ఆలస్యం అవుతోందని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. రెండు రాష్ట్రాలు ఏర్పడి మూడేళ్లు గడిచి పోయాయి, ఇంకా ఉమ్మడి హైకోర్టు కొనసాగుతోందని, వెంటనే హైకోర్టును విభజించాలని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పిపి చౌదరిని కోరారు. హరిత ప్లాజాలో కేంద్ర మంత్రిని ఇంద్రకరణ్‌రెడ్డి ఆదివారం కలిశారు.

06/19/2017 - 01:29

కర్నూలు, జూన్ 18: కర్నూలు నుంచి విమానంలో ప్రయాణించాలన్న ప్రజల చిరకాల కోరిక మరో 10 నెలల్లో తీరబోతోంది. ఈ నెల 21న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓర్వకల్లు సమీపంలో విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ వెంటనే పనులు ప్రారంభించి వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విమానాల రాకపోకలను ప్రారంభిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

06/19/2017 - 01:02

హైదరాబాద్, జూన్ 18: సమ్మె ప్రారంభమైన తర్వాత నాలుగవ రోజు 77 శాతం మంది కార్మికులు విధులకు హాజరయ్యారని సింగరేణి యాజమాన్యం తెలిపింది. ప్రారంభమైన తొలిరోజుతో పోలిస్తే 45 శాతం అధికంగా కార్మికులు విధులకు హాజరయ్యారని స్పష్టం చేసింది. విద్యుదుత్పత్తి సంస్థలకు రోజూ కన్నా సమ్మె కాలంలోనే అధికంగా బొగ్గు సరఫరా చేశామని తెలిపింది.

06/18/2017 - 03:49

సూళ్లూరుపేట, జూన్ 17: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జిఎస్‌ఎల్‌వి మార్క్ 3 వంటి భారీ ప్రయోగం చేపట్టి 20రోజుల కాకముందే మరో ప్రతిష్ఠాత్మకత ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అది ఒకటి కాదు రెండు కాదు మరోసారి ఏకంగా 34 ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Pages