S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/15/2017 - 02:14

హైదరాబాద్, జూన్ 14: కర్నూలు జిల్లా నంద్యాల రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారనున్నాయి. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో మరోసారి భూమా, శిల్పా కుటుంబాలు తలపడనున్నాయి. 2014 ఎన్నికల అనంతర పరిణామాల్లో భూమానాగిరెడ్డి కుటుంబం వై ఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశంలో చేరినప్పుడు శిల్పా కుటుంబంతో మొదలైన ఘర్షణ, భూమానాగిరెడ్డి మరణానంతరం జరగనున్న నంద్యాల ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక వ్యవహారంలో పతాకస్థాయికి చేరుకుంది.

06/15/2017 - 02:09

విశాఖపట్నం, జూన్ 14: విశాఖ భూముల కుంభకోణం మంత్రుల మధ్య చిచ్చు రగిల్చింది. ఈ స్కాంతో ప్రభుత్వం, పార్టీ పరువు మంట కలిసింది. బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోయింది. కనీసం సిఐడి విచారణకు కూడా ప్రభుత్వం సాహసించకపోవడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారం విపక్షాలకు అందివచ్చిన అస్త్రంగా పనికివస్తోంది.

06/15/2017 - 02:07

గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి!

06/14/2017 - 04:08

హైదరాబాద్/అల్వాల్, జూన్ 13: హైదరాబాద్‌లోని మియాపూర్ భూకుంభకోణం కేసులో జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కూకట్‌పల్లి సబ్ జిరిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావు ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ మంగళవారం దాడులు నిర్వహించింది. బోయిన్‌పల్లిలోని శ్రీనివాసరావు నివాసంలో అతని బంధువులు, బినామీ పేర్లపై ఉన్న పలు ఆస్తులకు సంబంధించి దస్తావేజులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

06/14/2017 - 03:11

హైదరాబాద్, జూన్ 13: రైతులకు వ్యవసాయ రుణ మాఫీ వివరాలు అందజేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను హైదరాబాద్ హైకోర్టు ఆదేశించింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం శాఖమూరు గ్రామానికి చెందిన కొల్లి శివరామరెడ్డి అనే రైతు, నల్లగొండ జిల్లాకు చెందిన వ్యవసాయ జన చైతన్య సమితికి చందిన డి.నర్సింహారెడ్డి రుణమాఫీపై వేరు వేరుగా హైకోర్టులో ఈ అంశంపై పిటిషన్ దాఖలు చేశారు.

06/14/2017 - 01:53

హైదరాబాద్, జూన్ 13: రాజధానిలోని మియాపూర్, బాలానగర్, ఇబ్రహీంపట్నం, శంషాబాద్ తదితర ప్రాంతాలలో జాగీరు భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కుంభకోణం జరగనేలేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇందులో ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా నష్టం జరుగలేదని, ఆ భూములన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయని, సిబిఐ విచారణ అవసరం లేదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.

06/14/2017 - 01:51

హైదరాబాద్, జూన్ 13: జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, దివంగత ప్రముఖ కవి డాక్టర్ సి నారాయణరెడ్డి స్మారకార్థం హైదరాబాద్ నగర నడిబొడ్డున ఆయన పేరిట సమావేశ మందిరం నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అలాగే ట్యాంక్ బండ్, కరీంనగర్ పట్టణం, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. సినారె పేరు చిరస్థాయిగా నిలిచేందుకు ఓ ప్రముఖ సంస్థకు ఆయన పేరు పెడుతామన్నారు.

06/14/2017 - 01:43

విజయవాడ, జూన్ 13: రాష్ట్రానికి కొత్తగా మరో ఆరు మెగా ప్రాజెక్ట్‌లు రానున్నాయి. ఈ ఆరు మెగా ప్రాజెక్టులకు సంబంధించిన రూ.3,808కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలను ఎస్‌ఐపిబి ఆమోదించింది. ఈ ఆరు మెగా ప్రాజెక్టులతో రాష్ట్రానికి మరో 5,325ఉద్యోగాలు దక్కనున్నాయి.

06/14/2017 - 01:40

హైదరాబాద్/విజయవాడ, జూన్ 13: అరుణాచల్‌ప్రదేశ్ ప్రైవేట్ ట్రావెల్స్ అనుమతులు రద్దయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 900 బస్సు లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. ఈ బస్సులను సీజ్ చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రభుత్వాలు మంగళవారం ఆదేశాలు జారీ చేశాయి.

06/14/2017 - 01:38

హైదరాబాద్, జూన్ 13: తెలుగు జాతి అత్యున్నత సాహితీవేత్త డాక్టర్ సి నారాయణ రెడ్డిని కోల్పోయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబునాయుడు సినారె భౌతికకాయానికి నివాళులు అర్పించారు. దేశంలో సినారెకు ఒక ప్రత్యేకత ఉందని, ఆయనతో తనకు సుదీర్ఘ పరిచయం ఉందని పేర్కొన్నారు.

Pages