S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/13/2017 - 01:42

సాహితీరంగానికి సినారె చేసిన సేవ ఎంత చెప్పుకున్నా తరగదు. చలన చిత్ర రంగానికి ఆయన ఆణిముత్యాలు అందించారు. రచయితగా, రాజ్యసభ సభ్యుడిగా ఆయన సేవలు చరిత్రలో నిలిచిపోతాయి.
-సిఎం చంద్రబాబు

06/13/2017 - 01:40

సినారె మృతి సాహితీప్రపంచానికి తీరని లోటు. ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి
తెలుపుతున్నాను
-ప్రధాని నరేంద్రమోదీ

06/13/2017 - 03:27

కలంతో సేద్యం చేసి అక్షర పంట పండించిన మట్టి మనిషి మాయమయ్యాడు. దశాబ్దాలపాటు తెలుగు సాహితీ, సినీ రంగాలను తనదైన శైలితో ప్రభావితం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి తన ప్రస్థానాన్ని ముగించాడు. విశ్వంభరుడు, పద్మభూషణ్, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి (86) సోమవారం కన్నుమూశారు. ఊపిరితిత్తులు, శ్వాసకోశ సమస్యలతో కొంతకాలంగా కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

06/13/2017 - 00:09

హైదరాబాద్, జూన్ 12: తెలుగు సాహితీ, సినీ లోకం మూగవోయింది. ఓ మహాస్రష్టను కోల్పోయింది. దశాబ్దాల పాటు తెలుగు సాహితీ, సినీ రంగాలను తనదైన విశిష్టతతో ప్రభావితం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, విశ్వంభరుడు పద్మభూషణ్, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి(86) సోమవారం ఉదయం కన్నుమూశారు.

06/12/2017 - 02:55

విశాఖపట్నం, జూన్ 11: ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనే కాశ్మీర్ సమస్యకు సరైన పరిష్కారం లభిస్తుందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా (మోదీ ఫెస్ట్) పేరిట ఎన్‌డిఎ ప్రభుత్వ మూడేళ్ల పాలనపై రూపొందించిన డాక్యుమెంట్‌ను విశాఖలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన వివరించారు.

06/12/2017 - 02:50

విశాఖపట్నం, జూన్ 11: దేశ క్షేమం కోసం సద్గురు శివానందమూర్తి పరితపించేవారని ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ అన్నారు. శివానందమూర్తి రెండవ వర్ధంతి సందర్భంగా ఆంధ్రాయూనివర్శిటీ ప్లాటినం జూబ్లీహాల్‌లో శివానంద సుపథ ఫౌండేషన్ ఆధ్వర్యలో ఆదివారం జరిగిన సదస్సులో ‘మన దేశం కోసం సద్గురు దార్శనికత’ అన్న అంశంపై ఎంవిఆర్ శాస్ర్తీ మాట్లాడారు.

06/12/2017 - 02:46

హైదరాబాద్, జూన్ 11: భూ కుంభకోణంలో టిఆర్‌ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు పేరును ప్రభుత్వమే ‘లీక్’ చేసిందని టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు భూ కుంభకోణంలో ఉన్నారని ఆయన ఆరోపించారు. టి.జెఎసి విస్తృత స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం ఆదివారం రంగారెడ్డి జిల్లాలోని తుర్కయాంజల్‌లో ఓ కనె్వన్షన్ సెంటర్‌లో జరిగింది.

06/12/2017 - 02:27

హైదరాబాద్, జూన్ 11: తెలుగు చిత్ర సీమకు దాసరి నారాయణ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. చిత్ర రంగానికి ఆయన లేని లోటు భర్తీ చేయలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన జగన్ ఆదివారం నాడిక్కడ ఇమేజ్ గార్డెన్స్‌లో జరిగిన దాసరి సంస్మరణ సభలో పాల్గొని దాసరి విగ్రహం వద్ద నివాళులర్పించారు.

06/12/2017 - 02:18

హైదరాబాద్, జూన్ 11: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమవుతున్న మెడికల్ కాలేజీలు సెమీ అటానమస్ దిశలో వెళుతున్నాయి. దీనిపై విద్యార్థిలోకంతో పాటు, బోధన, బోధనేతర సిబ్బంది నుండి వ్యతిరేకత కూడా వస్తోంది. ప్రస్తు తం రాష్ట్రంలో ఉస్మానియా మెడికల్ కాలేజీ (హైదరాబాద్), గాంధీ మెడికల్ కాలేజీ (హైదరాబాద్), కాకతీయ మెడికల్ కాలేజీ (వరంగల్), నిజామాబాద్ మెడికల్ కాలేజీ ప్రభుత్వ అధీనంలో నడుస్తున్నాయి.

06/12/2017 - 01:45

హైదరాబాద్, జూన్ 11: ఎన్నికల ప్రణాళిక హామీ మేరకు పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసి మాట నిలబెట్టుకున్నప్పటికీ వాటిని రైతులకు చెల్లించడంలో బ్యాంకర్లు, వ్యవసాయశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో రైతన్న దిగాలుపడిపోయాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటూ రైతులంతా పొలోమని వెళ్లి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును కలిసి కృతజ్ఞతలు చెప్పటమే కాకుండా ఆయన చిత్రపటానికి నెలన్నర కిందటనే క్షీరాభిషేకమూ చేశారు.

Pages