S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/01/2017 - 04:46

ఫస్ట్ ర్యాంకర్‌గా కర్నాటకవాసి నందిని టాప్ 10లో ఇద్దరు తెలుగు అభ్యర్థులుఆంధ్రభూమి బ్యూరో

05/31/2017 - 09:03

హైదరాబాద్, మే 30: ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు (75) కన్నుమూశారు. వారం రోజులుగా కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం రాత్రి 7 గంటలకు తుది శ్వాస విడిచారు.

05/31/2017 - 08:36

విజయవాడ, మే 30: జిఎస్టీ చట్టంలో అధిక మొత్తాల్లో విధించిన పన్నులకు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల హోటళ్ల యజమానుల సంఘం పిలుపుమేరకు మంగళవారం రాష్ట్రంలోని హోటళ్లన్నీ మూసివేశారు. ఇదేసమయంలో ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలను నిషేధించాలనే డిమాండ్‌పై జాతీయ కమిటీ పిలుపుమేరకు ఎపి రిటైల్ కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మందుల దుకాణాలన్నీ మూతపడ్డాయి.

05/31/2017 - 08:34

విజయవాడ, మే 30: ఒకప్పుడు కోస్తా తీరంలో ఊరూవాడా విస్తరించిన బౌద్ధం, త్రిశరణాలతో మారుమోగింది. ఇప్పటిదాకా తీరాంధ్రలోని 13 జిల్లాల్లో దాదాపు 250కి పైగా బౌద్ధక్షేత్రాలు ఒయల్పడిన సంగతి తెలిసిందే. అడపాదడపా అక్కడో, ఇక్కడో ఒక్కోచోట బౌద్ధ ఆనవాళ్లు బయల్పడుతూనే ఉన్నాయి. రాయలసీమలో కూడా ఒక్కో బౌద్ధక్షేత్రం బయపడుతూనే ఉంది.

05/30/2017 - 07:51

హైదరాబాద్, మే 29: సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌లో నిధులే కాకుండా కొత్త సంక్షేమ పథకాలను అమలు చేసింది. మూడేళ్ల తెరాస ప్రభుత్వం 365 పథకాలను ప్రవేశపెట్టి, దానిలో సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ప్రగతి నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది.

05/29/2017 - 01:36

హైదరాబాద్, మే 28: ఉభయ తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు వచ్చేకంటే ముందు కురిసే వర్షాలు (ముందస్తు వర్షాలు) ప్రారంభమయ్యా యి. ఒకవైపు ఈ నెల 25 న రోహిణి కార్తె ప్రారంభం కావడంతో ఎండలు మండుతుండగానే మరోవైపు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతా ల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.

05/28/2017 - 06:05

హైదరాబాద్, మే 27: ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ ఎస్.శోభారాణిని ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయాలని హైదరాబాద్ హైకోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించింది భార్యా, భర్తలనువిడదీసేందుకు కాదని హైకోర్టు అభిప్రాయపడింది. జోన్-4లోని కర్నూలులో 1992 సంవత్సరం జూలై 20న డాక్టర్ ఎస్. శోభారాణి లెక్చరర్‌గా నియమితులయ్యారు.

05/28/2017 - 06:00

వికారాబాద్, మే 27: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, పొత్తుపై అందరి సమక్షంలో కేంద్రంలో నిర్ణయం తీసుకుంటారని మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. శనివారం స్థానిక గౌలికర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

05/27/2017 - 07:38

తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం గాలివాన బీభత్సం సృష్టించింది. రెండు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో విరుచుకు పడిన గాలివాన విధ్వంసం సృష్టించింది. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. గుడిసెలు, రేకుల షెడ్లు ధ్వంసమయ్యాయి. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో మిద్దెకూలి తల్లీకూతురు మృతి చెందారు. ఏడుగురు గాయపడ్డారు.

05/26/2017 - 08:36

తిరుపతి, మే 25: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. గురువారం కొండపై ఎటు చూసినా శ్రీవారి భక్తులతో నిండిపోయింది. శ్రీవారి సర్వదర్శనానికి వెళ్ళే భక్తులకు 12 గంటలు, కాలినడకన తిరుమలకు చేరుకుని దివ్యదర్శనానికి వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. కాగా శ్రీవారికి భక్తులు హండీలో సమర్పించిన కానుకలు ద్వారా రూ. 2.44 కోట్లు ఆదాయం లభించింది.

Pages