S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/13/2016 - 01:37

హైదరాబాద్, సెప్టెంబర్ 12: అమరావతి నిర్మాణంలో అక్రమాలకు తావులేని రీతిలో పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ నరసింహన్‌కు వివరించారు. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ఇరువురి మధ్య దాదాపు గంటకుపైగా సంభాషణ సాగింది.

09/13/2016 - 01:39

గుత్తి, సెప్టెంబర్ 12: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో కండక్టర్ పోస్టుల నియామకానికి మంగళం పాడనున్నట్టు తెలిసింది. ఈమేరకు చర్యలకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. కర్నాటక తరహాలో డ్రైవర్లతోనే సర్వీసులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇదే జరిగితే రాష్ట్రంలో దాదాపు 30వేల కండక్టర్ పోస్టుల నియమకాలు నిలిచిపోనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

09/12/2016 - 06:53

హైదరాబాద్, సెప్టెంబర్ 11: తెలంగాణ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఎంసెట్ 3 ప్రవేశ పరీక్ష రెండు రాష్ట్రాల్లోనూ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. రెండు రాష్ట్రాల్లో 66.25 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎంసెట్ పేపర్ లీకేజీతో ఎంసెట్ 3 పరీక్ష నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 91 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.

09/12/2016 - 06:51

హైదరాబాద్, సెప్టెంబర్ 11: అడవులను రక్షించుకోవడానికి, చెట్లను పెంచడానికి, వన్య ప్రాణులను కాపాడుకోవడానికి కంకణ బద్దులై పనిచేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 11న నిర్వహించిన అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిఎం తన సందేశాన్ని విడుదల చేశారు.

09/12/2016 - 06:49

కలిసొచ్చిన వానలు, సర్కారు ప్రకటనలు.. వెరసి ఈ ఖరీఫ్‌తో నిరుటి కరవు కష్టాల నుంచి గట్టెక్కేస్తామని ఆశించిన రైతుకు అడియాసలే మిగిలాయ. మూడో విడత రుణ మాఫీ బ్యాంకు ఖాతాల్లో జమ అయతే, ఖరీఫ్‌కు పెట్టుబడి కష్టం లేకుండా పోతుందని ఆశించిన రైతు చివరకు భంగపడ్డాడు. బడ్జెట్‌లో నిధులు కేటాయంచినా బ్యాంకులకు మూడో విడత మాఫీ మొత్తాన్ని సర్కారు జమ చేయకపోవడంతో, రైతుకు పంట రుణాలు అందకుండాపోయాయ.

09/12/2016 - 06:41

విజయవాడ, సెప్టెంబర్ 11: అంతర్ రాష్ట్ర జల వివాదం.. ప్రకృతి శాపం.. రాజకీయ ప్రయోజనాలు... నాగార్జునసాగర్ ఆయకట్టుకు శాపంగా పరిణమించాయి. పదకొండు లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే కుడికాలువ ఎండిపోయింది. ఇది తాజా పరిణామం కాదు...గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి. పదిహేనేళ్లనాటి దుర్భిక్ష పరిస్థితులు మళ్లీ నెలకొన్నాయి.

09/12/2016 - 05:16

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ఐదు కోట్ల ఆంధ్రుల ఆశల సౌధం అమరావతి నిర్మాణంపై తలెత్తిన స్విస్ చాలెంజ్ విధాన వివాదంపై హైకోర్టు సోమవారం తీర్పు ఇవ్వనుంది. తీర్పు అనుకూలంగా వస్తే రాజధాని నిర్మాణంపై రాష్ట్రప్రభుత్వం చకాచకా ముందుకు వెళుతుంది. ఒకవేళ ప్రతికూలంగా వస్తే మాత్రం ఇంతవరకు చేసిన కసరత్తుకు విలువలేకుండాపోతుంది.

09/12/2016 - 01:34

హోదా కావాలా? అభివృద్ధి కావాలా? విదేశీ రుణాన్ని కేంద్రమే భరిస్తుంది
2.25 లక్షల కోట్లతో ప్రాజెక్టులు వస్తున్నాయి చట్టం తెలిసిన వారితో హోదాపై చర్చకు సిద్ధం
విలేఖరుల సమావేశంలో కేంద్ర మంత్రి సవాల్

09/11/2016 - 04:54

ఇల్లెందు, సెప్టెంబర్ 10: ఖమ్మం జిల్లా గుండాల మండలం బాసన్న నగర్ గ్రామంలో శనివారం న్యూడెమోక్రసీ పార్టీ అజ్ఞాత దళ కమాండర్ గణేష్ అలియాస్ కొడెం వెంకటేశ్వర్లును పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. గత పదేళ్ళుగా అజ్ఞాత జీవితం గడుపుతున్న గణేష్ అనారోగ్య కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలో సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

09/11/2016 - 03:35

పరవాడ (విశాఖ), సెప్టెంబర్ 10: విశాఖ జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం మత్స్యకారుల వలకు అరుదైన సముద్రపు తాబేలు శనివారం చిక్కింది. సుమారు 200 కిలోల బరువున్న ఈ తాబేలును గతంలో ఎన్నడూ చూడలేదని మత్స్యకారులు చెబుతున్నారు.

Pages