S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/11/2017 - 01:40

హైదరాబాద్, మే 10: ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖా మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ బుధవారం తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లోని 9వ మెట్రో పిల్లర్‌ను వేగంగా కారుతో ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. కారులో ప్రయాణిస్తున్న నిషిత్‌తోపాటు అతని స్నేహితుడు రాజా రవివర్మ సైతం అక్కడికక్కడే మృతిచెందారు.

05/11/2017 - 01:02

హైదరాబాద్, మే 10: దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్ యుజి కోర్సుల్లో చేరేందుకు గత ఆదివారం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-2017) తీరుపై ఫిర్యాదులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నీట్ పరీక్షను 10 భాషల్లో నిర్వహించారు.

05/10/2017 - 06:52

హైదరాబాద్, మే 9: ఉభయ తెలుగు రాష్ట్రాలను ఉన్నట్టుండి గాలివాన ఒక్కసారిగా కుదిపేసింది. మంగళవారం అర్ధరాత్రి రెండు రాష్ట్రాల రాజధానులతో సహా పలు నగరాల్లో భారీగా వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి తోడు గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి.

05/10/2017 - 06:49

హైదరాబాద్, మే 9:రాష్ట్రంలో కొత్త పారిశ్రామికవాడల ఏర్పాటు, విస్తరణకు 1059.31 ఎకరాలు అవసరమని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టిఎస్‌ఐఐసి) పాలకమండలి ప్రభుత్వాన్ని కోరింది. భూ సేకరణకు తమ సంస్థకు అనుమతి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. పరిశ్రమ భవన్‌లో టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు అధ్యక్షతన మంగళవారం పాలకమండలి సమావేశం జరిగింది.

05/10/2017 - 06:47

హైదరాబాద్, మే 9: పెద్దనోట్ల రద్దు తర్వాత తగ్గిన ఆదాయాన్ని పూడ్చుకోవడానికి వినియోగదారులపై రవాణాశాఖ యూజర్ చార్జీలను భారీగా పెంచింది. వివిధ సేవల కింద వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న అన్ని యూజర్ చార్జీలను దాదాపు రెట్టింపు చేసింది. పెంచిన యూజర్ చార్జీలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంతో రెండు మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి.

05/10/2017 - 06:34

రాజమహేంద్రవరం, మే 9: తూర్పు కనుమల్లో అరుదైన జీవజాతులు బయటపడింది. జీవ వైవిధ్యానికి ఆలవాలమైన పాపికొండల జాతీయ పార్కులో వన్య ప్రాణులను సంరక్షించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. అరుదైన జీవవైవిధ్యం కలిగిన పాపికొండలు ప్రాంత అడవుల్లో కొత్తగా నాలుగు విశిష్టమైన వన్యప్రాణులను గుర్తించారు.

05/10/2017 - 06:28

విజయవాడ, మే 9: సమాజం భవితను నిర్ణయించేది విద్య మాత్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ డీన్ లాయిడ్ బీ మైనర్‌తో ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను స్టాన్‌ఫోర్డ్ కుటుంబ సభ్యుడినేనని, మొదటినుంచి తనకు స్టాన్‌ఫోర్డ్ అంటే ఆరాధనా భావం ఉండేదని తెలిపారు.

05/10/2017 - 06:21

అమరావతి, మే 9: అది పాలనకు కేంద్రమైన సచివాలయం. దాని సారథి అవినీతిని ఉక్కుపాదంతో అణచివేస్తానని తరచూ హెచ్చరిస్తుంటారు. కానీ ఆయన బ్లాకుకు కూతవేటు దూరంలోని అనేక బ్లాకులు బేరసారాలతో బిజీగా ఉంటాయి. వీటిపై కనే్నయాల్సిన నిఘా నేత్రం నిద్రపోయిన ఫలితంగా అధికారులు, ఉద్యోగులు అవినీతికి లంగరెత్తేశారు. మళ్లీ నిఘా గుర్తుకొచ్చి కొరడా ఝళిపించేసరికి రెండురోజుల క్రితమే ఒక చేప పట్టుపడింది.

05/10/2017 - 05:57

హైదరాబాద్, మే 9: రెండు రాష్ట్రాల్లో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో మంచి నీటి కోసం అల్లాడుతున్న మున్సిపాలిటీ, గ్రామ పంచాయితీ ప్రజలకు ఊరట కలిగించే విధంగా శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల ప్రారంభమైంది. శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తే తప్ప నాగార్జునసాగర్ నుంచి మంచినీటిని కుడి, ఎడమకాల్వలకు విడుదల చేసే అవకాశం లేని పరిస్థితులు నెలకొన్నాయి.

05/10/2017 - 05:56

హైదరాబాద్, మే 9: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలపై నలుగుతున్న ఎంట్రీ ఫీజు విధానం రద్దుపై బుధవారం రెండు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, కార్యదర్శుల సమావేశం విజయవాడలో జరుగుతుంది. ఈ సమావేశంలో సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేసే విషయమై ఉన్నతాధికారులు చర్చిస్తారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలు ఈ విషయమై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

Pages