S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/10/2017 - 01:26

హైదరాబాద్, మార్చి 9: ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం కారణంగా గురువారం జరిగిన తెలంగాణ శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గం పోలింగ్ రద్దయింది. బ్యాలెట్ పేపర్లో ఇద్దరు అభ్యర్థుల ఫొటోలు తారుమారు కావడంతో పోలింగ్‌ను రద్దు చేయక తప్పలేదు. అయితే పొరపాటును ఉదయం 9 గంటలకే గుర్తించినా, ఈ సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి చేరవేసి, అక్కడినుంచి ఎన్నిక రద్దు ఆదేశం వచ్చేసరికి పోలింగ్ తుది దశకు చేరింది.

03/10/2017 - 01:22

హైదరాబాద్, మార్చి 9: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రం ఏర్పడ్డాక శాసన సభలో బడ్జెట్ ప్రతిపాదనలు ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా పడ్డాక స్పీకర్ చాంబర్‌లో బిజినెస్ అడ్వయిజరీ (బిఎసి) సమావేశం జరుగుతుంది.

03/10/2017 - 01:34

హైదరాబాద్, మార్చి 9:‘అనేక రకాల సర్వేలు చేయించాను. వచ్చే ఎన్నికల్లో మనం ఘన విజయం సాధించబోతున్నట్టు అన్ని సర్వేలూ తేల్చిచెప్పాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 101 నుంచి 106 సీట్లలో విజయం సాధించబోతున్నట్టు తేలింది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత ఉంది’ అని ముఖ్యమంత్రి కెసిఆర్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో అన్నారు.

03/10/2017 - 01:17

హైదరాబాద్, మార్చి 9: రానున్న రోజుల్లో పదో తరగతి లోనే కాదు, ఐదు, ఎనిమిది తరగతుల్లోనూ విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షల్లో ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది. లేనిపక్షంలో మళ్లీ అదే తరగతి చదవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన చట్ట సవరణలకు కేంద్రం సిద్ధం అవుతోంది. నో డిటెన్షన్ పద్ధతి కొనసాగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఇటీవల కేంద్రం అన్ని రాష్ట్రాల విద్యాశాఖా మంత్రులతో సమావేశాలను నిర్వహించింది.

03/10/2017 - 01:14

హైదరాబాద్, మార్చి 9: ఆంధ్రప్రదేశ్‌లో ఐదు శాసనమండలి (పట్ట్భద్రులు, ఉపాధ్యాయ) నియోజకవర్గాలకు గురువారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉత్తరాంధ్రలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో పట్ట్భద్రుల నియోజకవర్గానికి జరిగిన 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. విజయనగరం, విశాఖపట్నంలో 71.1 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 73 శాతం పోలింగ్ నమోదైంది.

03/10/2017 - 01:12

దేవీపట్నం, మార్చి 9: తూర్పు గోదావరి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం నిబంధనలకు విరుద్ధంగా గోదావరిలో ఇసుక తవ్వేస్తున్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన దేవీపట్నం మండలం అంగళూరు గ్రామం నుండి కొత్తగా నిర్మించిన పునరావాస కాలనీ వరకు పొక్లెయినర్లతో ఇసుకను తవ్వి, టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు.

03/10/2017 - 01:10

విజయవాడ, మార్చి 9: తెలంగాణ, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి సకాలంలో సాగర్ జలాలు అందక కృష్ణా, ప.గో జిల్లాల్లో రెండు లక్షల ఎకరాల్లోని పత్తి, పొగాకు, మిర్చి, తదితర ఆరుతడి వాణిజ్య పంటలు ఎండుముఖం పడుతుండటంతో రైతాంగం కలవరం చెందుతున్నది. నాట్ల సమయంలో జనవరిలో అదీ కేవలం 10 రోజులపాటు 2.5 టిఎంసిల నీరు సరఫరా జరిగింది.

03/10/2017 - 01:07

విజయవాడ, మార్చి 9: అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబిసి) వారి సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు పరిశీలనలో ఉందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. నిరుద్యోగ భృతి చెల్లింపు విధానంపై అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన తన చాంబర్‌లో మీడియాతో గురువారం మాట్లాడారు. బిసిల్లో 132 కులాలు ఎక్కువగా లబ్ధి పొందాయని, కానీ చాలా కులాలు ఇంకా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు.

03/10/2017 - 00:26

గుంటూరు, మార్చి 9: గుంటూరు కేంద్రంగా కుట్టుశిక్షణ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అమాయకులను వంచిస్తున్న గ్లోబల్ గివింగ్స్ సంస్థ బోగస్ అని తేలింది.. గుంటూరు హిమనినగర్ ఒకటోలైన్‌లో సంస్థ గత ఏడాది క్రితం లావాదేవీలు ప్రారంభించింది..

03/09/2017 - 08:33

తిరుపతి : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. హనుమత్, సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడిగా శ్రీదేవి,్భదేవీ సమేత శ్రీమలయప్పస్వామి శ్రీవరా హ పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. ఈ ఉత్సవాలు ఐదురోజులపాటు జరుగుతాయి.

Pages