S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/11/2019 - 05:30

గజ్వేల్, ఫిబ్రవరి 10: శ్రీ పంచమి మహోత్సవం సందర్భంగా ఆదివారం సిద్దిపేట జిల్లాలోని సుప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యాధరి పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక వైభవం సంతరించుకుంది. అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం సందర్బంగా శ్రీ విద్యాధరి అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం, లక్షపుష్పార్చణ, చండీ హోమం, చప్పన్‌బోగ్ నివేదన, శ్రీ విద్యాజ్యోతి దివ్యదర్శనం తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి.

02/11/2019 - 05:28

యాదగిరి గుట్ట , ఫిబ్రవరి 10: రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్. నరసింహన్ దంపతులు ఆదివారం వసంత పంచమి సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులకు ఆలయ ఈవో ఎన్. గీత, అనువంశిక ధర్మకర్త బీ.

02/11/2019 - 05:28

విజయవాడ (ఇంద్రకీలాద్రి), ఫిబ్రవరి 10: శ్రీపంచమి సందర్భంగా నగరంలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి అలంకారంలో విద్యార్థులు, భక్తులకు దివ్య దర్శనమిచ్చింది. శ్రీపంచమి రోజు అమ్మవారి జన్మనక్షత్రం కావటంతో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ కనకదుర్గమ్మకు ఆదివారం అర్చకులు ఈ ప్రత్యేక అలంకారం చేశారు.

02/11/2019 - 05:25

విజయవాడ, ఫిబ్రవరి 10: గోబ్యాక్ మోదీ అంటూ చేసిన నినాదాలపై ప్రధాని మోదీ వక్రభాష్యాలు చెబుతున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. గుంటూరు సభలో ప్రధాని మోదీ చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. గోబ్యాక్ అంటే గోబ్యాక్ గుజరాత్ అని, ఆయన గోబ్యాక్ ఢిల్లీ అన్నట్లు వక్రభాష్యాలు చెబుతున్నారని విమర్శించారు.

02/11/2019 - 04:45

నంద్యాల, ఫిబ్రవరి 10 : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నంద్యాల మీదుగా రాజధాని అమరావతి వెళ్లే ప్యాసింజర్ రైళ్లన్నింటినీ రైల్వే శాఖ మరమ్మతుల పేరిట ఈ నెల 6 నుంచి 20వ తేదీ వరకూ ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా రద్దు చేసింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించలేక తమ ప్రయాణాలు వాయిదా వేసుకుంటూ దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

02/11/2019 - 04:54

గుంటూరు, ఫిబ్రవరి 10: ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యాన చేపట్టిన జాతీయ ప్రాజెక్టుకు రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు తీసుకురావడంతో పాటు మణిహారంగా మారనున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం గుంటూరులో ఏర్పాటు చేసిన ప్రజాచైతన్య సభకు హాజరైన ప్రధాని మోదీ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో వివిధ జాతీయ ప్రాజెక్టుల కార్యదర్శులు, యాజమాన్యాలతో సమావేశమయ్యారు.

02/11/2019 - 04:36

హైదరాబాద్, ఫిబ్రవరి 10: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫెడరల్ స్పూర్తికి భిన్నంగా వ్యవహారిస్తున్నారని బీజేపీ జాతీయ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు బండారు దత్తాత్రేయ విమర్శించారు.

02/11/2019 - 04:35

హైదరాబాద్, ఫిబ్రవరి 10: రోజూ తిరుమల-తిరుపతికి వచ్చే భక్తులతో రద్దీగా ఉన్న తిరుపతి రైల్వే స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో పాటు ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి దక్షిణ మధ్య రైల్వే నిధుల వర్షం కురిపిస్తోంది. నానాటికీ తిరుపతి స్టేషన్‌కు వస్తున్న ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరగడంతో వసతులు పెంచాల్సి వస్తోంది.

02/11/2019 - 03:46

విశాఖపట్నం, ఫిబ్రవరి 10: విశాఖ నగరంలో ఈనెల 17వ తేదీన టిఎస్సాఆర్, టీవీ-9 నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు.

02/11/2019 - 03:43

విశాఖపట్నం, ఫిబ్రవరి 10: దేశ ప్రధాని నరేంద్రమోదీ ఏమీ చేస్తున్నారో భగవంతుడికీ అర్ధం కావడం లేదని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. స్వగృహంలో ఆదివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయపార్టీలు కోరిన మీదటే ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విభజించిందన్నారు. రాష్ట్ర విభజనకు బీజేపీ తన పూర్తిమద్దతు ఇచ్చిందన్నారు.

Pages