S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/28/2017 - 20:54

హైదరాబాద్, జనవరి 27: దేశంలో ప్రసిద్ధి గాంచిన ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అమెరికా సొసైటీ ఆఫ్ కాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జరీ సంస్థ నెలకొల్పిన ఆప్తాల్మాలజీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సభ్యత్వం దక్కింది. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావు స్థాపించారు.

01/28/2017 - 02:46

హైదరాబాద్, జనవరి 27: నిర్లక్ష్యానికి గురవుతున్న మానసిక బుద్ధి మాంద్యులకు ప్రత్యేక షెల్టర్లు నిర్మించి వారి ఆలనాపాలనా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని హైకోర్టు పేర్కొంది. జైళ్లలో బాలనేరస్థులు, మహిళా ఖైదీలు, వారి పిల్లలు, బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న విచారణ ఖైదీలకు కల్పిస్తున్న సదుపాయాలపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

01/28/2017 - 03:05

విశాఖపట్నం, జనవరి 27: ఆంధ్రప్రదేశ్ అంటే కేంద్రానికి ప్రత్యేకమైన అభిమానం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. రెండు రోజులపాటు విశాఖలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ప్రారంభోత్సవ సభలో మంత్రి జైట్లీ మాట్లాడుతూ ఏపితో కేంద్రానికి ప్రత్యేక అనుబంధం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని అన్నారు.

01/28/2017 - 02:32

భద్రాచలం, జనవరి 27: దండకారణ్యంలో 11వ శతాబ్దం కాలం నాటి గణేశ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి దారుణానికి ఒడిగట్టారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా బైలడిల్లా అటవీ ప్రాంతంలో ఢోల్‌కల్ పర్వతంపై జరిగిన ఈ దారుణం శుక్రవారం వెలుగుచూసింది. దీనిపై ఆ జిల్లా కలెక్టర్ సౌరభ్‌కుమార్, ఎస్పీ కమలోచన్ కశ్యప్ విచారణ చేపట్టారు.

01/28/2017 - 02:18

హైదరాబాద్, జనవరి 27: ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన నిధులు వెచ్చించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు సూచించారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ఇంకా ఏయే కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి వేర్వేరుగా అన్ని పార్టీల సభ్యులతో కలిసి కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు సిఎం ప్రకటించారు.

01/28/2017 - 02:10

చండ్రుగొండ (ఖమ్మం), జనవరి 27: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదిలో డస్టర్ కోసం ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో టెన్త్ విద్యార్థి తంబళ్ల భానుప్రసాద్ (15) అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం ఇంటర్వెల్ అనంతరం తరగతి గదిలో తంబళ్ల భానుప్రసాద్, కుక్కమూడి శ్రీనాధ్ మధ్య డస్టర్ విషయంలో వివాదం తలెత్తింది.

01/28/2017 - 02:06

ఒంగోలు, జనవరి 27:ప్రకాశం జిల్లా విద్యాశాఖ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖాధికారులు శుక్రవారం రాత్రి మెరుపుదాడులు నిర్వహించారు. చీరాలకు చెందిన బాజీబాబా పాఠశాలకు అనుమతి ఇచ్చేందుకు లంచం ఇవ్వాలని నిర్వాహకురాలు కె శివపార్వతిని జిల్లా విద్యాశాఖాధికారి సుప్రకాశ్ డిమాండ్ చేశారు.

01/28/2017 - 02:02

విశాఖపట్నం, జనవరి 27:విశాఖలో శుక్రవారం ప్రారంభమైన సిఐఐ భాగస్వామ్య సదస్సులో తొలిరోజే ఏపీకి పెట్టుబడుల పంట పండింది. వివిధ సంస్థలు నాలుగు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. రాష్ట్ర పౌరసంబంధాల మంత్రి పల్లె రఘునాథరెడ్డి శుక్రవారం రాత్రి విలేఖరులకు ఈ వివరాలు తెలియజేశారు.

01/28/2017 - 01:58

విశాఖపట్నం, జనవరి 27: రాష్ట్రంలో 2050 నాటికి ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. దేశంలో ఇప్పటికే విద్యుత్, మత్స్య పరిశ్రమ, పాలనలో సాంకేతిక వినియోగం వంటి అనేక అంశాల్లో ఎపి అగ్రగామిగా కొనసాగుతోందని అన్నారు. ఇప్పటికే 12.23 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే రెండంకెల వృద్ధి రేటు సాధించిన ఏకైక రాష్ట్రంగా ఏపి నిలిచిందని చెప్పారు.

01/27/2017 - 04:40

కొత్తగూడెం, జనవరి 26: సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితోపాటు విద్యుత్ రంగంలో ప్రవేశించి, దేశ అవసరాలు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుతున్నట్లు సింగరేణి కాలరీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్ శ్రీ్ధర్ తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా ప్రకాశం స్టేడి యం గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు.

Pages