S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/27/2017 - 03:36

హైదరాబాద్, జనవరి 26: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో గురువారం సాయంత్రం గవర్నర్ నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె చంద్రశేఖర్‌రావు, నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ‘ఎట్ హోం’ ముగిసిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు గవర్నర్ సమక్షంలో పావుగంట పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

01/27/2017 - 02:05

హైదరాబాద్, జనవరి 26: వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 1.45లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుత వార్షిక బడ్జెట్ (2016-17) రూ. 1.30 లక్షల కోట్లు కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో 15 నుంచి 20 వేల కోట్ల రూపాయాలు పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

01/27/2017 - 02:02

ప్రజాప్రతినిధుల ముందు బ్యూరోక్రసీ మోకరిల్లింది. ముఖ్యమంత్రి గారాల పట్టి ఎంపి కవిత పాదాల దగ్గర ఒక సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి ముంగాళ్లపై కూచుని ముచ్చటించటం అందరినీ ఆశ్చర్యపరిచింది. జగిత్యాల జిల్లాలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా గ్యాలరీలో ఎంపి కవిత కూచుని ఉండగా మెట్‌పల్లి సబ్ కలెక్టర్ ముషారఫ్ అలీ మోకాళ్లపై కూర్చుని మంతనాలు జరపడం విస్మయం కలిగించింది.

01/27/2017 - 01:58

హైదరాబాద్, జనవరి 26: తెలంగాణ రాష్ట్రం వేగంగా నగదు రహితంగా మలచడానికి తన ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటోందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఉద్ఘాటించారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాల కోసం తెలంగాణ నిరంతరం తపన పడుతోందని, జల వివాదాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోందని నరసింహన్ పేర్కొన్నారు.

01/27/2017 - 01:54

చిత్రం..రిపబ్లిక్ డే సందర్భంగా గురువారం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో గౌరవ వందనం స్వీకరిస్తున్న గవర్నర్ నరసింహన్

01/27/2017 - 01:28

విజయవాడ, జనవరి 26: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్లతో విజయవాడ నగరం హోరెత్తింది. నగరం నడిబొడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ నేతృత్వంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో తెల్లవారుజామునుంచే సాయుధ పోలీస్ బలగాలు నగరమంతటా మోహరించాయి. వ్యూహాత్మకంగా ప్రతిపక్ష వైకాపా నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు.

01/27/2017 - 02:14

చిత్రం..గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ గురువారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర రావు

01/27/2017 - 01:23

విజయవాడ, జనవరి 26: ‘స్వాతంత్య్రం కోసం పోరాడిన ఎందరో మహనీయులను, త్యాగమూర్తులను, రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకోవడం మన విధి. వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామ’ని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో 68వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

01/27/2017 - 01:15

విశాఖపట్నం, జనవరి 26: ‘ప్రత్యేక హోదాకు సరి సమానమైన ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా దాన్ని ఆమోదించాల్సి వచ్చింది.ప్రత్యేక హోదాకు, ప్యాకేజీకి తేడా లేదన్న విషయాన్ని పదే పదే చెపుతున్నా.ప్రతిపక్ష నాయకుడు ప్రత్యక్ష హోదా గురించి ఎందుకు పట్టుపడుతున్నారో అర్థం కావడం లేద’ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

01/27/2017 - 01:13

హైదరాబాద్, జనవరి 26: ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పన్నుతున్న కుయుక్తులకు నిరసనగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్టవ్య్రాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన జగన్‌ను ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అడ్డుకున్నారు.

Pages