S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/27/2017 - 01:10

విశాఖపట్నం, జనవరి 26: ప్రత్యేక హోదా కోసం ఆంధ్రా యువత పేరిట విశాఖ ఆర్కే బీచ్‌లో గురువారం తలపెట్టిన వౌన దీక్షను పోలీసులు ఉక్కుపాదంతో అణచివేశారు. వైకాపా తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీని సైతం అడ్డుకున్నారు. ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన వైకాపా అధినేత జగన్‌ను నగరంలో అడుగుపెట్టనీయ లేదు. పోలీసుల తీరును నిరసిస్తూ విపక్ష నేత విమానాశ్రయంలో రన్‌పైనే బైఠాయించారు.

01/26/2017 - 09:12

హైదరాబాద్, జనవరి 25: మన దేశంలో ఎన్నికల చట్టాల్లో పక్కా సంస్కరణలు రావల్సిన అవసరం ఎంతైన ఉందని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో ఓటు హక్కును వినియోగించుకునే వారి శాతం బాగా తగ్గిపోతుందని ఆయన విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, జిహెచ్‌ఎంసి సంయుక్త్ధ్వార్యంలో బుధవారం రవీంద్రభారతిలో జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమం జరిగింది.

01/25/2017 - 05:23

మణుగూరు, జనవరి 24: ఎట్టకేలకు గత నెలలో నిర్వాసితుల నోళ్లలో మట్టికొట్టి సింగరేణి సంస్థ ప్రారంభించిన మణుగూరు ఓసీ అమల్లో విజయం సాధించింది. తాజాగా రెండు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఓసీలో రెండు భారీ బొగ్గు నిల్వలు ఉన్న కోల్ బెంచ్‌లకు ఓబీ పనులు నిర్వహిస్తున్న ప్రైవేట్ సంస్థ సింగరేణికి అప్పగించినట్లు సమాచారం.

01/25/2017 - 03:52

హైదరాబాద్, జనవరి 24: సినీనటుడు బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు వినోదం పన్ను మినహాయింపులు ఇచ్చేందుకు సంబంధించి రికార్డులను సమర్పించాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య శాఖను ఆదేశించింది. వినోదం పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సిబి ఆదర్శకుమార్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది పివి కృష్ణయ్య వాదనలు వినిపించారు.

01/25/2017 - 03:52

న్యూఢిల్లీ,జనవరి 24: తెలుగు రాష్ట్రాలలో నియోజక వర్గాల పునర్విభజనకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు హోం మంత్రి రాజ్‌నాథ్‌ను కలిశారు.

01/25/2017 - 03:40

హైదరాబాద్, జనవరి 24: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి కుట్ర పన్నారన్న ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) హెచ్చరికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం చేశాయ. ‘ఉగ్ర’దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర డిజిపిలను ఆదేశించింది.

01/25/2017 - 03:18

హైదరాబాద్, జనవరి 24: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత కొన్ని కొత్త జిల్లాల పేర్లను మార్చడంతోపాటు, కొన్ని గ్రామాలను ఒక మండలం నుండి మరొక మండలంలోకి, ఒక జిల్లా నుంచి మరో జిల్లాలోకి మార్పులు చేర్పులు చేసింది. ఈమేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజి గోపాల్ పేరుతో వేర్వేరుగా 14 ఉత్తర్వులు (జిఓలు) జారీ అయ్యాయి.

01/25/2017 - 03:17

హైదరాబాద్, జనవరి 24: ‘మిషన్ భగీరథ పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లో డిసెంబర్ నెలాఖరకు పూర్తి చేసి ఇంటింటికి మంచినీళ్లు అందించాలి. ఇది దేశానికి ఆదర్శం. స్వయంగా ప్రధాని ప్రారంభించారు. ఏడు రాష్ట్రాలు ఇక్కడికొచ్చి అధ్యయనం చేసి వెళ్లాయి. నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. ఇది పూర్తి కావడానికి ఈ 11 నెలలే అత్యంత కీలకం.

01/25/2017 - 03:15

న్యూఢిల్లీ, జనవరి 24: తెలంగాణలోని ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకూ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే మంత్రి సురేష్ ప్రభు అంగీకరించినట్టు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, తెరాస ఎంపీ నగేష్ తెలిపారు. ఇద్దరు మంత్రులు, ఎంపీ మంగళవారం రైల్వే భవన్‌లో సురేష్ ప్రభును కలిసి ఆర్మూర్- ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణాన్ని కోరుతూ సిఎం కెసిఆర్ రాసిన లేఖను అందించారు.

01/25/2017 - 03:20

సికింద్రాబాద్, జనవరి 24: ఒకవైపు యాదాద్రి, మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎంఎంటిఎస్ కనెక్టివిటీకి చర్యలు ప్రారంభించినట్టు దక్షిణ మధ్య రైల్వే జిఎం పికె యాదవ్ వెల్లడించారు. కనెక్టివిటీకి సంబంధించి సర్వే జరుగుతోందని, ఏప్రిల్‌లో టెండర్లు పిలిచి వచ్చే నవంబర్‌లో పనులు మొదలుపెట్టే యోచనతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు.

Pages