S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/25/2017 - 01:42

హైదరాబాద్, జనవరి 24: రెండ్రోజుల క్రితం పాతబస్తీలో పాదచారిపైకి ఎక్కి చంపిన ఆటో సంఘటన మరువక ముందే మంగళవారం రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. మహిళ అత్తాపూర్‌లోని కాశిపతి ఆటో స్టాండ్ అడ్డావద్ద ఆటో ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. ఆటో రాడ్‌ను పట్టుకుని లోపలికి ఎక్కుతున్న సమయంలో ఆటో ముందుకెళ్లిపోయంది.

01/25/2017 - 01:40

గుంటూరు, జనవరి 24: రాష్ట్రంలో వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో సమూలమార్పులు తీసుకు రానున్నామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.

01/25/2017 - 01:38

కాకినాడ, జనవరి 24: గృహ నిర్బంధాలు, అరెస్టులకు భయపడేది లేదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. రాష్ట్రంలో అందరూ ఆందోళనలు చేయవచ్చు కాని, కాపులు మాత్రం చేయకూడదా? అని ప్రశ్నించారు. కాపులే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను దగ్ధం చేశారని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి దమ్ముంటే తమను అరెస్టుచేసి జైలులో పెట్టాలని సవాల్ విసిరారు.

01/25/2017 - 01:29

విజయవాడ (క్రైం), జనవరి 24: ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖ మరో సవాల్‌ను ఎదుర్కోనుంది. రాష్ట్రంలో ఆందోళనల పర్వం ఒకవైపు, రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు మరోవైపు. ఈ నేపథ్యంలో భద్రత, బందోబస్తు కత్తిమీద సాము లా మారాయి. ఉత్కంఠ పరిస్ధితులు చోటు చేసుకునే అవకాశం ఉన్నందున పోలీసుశాఖ అప్రమత్తమైంది. ఈనెల 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను ఏపి పోలీసు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

01/24/2017 - 01:27

హైదరాబాద్, జనవరి 23: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కందులు పండించిన రైతులు నిరాశ, నిస్పృహలకు గురికావద్దని, కనీస మద్దతు ధరకే వీటిని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశామని రాష్ట్ర మార్కెటింగ్ మంత్రి టి. హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. కందులకు మద్దతు ధర, కొనుగోలుకు సంబంధించి తాజాగా నెలకొన్న పరిస్థితిపై సోమవారం ఆయన అధికారులతో ఇక్కడ సమీక్షించారు. సమీక్షా సమావేశంలో వెల్లడైన వివరాలు ఇలా ఉన్నాయి.

01/24/2017 - 06:49

హైదరాబాద్, జనవరి 23: బడ్జెట్ స్వరూపం మారబోతోంది. గతంలో మాదిరిగా ప్రణాళికా, ప్రణాళికేతర పద్దులు ఇక ముందు ఉండబోం. బడ్జెట్ రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయడంతో దానికి అనుగుణంగా రాష్ట్రాలు బడ్జెట్‌ను రూపొందించుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

01/24/2017 - 01:23

హైదరాబాద్, జనవరి 23: తెరాస సర్కారుకు కీలక పథకమైన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం ఇక వేగాన్ని పుంజుకోనుంది. మార్గదర్శకాలు, నిర్మాణ వ్యయం వంటి పలు సమస్యలతో ఇంతకాలం నత్తనడక నడిచిన ఈ ప్రాజెక్టులో వేగం పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదిలోనే 2.6 లక్షల ఇళ్లను నిర్మించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించారు.

01/24/2017 - 01:10

విజయవాడ, జనవరి 23: రాష్ట్రంలో పెట్టుబడుల కోసం తీసుకుంటున్న చర్యల వల్ల ప్రపంచంలో రాష్ట్రానికి ఒక గుర్తింపు లభించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలతపై విశ్వాసాన్ని పెంపొందించగలిగామన్నారు. దావోస్ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న సందర్భంగా పర్యటన విశేషాలను వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన విలేఖరులకు వివరించారు.

01/24/2017 - 01:08

విజయవాడ, జనవరి 23:ప్రత్యేక హోదాకు జల్లికట్టుతో పోలికేమిటో అర్థంకావడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తమిళనాడు జల్లికట్టు తరహాలో హోదా కోసం ఆందోళనకు సిద్ధమవ్వాలని కొన్ని పార్టీలు నిర్ణయించడంపై అసహనం వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జల్లికట్టు అన్నది ఒక ఆట అని, దాన్ని చూసేందుకు విదేశీయులు వస్తుంటారని తెలిపారు.

01/24/2017 - 01:06

విశాఖపట్నం, జనవరి 23: ఎపి ఎంసెట్- 2017 ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 24 నుంచి 27 వరకూ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2017-18 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఎంసెట్ పరీక్షలను 4 రోజులు నిర్వహించనుంది. ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో సోమవారం విడుదల చేశారు.

Pages