S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/24/2016 - 02:16

హైదరాబాద్, ఏప్రిల్ 23: ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి సుచరితారెడ్డి పోటీ చేయనున్నారు. ఆమె రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి. పాలేరు ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరెడ్డి కన్నుమూయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. పాలేరు అభ్యర్థి ఎంపికపై శనివారం టిపిసిసి కార్యవర్గ సమావేశం చర్చించింది.

04/24/2016 - 02:06

హైదరాబాద్, ఏప్రిల్ 23: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో నిప్పుల కొలిమిలా మారాయి. ప్రచండ భానుడు కురిపిస్తున్న నిప్పుల వర్షానికి జనం అల్లాడి పోతున్నారు. ఒక వైపు ఎండ తీవ్రత, మరో వైపు వడగాడ్పుల విభృంభించడంతో వృద్ధులు, చిన్న పిల్లలు తట్టుకోలేకపోతున్నారు.

04/24/2016 - 02:03

హైదరాబాద్, ఏప్రిల్ 23: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 23 నెలలు గడుస్తున్నా ఇంకా 9, 10 షెడ్యూల్ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలపై తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరలేదు. జనాభా ప్రాతిపదికన హైదరాబాద్ పరిసరాల్లోని ప్రభుత్వ రంగ ఆస్తులు, అప్పుల విభజన జరగాలని ఆంధ్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

04/24/2016 - 02:01

విజయవాడ, ఏప్రిల్ 23: అనంతపురం జిల్లా కదిరి వైకాపా ఎమ్మెల్యే అక్తర్ చాంద్ బాషా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన శనివారం తన అనుచరులతో కలసి విజయవాడలో సిఎం చంద్రబాబును కలిశారు. వారికి ముఖ్యమంత్రి పచ్చ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఇప్పటివరకు తెలుగుదేశంలో చేరిన వైకాపా ఎమ్మెల్యేల సంఖ్య 13కి చేరింది.

04/24/2016 - 01:59

హైదరాబాద్, ఏప్రిల్ 23: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజాస్వామ్యం, అసెంబ్లీ అంటే ఏ మాత్రం నమ్మకం ఉన్నా టిడిపిలో చేర్చుకున్న 12మంది వైసిపి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని, ప్రజలు మళ్లీ ఎవరిని ఎన్నుకుంటారో తేల్చుకుందామని ప్రతిపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సవాలు విసిరారు.

04/24/2016 - 01:58

పోలవరం, ఏప్రిల్ 23: పోలవరం ప్రాజెక్టు 2019 జూన్ నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో పనులు వేగవంతం చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

04/24/2016 - 01:54

హైదరాబాద్, ఏప్రిల్ 23: ఆధునిక అవసరాలు తీర్చలేకపోతున్న ఎంబిబిఎస్ డాక్టర్ చదువు ఎందుకూ పనికి రావడం లేదని ఆరోగ్యం కుటుంబ సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వ్యాఖ్యానించింది. వైద్య విద్య, ఎంసిఐ తీరు తెన్నులపై 134 పేజీల నివేదిక (రిపోర్టు 92)ను సమర్పించింది. ఈ నివేదికపై రెండో దశ బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటు చర్చించనుంది.

04/24/2016 - 01:50

హైదరాబాద్, ఏప్రిల్ 23: ఎల్‌ఇడి బల్బుల పంపిణీలో దేశంలోనే అగ్రగ్రామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ తాజాగా మరో రికార్డు నెలకొల్పబోతోంది. గృహ విద్యుదీకరణలో మే నెలాఖరు నాటికి 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేయనుంది.

04/23/2016 - 06:43

తిరుపతి, ఏప్రిల్ 22: తిరుపతిలో ఇటీవల కాలం వరకు 42 డిగ్రీల ఉష్ణతాపంతో ఉడికి పోయిన ప్రజలకు శుక్రవారం అరగంటపాటు చిరు జల్లులు కురిసి ఊరట నిచ్చాయి. అదే సమయంలో బీభత్సమైన గాలితోడుకావడంతో కొంత భయకంపితులైయ్యారు. ఎక్కడ ఏ విద్యుత్ వైర్లు తెగి నెత్తిన పడతాయో, చెట్లు, ఫ్లెక్సీలు ఎక్కడ కూలుతాయోనని పాదచారులు, వాహన చోధకులు భయభ్రాంతులకు గురైయ్యారు.

04/23/2016 - 02:52

హైదరాబాద్, ఏప్రిల్ 22: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని అంజనీ పుత్రుని శోభాయాత్ర నేత్రపర్వంగా సాగింది. గౌలిగూడ శ్రీరామ మందిరంలో శాంతి హోమంతో ప్రారంభమైన శోభాయాత్ర సికిందరాబాద్ తాడ్‌బంద్ ఆంజనేయ స్వామి దేవాలయం వరకు కొనసాగింది. ఈ శోభాయాత్రలో విహెచ్‌పి జాతీయ, అంతర్జాతీయ నాయకులు పాల్గొన్నారు. భారీ బందోబస్తు మధ్య మొత్తం 8.2 కిలోమీటర్లు సాగిన శ్రీ వీరహనుమాన్ విజయ యాత్ర ప్రశాంతంగా జరిగింది.

Pages