S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/29/2016 - 05:09

విశాఖపట్నం/ హైదరాబాద్, ఆగస్టు 28: హిందూదేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం ఉండకూడదని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ఖరాఖండీగా పేర్కొన్నారు. దేవాలయ వ్యవస్థపై దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న విధానాలపై ఆదివారం రుషీకేష్‌లో జరిగిన సమావేశంలో స్వామీజీ మాట్లాడారు.

08/29/2016 - 05:08

రాజమహేంద్రవరం, ఆగస్టు 28: రాజమహేంద్రవరానికి చెందిన ఒక యువకుడు వంద బైక్‌లు (బుల్లెట్) తన పొట్టపై నుంచి నడిపించుకుని రికార్డు సృష్టించాడు. ఈ విన్యాసాన్ని గిన్నిస్ పుస్తకంలో నమోదుకు పంపారు. కరాటే, బాక్సింగ్, తైక్వాండోలో జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించిన 21వ డివిజన్ కార్పొరేటర్ కొమ్మా శ్రీనివాసరావు కుమారుడు ఉజ్వల్ స్థానిక పుష్కరాల రేవువద్ద ఆదివారం ఈ విన్యాసంచేశారు.

08/29/2016 - 05:06

హైదరాబాద్, ఆగస్టు 28: తెలంగాణ సమగ్ర అభివృద్ధికోసం తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటి (టిజెఎసి) కృషి చేస్తుందని ఈ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. టిజెఎసి ఆధ్వర్యంలో ‘తెలంగాణ అభివృద్ధి నమూనా- టిజెఎసి ఆలోచన’ అన్న అంశంపై ఆదివారం హైదరాబాద్ (నాచారంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్)లో సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సు పూర్తయిన తర్వాత వివరాలను కోదండరాం మీడియా ప్రతినిధులకు వివరించారు.

08/29/2016 - 05:03

అనకాపల్లి, ఆగస్టు 28: సాహితీ పరిమళాలు వెదజల్లే అనకాపల్లి బిడ్డను కావడం పట్ల తనకెంతో గర్వంగా ఉందని, ఇక్కడ పెరిగిన వాతావరణమే తనను ఇంతటి స్థాయికి తీసుకెళ్లగలిగిందని ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెనె్నల సీతారామశాస్ర్తీ అన్నారు. స్థానిక రావుగోపాలరావు కళాక్షేత్రంలో ప్రముఖ సాహితీ సంస్థ డైమండ్ హిట్స్ ఆధ్వర్యంలో పద చక్రవర్తి అవార్డు ప్రదానోత్సవం ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది.

08/29/2016 - 05:00

హైదరాబాద్, ఆగస్టు 28: గ్యాంగ్‌స్టర్ నరుూం ఎన్‌కౌంటర్ బూటకమని, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను వదలిపెట్టమని హెచ్చరిస్తూ ఇటీవల క్రాంతిసేన పేరుతో విడుదలైన పత్రికా ప్రకటన చత్తీస్‌గఢ్ నుంచే వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. క్రాంతిసేన కేంద్ర కమిటీ సభ్యులు జగత్ పట్నాయక్ (ఒడిశా), మధు (మహారాష్ట్ర) పేరిట ఒక ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే.

08/29/2016 - 04:58

హైదరాబాద్, ఆగస్టు 28: హైదరాబాద్ హైటెక్ నగరంగా వ్యాపిస్తున్న తరుణంలో ఐటి ఉద్యోగాలు కూడా బోగస్‌గా మారుతున్నాయి. అమాయక విద్యావంతులు ఉద్యోగాల కోసం బ్రోకర్ల చేతిలో మోసపోతున్నారు.

08/29/2016 - 04:57

హైదరాబాద్, ఆగస్టు 28: హైదరాబాద్‌లో నకిలీ ఎడ్యుకేషనల్ సర్ట్ఫికెట్ల తయారీ ముఠా గుట్టు రట్టయింది. నార్త్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు నకిలీ సర్ట్ఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు.

08/29/2016 - 04:56

భద్రాచలం, ఆగస్టు 28: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని భారత మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ, ఆయన సతీమణి చెన్నమ్మ ఆదివారం దర్శించుకున్నా రు. హెలీకాప్టర్‌లో భద్రాచలం వచ్చిన వారు నేరుగా రామాలయానికి చేరుకున్నారు. అర్చకులు ఆల య సంప్రదాయం ప్రకారం పరివట్టం కట్టి ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద నమస్కరించి గర్భగుడిలో వారు ప్రత్యేక పూజలు చేశారు.

08/29/2016 - 04:04

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు చేపడుతున్నందుకు నిరసనగా వచ్చే నెల 2న సమ్మె నిర్వహించనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల ఉద్యోగుల, కార్మికుల సంఘం అధ్యక్షుడు బి మారుతీ రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాలు అమ్మరాదని, కార్మిక చట్టాల సవరణలను నిలిపివేయాలని, కనీస వేతనం నెలకు రూ.

08/29/2016 - 04:03

నర్సీపట్నం, ఆగస్టు 28: కార్మిక హక్కులను నరేంద్ర మోదీ ప్రభుత్వం హరిస్తోందని కేరళ మత్స్య, జీడిపిక్కల పరిశ్రమల శాఖ మంత్రి మెర్సి కుట్టిఅమ్మ ధ్వజమెత్తారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో సిఐటియు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీడిపిక్కల కార్మికుల సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Pages