S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/16/2016 - 00:50

వరంగల్, ఫిబ్రవరి 15: సారలమ్మ ఆగమానికి ముందే మేడారం భక్తుల రాకతో ఓలలాడింది. సోమవారం కనె్నపెల్లిలోని సారలమ్మ ఆలయంలో కాక వంశీయులైన పూజారులు కాక వెంకటేశ్వర్లు, కాక కిరణ్, కాక కనకమ్మ, కాక భుజంగరావు, లక్ష్మీబాయి, కాక సారయ్యలు సారలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆడేరాలను శుభ్రం చేసి సారలమ్మ తల్లిని మేడారం సాగనంపేందుకు కనె్నపెల్లి గ్రామం మొత్తం సిద్ధమవుతోంది.

02/16/2016 - 00:49

హైదరాబాద్, ఫిబ్రవరి 15: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వార్డుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో, ఇక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడమే తరువాయని రాజకీయ వర్గాలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి.

02/16/2016 - 00:48

హైదరాబాద్, ఫిబ్రవరి 15: మెదక్ జిల్లా, నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితం మంగళవారం వెలువడనుంది. నియోజకవర్గంలోని జూకల్ గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో నిక్షిప్తంగా ఉన్న ఓటర్ల తీర్పు మధ్యాహ్ననికి వెలువడుతుంది.

02/16/2016 - 00:47

ఖమ్మం, ఫిబ్రవరి 15: రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు నీటి సమస్య రానుందని, దాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సిఎం కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ఖమ్మం పర్యటన అనంతరం సోమవారం రాత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కృష్ణా నదిపై కర్ణాటక నిర్మించిన దాదాపు 200 బ్యారేజ్‌ల వల్ల ఈ ఏడాది జూరాలకు చుక్కనీరు రాలేదన్నారు.

02/16/2016 - 00:45

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణలో రాష్ట్రప్రజల సమగ్ర వివరాలను సేకరించిన తీరులోనే రాష్ట్రంలోనూ సమగ్ర సర్వే నిర్వహించి ప్రతి కుటుంబం వివరాలు తెలుసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. రానున్న రోజుల్లో వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించడంతోపాటు త్వరలోనే ముస్లిం రిజర్వేషన్లపైనా కమిటీని నియమించి తగిన నిర్ణయం తీసుకోవాలనే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

02/16/2016 - 00:42

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నెలకొల్పిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో విశాఖకు ఐదోస్థానం దక్కింది. విశాఖ సహా మొత్తం పది నగరాలకు కేంద్రం అవార్డులు ప్రకటించింది. పరిశుభ్రతలో విశాఖపట్నం నగరం దేశంలోనే ఐదోస్థానం దక్కించుకున్నది.

02/16/2016 - 00:41

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యల నివారణకు ఏంచర్యలు తీసుకున్నారో వివరించాలని హైకోర్టు రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో సంభవించిన రైతు మరణాలపై సమగ్ర వివరాలతో నివేదిక అందించాలని హైకోర్టు ఆదేశించింది.

02/16/2016 - 00:40

విజయవాడ, ఫిబ్రవరి 15: రాష్ట్ర రాజధాని అమరావతిలో ఎట్టకేలకు తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 17న ఉదయం 8 గంటల 23 నిముషాలకు భూమిపూజ ద్వారా పనులు ప్రారంభించాలని సోమవారం రాత్రి ఇక్కడి క్యాంప్ కార్యాలయంలో సిఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.

02/16/2016 - 00:39

కదిరిలో నలుగురు మహిళలు దుర్మరణం

02/15/2016 - 01:14

జగిత్యాల, ఫిబ్రవరి 14: సెంట్రల్ ఎక్సైజ్, సేల్‌టాక్స్ అధికారుల నిర్లక్ష్యంతో సర్కారు ఖజానా సమకూరాల్సిన రోజుకు రూ. 3కోట్లు, నెలకు 90 కోట్ల పన్ను వర్థీబీడీ వ్యాపారుల వల్ల గండిపడుతోంది. ఆదాయ పెంపుకోసం కొత్తపుంతలు తొక్కుతున్న ప్రభుత్వం సమర్థత వసూళ్లకు పూనుకోకపోవడంతో ఒక్క వర్థీ బీడీతోనే నెలకు రూ.90కోట్ల ఆదాయాన్ని కోల్పోతున్నట్లు సమాచారం.

Pages