S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/22/2016 - 05:09

వి. ఈశ్వర రెడ్డి

05/22/2016 - 05:02

ఆదిలాబాద్, మే 21: గోదావరి నదీ జలాల చారిత్రక ఒప్పందంలో భాగంగా పెన్‌గంగా నదిపై నిర్మించతలపెట్టిన చెనాక కొరాట బ్యారేజీ నిర్మాణ పనులకు మహారాష్ట్ర నుంచి ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ లభించింది.

05/22/2016 - 05:00

హైదరాబాద్, మే 21: గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్‌లో వివిధ విభాగాల్లో ఉద్యోగాల నియామకానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం ఏడు నోటిఫికేషన్లు జారీ చేసింది.

05/22/2016 - 04:58

హైదరాబాద్,మే 21: మూస పద్ధతిలో కాకుండా వినూత్నంగా ఆలోచించి వాణిజ్య పన్నుల వ్యవస్థను, వసూళ్లను పటిష్ట పర్చాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. సరిగ్గా పన్నులు కట్టేవారికి ప్రోత్సాహకంగా, పన్నులు ఎగవేసే వారిపట్ల కఠినంగా, బాగా పని చేసే అధికారులను వెన్నుతట్టేలా కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని సూచించారు. వాణిజ్య పన్నుల శాఖపై క్యాంపు కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు.

05/22/2016 - 04:47

హైదరాబాద్, మే 21:తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడును కొందరు తప్పుదోవపట్టిస్తున్నారన్న అసంతృప్తి తెదేపా సీనియర్ నాయకులలో పెరుగుతోంది. క్షేత్రస్థాయి సమాచారం తెలియనివారే బాబును తప్పదోవ పట్టిస్తున్నారన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. పార్టీకి దన్నుగా ఉన్న కాపులను దూరం చేసుకునే చర్యలను బాబు సన్నిహితులు ప్రోత్సహిస్తున్న తీరును సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.

05/22/2016 - 04:41

విజయపురిసౌత్, మే 21: నాగార్జునసాగర్ జలాశయం నుండి ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా కృష్ణా డెల్టాకు విడుదలవుతున్న నీటిని శనివారం సాగర్ ప్రాజెక్టు అధికారులు పూర్తిగా నిలిపివేశారు. కృష్ణా డెల్టా ప్రాంతంలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో అధికారులు, ప్రజా ప్రతినిధులు కృష్ణా రివర్ బోర్డుకు విన్నవించుకున్నారు.

05/22/2016 - 04:37

విజయవాడ, మే 21: ఎవరికి ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ వచ్చే జూన్ మాసాంతానికల్లా ప్రభుత్వ శాఖలన్నీ రాజధాని అమరావతికి తరలిరావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ట్భ్రావృద్ధి కోసం కొన్ని త్యాగాలు చేయక తప్పదన్నారు. ఎంసెట్ మెడిసిన్ ఫలితాల విడుదల సందర్భంగా సిఎం క్యాంప్ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

05/22/2016 - 04:42

విజయవాడ, మే 21:ఏపి ఎమ్సెట్ (మెడికల్ అండ్ అగ్రికల్చర్)లో కర్నూలుకు చెందిన మాచాని హేమలత 156 మార్కులతో టాప్ ర్యాంక్ చేజిక్కించుకుంది. కాగా మొదటి పది ర్యాంకుల్లో ఆరింటిని తెలంగాణ విద్యార్థులు కైవసం చేసుకోవడం విశేషం. ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం విడుదల చేశారు. హైదరాబాద్‌కు చెందిన యర్ల సాత్విక్ రెడ్డి (156 మార్కులు) రెండోర్యాంకును, యజ్ఞప్రియ (153) మూడో ర్యాంకును సాధించారు.

05/22/2016 - 04:11

హైదరాబాద్, మే 21: తెలుగు రాష్ట్రాలకు చెందిన బిజెపి అగ్రనేతల భవితవ్యంపై తర్జనభర్జన జరుగుతోంది. రానున్న రాజ్యసభ ఎన్నికల్లో వారిలో ఎంతమందికి సీట్లు వరిస్తాయి? ఎవరిని కేంద్రంలో తీసుకుంటారు? ఎవరికి పార్టీ పదవి అప్పగిస్తారన్న అంశంపై పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.

05/22/2016 - 05:07

కర్నూలు, మే 21: వైద్యవిద్యను అభ్యసించేందుకు రాసిన ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు వచ్చినా వయస్సు తక్కువ ఉందని అభ్యంతరం వ్యక్తం చేసిన అధికారులు, ప్రభుత్వం ఆశ్చర్యపోయేలా ఏడాది కాలంలో తిరిగి ప్రవేశ పరీక్ష రాసి శనివారం విడుదలైన మెడిసిన్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 156 మార్కులతో రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంకు సాధించి తన ప్రతిభను చాటుకుంది కర్నూలు విద్యార్థిని.

Pages