S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/22/2016 - 03:57

హైదరాబాద్, మే 21: అమెరికాలో జరిగే ఆటా సభలకు హాజరు కావాలని కోరుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ఆటా ప్రతినిధులు శనివారం కలిశారు. జూలై 1 నుంచి మూడు రోజుల పాటు అమెరికాలోని చికాగోలో జరిగే అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభకు ముఖ్య అతిథిగా రావాలని కెసిఆర్‌ను ఆటా ప్రతినిధులు కోరారు.

05/22/2016 - 03:55

హైదరాబాద్, మే 21: పాలేరు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు వల్ల కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ చేసిన ఐఎఎస్ అధికారి లోకేశ్ కుమార్‌ను తిరిగి ఖమ్మం కలెక్టర్‌గా నియమించారు. జిల్లా కలెక్టర్, ఎస్‌పి అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో కేంద్రం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

05/22/2016 - 03:54

విశాఖపట్నం, మే 21: కష్ట పడినందుకు ఫలితం దక్కింది. ఎండి (న్యూరాలజీ) చేయాలని తనకు ఎప్పటి నుంచో కోరిక అని, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు రోజుకు దాదాపు 16 గంటలు కష్టపడి చదివి ఎమ్సెట్‌లో 7వ ర్యాంక్ సాధించానని పెద్దిరెడ్ల శైలజ పేర్కొంది.

05/22/2016 - 03:53

హైదరాబాద్, మే 21 : రాష్ట్రంలో రాజకీయ సమరం కొత్త పుంతలు తొక్కుతోంది. అధికార తెలుగుదేశం- ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం-బిజెపి మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న గ్రాఫిక్స్ యుద్ధం ఆసక్తికరంగా మారుతోంది. ప్రధానంగా వాట్సాప్‌లో టిడిపి-వైసీపీ మధ్య జరుగుతున్న గ్రాఫిక్ వార్ నవ్వు తెప్పిస్తోంది.

05/21/2016 - 06:27

హైదరాబాద్, మే 20: రాష్ట్ర ఆవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి జిల్లాకు రూ. 30 లక్షలు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ వెల్లడించారు. సచివాలయం నుంచి శుక్రవారం వివిధ శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఆవతరణ వేడుకల ఏర్పాట్లపై రాజీవ్‌శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

05/21/2016 - 06:27

విజయవాడ, మే 20: కనిపెంచిన తల్లిని ఆసుపత్రిలో చేర్పించి సపర్యలు చేస్తూ రోడ్డు ప్రమాదానికి గురై తండ్రి అకాల మరణం చెందటాన్ని తట్టుకోలేక ముగ్గురు తోబుట్టువులు కూడబలుక్కొని రాయనపాడులో రైలుపట్టాలపై పడుకొని ఆత్మహత్యకు పాల్పడగా వారిలో ఇద్దరు అక్కడికక్కడే మరణిస్తే మరొకరు కొన వూపిరితో ప్రైవేట్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న విషాదకర ఉదంతం ఇది. శుక్రవారం తెల్లవారుజామున జరిగింది.

05/21/2016 - 06:26

హైదరాబాద్, మే 20: ఒక రాష్ట్ర వ్యవహారాల్లో మరో రాష్ట్రం జోక్యం చేసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అని ఆర్‌డిఎస్ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఆర్‌డిఎస్ పనులు నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోవద్దని పనులు కొనసాగించాలని తెలంగాణ నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు కర్నాటక నీటిపారుదల మంత్రి ఎంబి పాటిల్‌ను కోరారు.

05/21/2016 - 06:25

విజయవాడ, మే 20: ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వోద్యోగులతో సమానంగా పిఆర్‌సి అమలుతో పాటు పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పొడిగించే అంశాన్ని సానుభూతితో పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని ఏపి సిఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

05/21/2016 - 06:25

హైదరాబాద్, మే 20: ఐదేళ్లుగా వివాదాస్పదంగా ఉన్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు (నీట్)ను వచ్చే ఏడాది వరకూ వాయిదా వేయాలని కేంద్రం నిర్ణయించడంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా చాలా రాష్ట్రాల్లో సరికొత్త సమస్యలు మొదలయ్యాయి.

05/21/2016 - 06:24

ఆదోని, మే 20 : రాజోలి బండ ఆనకట్ట వద్ద కర్ణాటక జలచౌర్యానికి అడ్డుకట్ట వేయకపోతే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు జలగండం తప్పదు. వేలాది ఎకరాలు బీడు భూములుగా మారటం కూడా ఖాయం. రాజోలిబండ ఆనకట్ట అజమాయిషీ కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది. ఎడవ కాలువ 42 కిలోమీటర్ల మేర కర్ణాటకలోనే ఉంది. అందువల్ల రాజోలి బండ ఆనటకట్ట వద్ద కర్ణాటక జలచౌర్యం యథేచ్ఛగా సాగుతోంది.

Pages