S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/22/2016 - 04:01

ఖమ్మం, జూలై 21: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తెలంగాణకు జల వివాదాలేమీ లేవని, అయితే ఆ రాష్ట్రానికి తెలియని విషయాలను చెప్తుంటే పట్టించుకోకుండా వివాదాలకు తావిస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

07/22/2016 - 03:07

హైదరాబాద్, జూలై 21: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. తన ఢిల్లీ పర్యటన విశేషాలను ముఖ్యమంత్రి ఆయనకు వివరించినట్టు తెలిసింది. ప్రధానంగా వచ్చే నెల మొదటి వారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు రావడానికి సుముఖత వ్యక్తం చేసిన విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గవర్నర్‌కు వివరించినట్టు తెలిసింది.

07/22/2016 - 03:05

తిరుపతి, జూలై 21: తిరుపతి సమీపంలోని శేషాచల అడవుల్లో గురువారం తెల్లవారుజామున కూంబింగ్ చేస్తున్న టాస్క్ఫోర్స్ పోలీసులపై ఎర్రకూలీలు రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనలో కానిస్టేబుల్ దిలీప్‌కుమార్ గాయపడ్డాడు. దీంతో పోలీసులు రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. పలువురు కూలీలు పారిపోగా ఇద్దరు కూలీలు పట్టుబడ్డారు.

07/22/2016 - 03:04

హైదరాబాద్, జూలై 21: తెలంగాణ రాష్ట్రంలో ఆలయాల పరిపాలన సమర్థవంతంగా ఉండేందుకు వీలుగా వెంటనే ధార్మిక పరిషత్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ డిమాండ్ చేసింది. సికింద్రాబాద్‌లోని సంతోషిమాత ఆలయంలో గురువారం జరిగిన బ్రాహ్మణ పరిషత్ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.

07/22/2016 - 03:01

హైదరాబాద్, జూలై 21: కమలనాథన్ సారథ్యంలోని ఉద్యోగుల విభజన సలహా కమిటీ శుక్రవారం సమావేశం కానుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి ఠక్కర్‌లు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఉద్యోగుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా వ్యవహరిస్తున్నారని వివిధ సందర్భాల్లో తెలంగాణ ఉద్యోగ సంఘాలు కమిటీ దృష్టికి తీసుకు వచ్చారు.

07/22/2016 - 03:00

హైదరాబాద్, జూలై 21: తెలంగాణ ఎమ్సెట్-2 పేపర్ లీక్ ఘటనపై సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ ఘటనపై ఎమ్సెట్ కన్వీనర్ రమణారావు తెలంగాణ డిజిపి అనురాగ్‌శర్మను కలసి సిఐడి దర్యాప్తు జరిపించాలని కోరిన సంగతి తెలిసిందే. డిజిపి ఆదేశానుసారం సిఐడి దర్యాప్తును చేపట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన టాప్ ర్యాంకర్లకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రుల కాల్ డేటాను సేకరించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

07/22/2016 - 02:59

హైదరాబాద్, జూలై 21: ఈనెల 24వ తేదీన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో జరగనున్న నీట్-2 పరీక్ష నిర్వహణకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. రెండు రాష్ట్రాల నుంచి 20 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్‌లో ఈ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు జరుగుతుంది.

07/22/2016 - 02:56

హైదరాబాద్, జూలై 21: స్మార్ట్ సిటీ ప్రణాళిక కోసం సిస్కోతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయు కుదుర్చుకుంది. మున్సిపల్ వ్యవహారాలు, ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు సమక్షంలో సచివాలయంలో గురువారం ఈ ఒప్పందం కుదిరింది. సిస్కో స్మార్ట్ సిటీ ప్రణాళికలు, సొల్యూషన్స్‌లో ప్రపంచంలో మంచి పేరున్న సంస్థ.

07/22/2016 - 02:30

హైదరాబాద్, జూలై 21:కేబుల్ టివి ప్రసారాల పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మహిళలు, పిల్లల గౌరవాన్ని టివి ఛానెళ్లు కాపాడుతున్నాయా లేదా అన్న అంశంతోపాటు కేబుల్ టివి నెట్‌వర్క్ (రెగ్యులేషన్) చట్టాన్ని చానెళ్లు అట్టడుగు స్థాయిలో సక్రమంగా అమలు చేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని ఈ కమిటీలు పరిశీలిస్తాయి.

Pages