S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/29/2016 - 03:14

వరంగల్, జూలై 28: ‘ఎవరో చేసిన తప్పుకు మమ్మల్ని బలిచేయకండి. తాము కష్టపడి చదువుకొని ర్యాం కులు సాధించుకున్నాం. ఇప్పటికే రెండుసార్లు ఎంసెట్ రాశాం’ అంటూ ఎంసెట్-2లో మెడిసిన్‌కు ఎంపికైన విద్యార్థినీ, విద్యార్థులు గురువారం వరంగల్‌లో డిప్యూటీ సిఎం కడియం శ్రీహరిని కలిసి వేడుకున్నారు.

07/29/2016 - 03:12

వరంగల్, జూలై 28: ఎంసెట్-2 లీక్‌పై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. గురువారం వరంగల్‌లో విలేఖరులతో మాట్లాడుతూ ఎంసెట్-2 లీక్‌పై సిఐడిచే విచారణ జరిపిస్తున్నందున ఈ విషయంపై తానేమీ మాట్లాడినా తప్పుడు సంకేతం వెళ్తుందని.. సిఐడి నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంసెట్-2 లీక్‌పై రాద్ధాంతం అనవసరమన్నారు.

07/29/2016 - 03:10

హైదరాబాద్, జూలై 28: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఎమ్సెట్ ప్రవేశ పరీక్ష లీక్ కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం ఆయన ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏపిలో ఎమ్సెట్ లీక్ అయ్యిదంటూ వైకాపా ప్రచారం చేయడం దారుణమన్నారు. పోలీసులు, అధికారులతో మాట్లాడిన తర్వాత తాను ఈ విషయాన్ని చెబుతున్నట్లు చెప్పారు.

07/29/2016 - 03:05

హైదరాబాద్, జూలై 28: తెలంగాణలో విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మూడు జీవోలను హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఏపి వర్శిటీల చట్టానికి సవరణలు చేసిన తర్వాత ఈ జీవోలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 నిబంధనలకు వ్యతిరేకంగా ఈ మూడు జీవోలను జారీ చేశారని, ఇది అక్రమమని హైకోర్టు పేర్కొంది.

07/29/2016 - 03:04

హైదరాబాద్/ నల్లకుంట, జూలై 28: తెలంగాణ పునర్నిర్మాణంలో అహర్నిశలు కృషి చేసిన చరిత్ర పరిశోధకుడు డాక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్ర్తీ బ్రెయిన్ హేమరేజ్‌కు గురై ఆసుపత్రిలో వ్యాధి తీవ్రరూపం దాల్చి బుధవారం సాయంత్రం మృతి చెందారు. పివి పరబ్రహ్మశాస్ర్తీ భౌతికకాయాన్ని అభిమానులు, బంధుమిత్రుల సందర్శనార్థం గురువారం 10 గంటలకు నల్లకుంటలో ఉన్న ఆయన నివాసానికి తరలించారు.

07/29/2016 - 02:58

హైదరాబాద్, జూలై 28:ఎమ్సెట్ భవితవ్యం నేడు తేలనుంది. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినా పర్యవసానాలపై మల్లగుల్లాలు పడుతోంది. ప్రశ్నపత్రం లీక్ నిజమేనంటూ సిఐడి కుండబద్దలు కొట్టిన నేపథ్యంలో ప్రభుత్వం వద్ద మరో ప్రత్యామ్నాయం కూడా లేదని తెలుస్తోంది. అయితే తల్లిదండ్రులు, విద్యార్థుల స్పందన ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

07/29/2016 - 02:45

హైదరాబాద్: ఎంసెట్ అంటే ఓ టార్చర్‌గా మారింది. ఎంసెట్ అనీ, నీట్ అనీ మమ్మల్ని రకరకాలుగా అయోమయానికి గురి చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ఎంసెట్ అంటే నేను సిద్ధంగా లేను. ఒకవేళ మా అభిప్రాయాలను పట్టించుకోకుండా ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయిస్తే విద్యార్థుల్ని మానసిక క్షోభకు గురి చేసినట్టే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయక తప్పదు.

07/29/2016 - 02:41

హైదరాబాద్, జూలై 28: ఎమ్సెట్-3 నిర్వహణకు జెఎన్‌టియు రోడ్‌మ్యాప్ ఖరారు చేసింది. ఎమ్సెట్-2 పరీక్ష రద్దయిన పక్షంలో ప్రభుత్వం ముందు ఉంచేందుకు వీలుగా ఎమ్సెట్-3కి ప్రణాళికను ఇప్పటికే రూపొందించినట్టు తెలిసింది. ఎమ్సెట్ భవితవ్యంపై నిర్ణయం తీసుకోవడానికి శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు.

07/29/2016 - 02:35

హైదరాబాద్, జూలై 28: తెలంగాణ ఎమ్సెట్-2 లీకేజి కేసులో సిఐడి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరిని మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపర్చారు. సంచలనం కలిగిస్తున్న ఈ కేసులో విష్ణ్ధుర్ అలియాస్ విష్ణువర్ధన్, తిరుమల్ అలియాస్ తిరుమల్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో వెల్లడైన కీలకమైన అంశాలను సిబిఐ గురువారం వెల్లడించింది.

07/29/2016 - 02:53

విజయవాడ, జూలై 28: సెప్టెంబర్ నాటికల్లా అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం మున్సిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు కంప్యూటరైజేషన్, ఆటోమేషన్‌తో మున్సిపల్ పాలనా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చామని చెప్పారు.

Pages