S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/13/2017 - 02:54

హైదరాబాద్, జనవరి 12: పరిశ్రమల స్థాపన పేరిట ప్రభుత్వం నుంచి చౌకగా భూములు పొంది వినియోగించుకోని సంస్థలపై కొరడా ఝళిపించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియలో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ప్రస్తుతం ఉన్న చట్టానికి మరింత పదును పెట్టాలని యోచిస్తోంది.

01/13/2017 - 01:24

విజయవాడ, జనవరి 12: డైరక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో కేవలం ఐదు రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ బిల్లులు అగ్నికి ఆహుతి అయిన ఘటనపై ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య సీరియస్ అయ్యారు.

01/13/2017 - 01:40

అమరావతి, జనవరి 12: సంక్రాంతి సంబరాలంటే గుర్తుకొచ్చేది కోడిపందేలు. కృష్ణా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరగనున్న కోడిపందేల్లో పాల్గొనేందుకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నుంచి పందెం రాయుళ్లు ఇప్పటికే తరలివచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని రంగాలపై పెద్దనోట్ల రద్దు ప్రభావం కనిపిస్తుండగా, కోడిపందేలకు మాత్రం అలాంటి ఇబ్బందులున్నట్లు కనిపించడం లేదు.

01/13/2017 - 01:18

హైదరాబాద్, జనవరి 12: వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులకు ప్రవేశపరీక్షల షెడ్యూలును తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. తెలంగాణలో ఇంజనీరింగ్ స్ట్రీం పరీక్ష మే 12న ఉదయం, మెడికల్ కోర్సులు, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ విభాగంలో చేరేందుకు మే 12వ తేదీ సాయంత్రం ప్రవేశ పరీక్షలు జరుగుతాయి.

01/13/2017 - 01:15

విజయవాడ, జనవరి 12: రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాలుండగా రానున్న రోజుల్లో ఇతర జిల్లాల్లోనూ ఏర్పాటుకు కేంద్రం చొరవ చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దేందుకు ముందస్తుగా శాశ్వత టెర్మినల్ నిర్మించాలని కోరారు. కార్గో సర్వీసులు కూడా ప్రవేశపెట్టాలని కోరారు.

01/12/2017 - 07:44

హైదరాబాద్, జనవరి 11: కాలుష్య నివారణకు పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎల్‌పిజి, సిఎన్‌జి వాహనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ఓవర్ లోడింగ్ వాహనాలను నియంత్రించాలని సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కూడా అయిన రాజీవ్ శర్మ సచివాలయంలో బుధవారం రవాణా, పౌరసరఫరా, పోలీస్, మున్సిపల్ ఉన్నతాధికారులతో రాజీవ్ శర్మ సమావేశమయ్యారు.

01/12/2017 - 07:25

హైదరాబాద్, జనవరి 11: దేశంలో ప్రవేశ పరీక్షల నిర్వహణకు ప్రత్యేక జాతీయ సంస్థ ఏర్పాటు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ప్రతి ఏటా వెయ్యివరకూ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుంటే, అందులో ప్రతి విద్యార్ధి ఉన్నత చదువులకు కనీసం అరడజను పరీక్షలకు హాజరుకావల్సి వస్తోంది. ఈ ప్రవేశ పరీక్షలను వేర్వేరు సంస్థలు నిర్వహిస్తున్నాయి. దానివల్ల విద్యార్ధులకు సైతం లేనిపోని గందరగోళం ఏర్పడుతోంది.

01/11/2017 - 08:19

హైదరాబాద్, జనవరి 10: వాతావరణ మార్పులతో నీరు, గాలి కాలుష్యంపై ప్రభావం చూపిస్తున్నందున దీనిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ (ఇపిటిఆర్‌ఐ) తెలిపింది.

01/10/2017 - 03:32

హైదరాబాద్, జనవరి 9: రెండు తెలుగు రాష్ట్రాలూ ఆంగ్లభాష మోజులో పడ్డాయి. 2010 నుండి ఇందుకు సంబంధించిన ప్రణాళికలు వేస్తున్నా, సరైన వౌలిక సదుపాయాలు, నిపుణులను సిద్ధం చేసుకోకుండానే పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం క్లాసులు నిర్వహించేందుకు సన్నద్ధం కావడం వివాదాస్పదం అవుతోంది. ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రాలోనూ భాషాభిమానులు ప్రభుత్వ చర్యలను తూర్పారపడుతున్నారు.

01/10/2017 - 03:27

యానాం, జనవరి 9: పుదుచ్ఛేరిలో నూతన పారిశ్రామిక విధానం అమలు ఇప్పట్లో సాధ్యం కాదని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ అన్నారు. యానాం ప్రజాఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన ఆమె సోమవారం ఉదయం స్థానిక పరిపాలనాధికారి కార్యాలయంలో ప్రజల వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా విలేఖరులతో మాట్లాడారు.

Pages