S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/09/2017 - 01:23

హైదరాబాద్, జనవరి 8: తెలంగాణ రాష్ట్రంలో రెండవ దషా కూడా అధికార పగ్గాలు చేపట్టే దిశగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం కార్యాచరణతో ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉండగా, ప్రతి కుటుంబానికి లబ్ధి కలిగేలా వ్యూహాత్మకంగా సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసింది. తద్వారా రానున్న ఎన్నికలలో సునాయాసంగా తిరిగి అధికార పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమం అవుతుందన్నది ముఖ్యమంత్రి అంచనా.

01/09/2017 - 01:20

సిద్దిపేట, జనవరి 8 : ఆర్టీసి బస్సుల్లో చిల్లర కష్టాలను దూరం చేసేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేట ఆర్టీసి బస్సుల్లో స్వైప్ మిషన్లను ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆర్టీసి నష్టాలబాటలో ప్రయాణిస్తుంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా పెద్దనోట్లు రద్దు సంస్థపై పిడుగుపాటుగా మారిందని ఆయన అన్నారు.

01/09/2017 - 01:18

చిత్రం..ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదాద్రి పాతగుట్ట ఆలయంలో స్వామివారి ఉత్తరద్వార దర్శనం
చేసుకునేందుకు వచ్చిన భక్తజన సందోహం

01/09/2017 - 01:12

విజయవాడ, జనవరి 8: భారతదేశంలో పేదరికం అంతం కావాలంటే స్వయం ఉపాధే మార్గమని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. సంస్కృతీ సంప్రదాయాలకు పురిటిగడ్డ అయిన గ్రామాలను ఎప్పటికీ మరువరాదన్నారు. కృష్ణాజిల్లా ఆత్కూరులో ఆదివారం జరిగిన స్వర్ణ్భారత్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు.

01/09/2017 - 01:10

చిత్రం..వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆదివారం స్వర్ణరథంపై ఊరేగిన శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో భక్తులతో తిరుమల కిటకిటలాడింది.

01/09/2017 - 00:57

విజయవాడ, జనవరి 8: వివిధ ప్రాంతాల అభివృద్ధిలో శ్రీలంక ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలు, నమూనాలు కొన్ని అమరావతికి సారూప్యంగా ఉండటంతో వాటి తీరుతెన్నులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తిగా పరిశీలించారు. కొలంబో పరిసరాల్లో బహుముఖీనంగా చేసిన అభివృద్ధిపై దృష్టిపెట్టిన చంద్రబాబుకు శ్రీలంక ప్రభుత్వం అక్కడి ప్రణాళికలను వివరించింది.

01/08/2017 - 08:54

గుంటూరు, జనవరి 7: సినీరంగానికి దూరంగా పదేళ్లు గడిపి తిరిగి అభిమానుల కొండంత శక్తితో పునఃప్రవేశం చేయటం ఆనందంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మంగళగిరి హాయ్‌లాండ్‌లో తన 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ ప్రీ రిలీజ్ వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభిమానుల శక్తి అనుభవపూర్వకంగా తనకు తెలుసన్నారు. చాలా సంవత్సరాల నిరీక్షణ అనంతరం తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడం తనలో అంతుచిక్కని శక్తినిచ్చినట్లయిందన్నారు.

01/08/2017 - 08:52

భద్రాచలం, జనవరి 7: కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీరామ దివ్యక్షేత్రం ముక్కోటి శోభను సంతరించుకుంది. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా నేడు శ్రీ సీతారామచంద్రస్వామి హంసవాహనంలో పవిత్ర గోదావరి నదీ తీరంలో విహరించనున్నారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా నేడు తెప్పోత్సవం, సోమవారం ఉత్తరద్వార దర్శనం నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది.

01/08/2017 - 08:50

తిరుపతి, జనవరి 7: శాస్త్ర సాంకేతిక రంగాలపై నేటి యువత దృష్టి సారించాలంటే ఆయా రాష్ట్రాల మాతృభాషలోనే సైన్స్ బోధన సాగాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. ఎస్వీయూలో ఈనెల 3న ప్రారంభమైన 104 ఇస్కా సదస్సు శనివారం ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిధిగా విచ్చేశారు.

01/08/2017 - 08:49

తిరుపతి, జనవరి 7: తిరుపతిలో జరుగుతున్న ఇస్కా సభ ముగింపు సందర్భంగా వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించిన వారికి నిర్వాహకులు అవార్డులతో సత్కరించారు.

Pages